Jump to content

బందరు పోర్టుకి భూసమీకరణే మార్గం


sonykongara

Recommended Posts

  • భూసేకరణ సాధ్యమేనా ?
  •  భూ సమీకరణే మార్గమా..
  •  రైతులకు అదే లాభదాయకమా 
  •  పోర్టు భూముల సేకరణలో కొత్త ప్రశ్నలు ఉత్పన్నంబందరు పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములు ఏవిధంగా సమకూర్చుకోవాలో అనే అంశంపై తర్జన భర్జన జరుగుతోంది. భూసేకరణ ద్వారా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటి వరకు భావించింది. భారీగా పెరిగిన భూముల ధరలతో అది సాధ్యం కాదనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భూ సమీకరణే (ల్యాండ్‌పూలింగ్‌) మార్గంగా ఉంది. రైతులకు అదే లాభదాయకం కానుంది. భూసేకరణ విషయంలో కొత్త ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.  ( ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం) పోర్టు నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారంటూ ప్రజలు ఎదురు చూస్తుండగా అందుకు అవసరమైన భూ సేకరణ సవాల్‌గా మారుతోంది. ఈనెల 1 నుంచి భూ ముల ధరలు భారీగా పెరగడంతో భూసేకరణ సాధ్యమేనా అనిపిస్తోంది. పోర్టుకు అవసరమైన భూసేకరణకు ఇంతకు ముందు సుమారు 550 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈనెల 1 నుంచి పెరిగిన భూముల ధరలతో అది 12 వందల కోట్లకు చేరుతుందని అంచనా. భూముల విలువును వంద శాతం వరకు పెంచుకోవచ్చని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగా బందరు ప్రాంతంలో 50 నుంచి 80 శాతం మేర భూములు ధరలు పెరిగాయి. పోర్టు భూములు గల గ్రామాలలో 40 నుంచి 50 శాతం వరకు భూముల ధరలు పెరిగినట్టు తెలుస్తోంది. దీంతో 550 కోట్లు అనుకున్న భూసేకరణ ఖర్చు 12 వందల కోట్లకు చేరుతుందని అంచనా వేయడంలో అతిశయోక్తి లేదు. లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అంత మొత్తాన్ని భూసేకరణకు ఖర్చు చేయడం కత్తిమీద సాము అవు తుంది. పోర్టు నిర్మాణం ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రభుత్వంపై భారం పెరిగి పోతుంది. ఈ పరిస్థితులలో భూసేకరణ సాధ్యం కాదని భూ సమీకరణే (ల్యాండ్‌పూలింగ్‌) మార్గమనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. భూ సమీకరణే మార్గం

    పోర్టు నిర్మాణం జరగాలంటే భూసేకరణ కంటే భూ సమీకరణే మార్గంగా ఉంది. రైతులకు అదే లాభదాయకం అవుతుంది. పోర్టు నిర్మాణంకు 4800 ఎకరాల భూమి కేటాయించాల్సి ఉంది. ఈ భూములను ప్రభుత్వం సేకరించి నిర్మాణ సంస్థ నవయుగకు పోర్టు డైరెక్టర్‌ ద్వారా అప్పగించాల్సి ఉంది. ఇందుకు అవసరమైన కసరత్తు జరిగింది. భూముల గుర్తింపు, సర్వే తదితర పనులు పూర్తయ్యాయి. 2355 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించారు. అలాగే 2208 ఎకరాల ప్రైవేటు భూములను గుర్తించారు. ఆయా భూములకు సంబంధించిన నివేదికలను జిల్లా యంత్రాంగం తయారు చేసింది. ప్రభుత్వానికి పంపించి నెలలు గడుస్తున్నా మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. భూసేకరణ నోటిఫికేషన్‌ తదితర ఖర్చుల నిమిత్తం 5 కోట్ల రూపాయలు విడుదల చేసిన ప్రభుత్వం భూసేకరణ విషయంలో ముందుకు రాలేక పోయింది. ఈ నేపధ్యంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ దశలో భూసేకరణ కంటే భూ సమీకరణే ఉత్తమం అనే అభిప్రాయంతో ఉన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌కు రైతులు ఏవిధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. మార్పుతో పాటు అభివృద్ధికి సహకరించాల్సిన బాధ్యత వారిపై కనిపిస్తోంది.

    రైతులకు లాభదాయకమేనా?
    భూ సమీకరణ ద్వారా పోర్టుకు భూములు తీసుకోవాలనే అంశం తెరపైకి రావడంతో ల్యాండ్‌ఫూలింగ్‌ విధానం రైతులకు లాభదాయకమేనా అనే విషయం చర్చనీయాంశంగా మారింది. పోర్టుకు అవసరమైన భూములు తీసుకున్న రైతాంగానికి లాభదాయకమైన ప్యాకేజీ కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. అన్ని రకాల అభివృద్ధి చేసిన భూమిలో వెయ్యి గజాలను రైతులకు కేటాయించాలనే ఆలోచనలో ఉన్నారు. పోర్టు నిర్మాణం జరిగి మచిలీపట్నం కూడా కాకినాడ, వైజాగ్‌, నెల్లూరు మాదిరిగా అభివృద్ధి చెందితే ఈ ప్రాంత భూములకు ఎంతో విలువ చేకూరుతుంది. ఈ నేపధ్యంలో అభివృద్ధి చేసిన భూముల్లో వెయ్యి గజాల భూమిని రైతుకు కేటాయిస్తే భూసేకరణ కంటే భూ సమీకరణ ద్వారానే రైతులకు మేలు జరుగుతుందనడంలో సందేహం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భూ సేకరణ ద్వారా రైతులకు ఎకరానికి గరిష్టంగా 20 నుంచి 25 లక్షలు కేటాయించవచ్చనే ఆలోచనలో అధికారులున్నారు. అదే భూ సమీకరణ ద్వారా అయితే దీనికి నాలుగురెట్లు అధికంగా రైతు కు అందే అవకాశం ఉంది. ప్రస్తుతం సాధారణ భూముల ధరలే గజం నాలుగైదు వేల రూపాయలు పలుకుతోంది. అదే అభివృద్ధి చేసిన భూములైతే గజం పదివేలు పైమాటే అనడంలో అతిశయోక్తి లేదు. పైగా ల్యాండ్‌పూలింగ్‌ కు ప్రభుత్వం నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉండదు. ప్రైవేటు భాగస్వామ్యంతో భూముల అభివృద్ధి చేపట్టి ఆ భూములను రైతులకు కేటాయిస్తారు. ఈ ప్రక్రియ నత్తనడకన కాకుండా త్వరితగతిన చేపట్టడంతో పాటు ఆ దిశగా రైతులను ఒప్పించడంలోను అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకోవాల్సి ఉంది.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...