Jump to content

టెంపర్ ఆడియోకి బాలయ్య?


Vinod

Recommended Posts

బాబాయ్-అబ్బాయ్ మళ్ళీ ఒకే వేదికపై కనిపించి అభిమానుల్లో జోష్ పెంచబోతున్నారని ఇన్‌సైడ్ న్యూస్. కొంతకాలంగా బాలకృష్ణ-ఎన్టీఆర్‌ల మధ్య ఉన్న విభేదాలు ‘టెంపర్’ ఆడియో వేడుకతో సర్దుకుంటాయని ఫ్యాన్స్ అంచనా! బాలకృష్ణతో, టీడీపీతో గ్యాప్ పాటిస్తున్న ఎన్టీఆర్‌కు కొన్నేళ్లుగా సరైన హిట్ లేదనే సంగతి తెల్సిందే. అందువల్లే  ఫ్యాన్స్ నుండి, పార్టీ యూత్ కేడర్ నుండి ఎన్టీఆర్ సినిమాలకు సహకారం అందడంలేదనే ప్రచారం జరిగింది. ఇవన్నీ సర్డుబాటు చేసుకోవడానికే ‘టెంపర్’ ఆడియోను ముందుగా డిసెంబర్‌లో నిమ్మకూరులో ప్లాన్ చేసి చంద్రబాబునాయుడు, బాలకృష్ణ, హరికృష్ణ, ఇతర కుటుంబసభ్యుల్ని ఆహ్వానించాలని భావించినా.. ఆ ప్రపోజల్‌ను డ్రాప్ చేశాడని టాక్ వచ్చింది.

ఆ తర్వాత ‘పటాస్’ ఆడియోకు బాలకృష్ణ, ఎన్టీఆర్‌లను గెస్టులుగా ఆహ్వానించారని విన్పించినా.. కళ్యాణ్‌రామ్ ఆలోచనకు సోదరుడి దుర్మరణం బ్రేక్ వేసిందని తెలుస్తోంది. తర్వాత జరిగిన ‘పటాస్’ వేడుకకు బాలకృష్ణ రాకపోవడంతో ఇంకా వీరిద్దరి మధ్య అపోహలు తొలగలేదనే కామెంట్స్‌కు ‘టెంపర్’ ఫంక్షన్ ఫుల్‌స్టాప్ పెడుతుందని వార్తలు వస్తున్నాయ్. ఎన్టీఆర్ స్వయంగా బాలయ్యను ఇన్వైట్ చేశాడని, నటరత్న ఎన్టీఆర్ వర్ధంతి రోజైన జనవరి 18న జరిగే ఈ వేడుకలో బాబాయ్-అబ్బాయ్ ఒకే వేదికపై కనిపించి ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపుతారని అంటున్నారు.

Link to comment
Share on other sites

Balayaa vaste Bommba Block Buster Auvtadhi for sure..... Manam Kalisi unte PK lanti .5 galani enti poe brathimi ladukovalsina parisiti vachedi kadhu...and epudu .5 fans valla cheta ma vala galicheru ani anipinchu kovalasina avasram undedhi kad..Hope everything goeas smmoth in this New Year

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...