Jump to content

30న కృష్ణపట్నం థర్మల్‌ ప్లాంటు జాతికి అంకితం


sonykongara

Recommended Posts

ప్రారంభించనున్న కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌
 
హైదరాబాద్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): కృష్ణపట్నం పోర్టులో ఏపీ జెన్‌కో స్థాపించిన శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్‌ ప్లాంటును ఈ నెల 30న జాతికి అంకితం చేయనున్నారు. ఒకొక్కటి 800 మెగావాట్ల చొప్పున సామర్థ్యం గల రెండు యూనిట్లను ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం.. కేంద్ర ఇంధన శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ను ఆహ్వానించింది. ఆందుకు ఆయన సమ్మతించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఈ థర్మల్‌ విద్యుత్కేంద్రం ట్రయల్‌ రన్‌ ఇప్పటికే ముగిసింది. తొలుత కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాటిని సరిదిద్దారు. దీంతో ఈ ప్రాజెక్టును జాతికి అంకితం ఇచ్చేందుకు ఏపీ సర్కార్‌ సిద్ధమైంది.

 

Link to comment
Share on other sites

హైదరాబాద్‌, నవంబరు4 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు సరఫరా, పంపిణీ, ఉత్పత్తి, విద్యుదుత్పత్తి కేంద్రాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేయించడం వంటి అంశాల్లో ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కోలకు ఎనర్జీ ఎనార్షియా సంస్థ ప్రతిభా అవార్డులను ప్రకటించింది. విద్యుత్తు ఉత్పత్తిలో ప్రభుత్వ రంగ సంస్థగా ఏపీ జెన్‌కో విశేష ప్రతిభ కనబరుస్తోందని ఈ సంస్థ పేర్కొంది. అవార్డులను ఢిల్లీలో ట్రాన్స్‌కో సీఎండీ కె.విజయానంద్‌ అందుకుంటారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...