Jump to content

Thanks CBN. National junior athletics in VJTM


JAYAM_NANI

Recommended Posts

Yi news chala chinna ga unna. ilanti main events valla VJTM popular avvataniki avakasam untundhi. National level lo city peru teliyataniki plus yi event valla tracks develop avvataniki avakasam untundani na abhiprayam. ilanti events every year unte bavuntundhi mana state lo.

 

పీలో రేపటి నుంచి జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌
print_icon.gif
 
విజయవాడ, నవంబర్‌ 25 : ఎపీ రాజధాని విజయవాడలో క్రీడా మహా సంగ్రామానికి సర్వం సిద్దమైంది. ఈనెల 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ కు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. 29 రాష్ట్రాలు, 7కేంద్రపాలిత ప్రాంతాల నుంచి దాదాపు మూడు వేల మంది అథ్లెట్లు పోటీ పడుతున్నారు. మొత్తం 150ఈవెంట్లలో 450పతకాల కోసం క్రీడాకారులు పోటీ పడనున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. 

నవ్యాంధ్ర రాజధాని విజయవాడ ఇఫ్పుడు అతి పెద్ద క్రీడా పండగకు వేదిక కాబోతుంది. 30వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు ఇందిరాగాంధీ స్టేడియంలో శరవేగంగా  ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు స్టేడియానికి వస్తుండటంతో విజయవాడలో క్రీడా సందడి నెలకొంది. అథ్లెటిక్ మీట్ ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్ గా ఎంపీ రాయపాటి సాంబశివరావు, అధ్యక్షులుగా మంత్రి దేవినేని ఉమలు  వ్యవహరిస్తున్నారు. ఈ పోటీల కోసం పలురాష్ట్రాల నుంచి 200మంది సాంకేతిక అధికారులు వస్తున్నారు. పలు కళాశాలల నుంచి యన్.యస్.యస్. వాలంటీర్లుగా వచ్చి విద్యార్ధులు సేవలు అందిస్తున్నారు. స్టేడియంలో ట్రాక్ నిర్మాణానికి విజయవాడ  మున్సిపల్ కమిషనర్ హరికిరణ్ మూడు లక్షలను కేటాయించారు. రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాలలో ఆహ్వాన విభాగాన్ని ఏర్పాటు చేసి క్రీడారులకు స్వాగతం పలకడంతో పాటు వారికి బస, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను  ఏర్పాటు చేశారు. విడిది నుంచి స్టేడియంకు తీసుకువచ్చేందుకు బస్సులు, వ్యాన్ లను సిద్దం చేశారు. ఇక స్టేడియంలో రన్నింగ్ ట్రాక్ ను శాయ్ కోచ్ వినాయక ప్రసాద్ ఆధ్వర్యంలో నాగార్జున యూనివర్సిటీ విద్యార్ధులు తీర్చిదిద్దారు. 8లైన్ల ట్రాక్,  జంపింగ్ పిట్ లు, కుషన్ హై జంప్ పీట్లు, ఆధునాతన హార్టిల్స్, సిద్దం చేశారు. 

అండర్ 14, 16, 18,20 కేటగిరిలీలో 36క్రీడాంశాలలో పోటీలు నిర్వహిస్తున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాక్ క్రీడాకారులకు సౌకర్యంగా ఉంటుందని 100,  200, 400, 800మీటర్లు పాల్గొనే అథ్లెట్లు ఈ ట్రాక్ మీద నూతన రికార్డులు నెలకొల్పే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పోటీలు జరిగే అన్ని రోజులూ ట్రాక్ తగు పరిమాణంలో తేమ ఉండేటట్లుగా చూసుకోవడంతో  పాటు జంపింగ్ అంశాలకు రన్ వే కూడా చక్కగా తీర్చిదిద్దారు. రన్నింగ్ ట్రాక్ ను హీరో శ్రీకాంత్, ఎంపీ కేశినేని నానిలు ఇటీవలే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. హీరో శ్రీకాంత్ కూడా కొద్దిసేపు క్రీడాకారుడిగా మారిపోయి క్రీడాకారులతో కలిసి జావెలింగ్ త్రో  విసిరి వారికి ఉత్సాహాన్నిచ్చారు. ఇక పోటీలు జరిగే ఐదు రోజులూ క్రీడాకారుల కోసం స్పెషల్ మెనూను సిద్దం చేశారు. ఉదయాన్నే గుడ్లు, పాలతో పాటు అల్పాహారం, మధ్యాహ్నం శాకాహార భోజనం, పుల్క, రాత్రికి ఉత్తర, దక్షిణాది పవంటకాలు,  మాంసాహార వంటకాలను వడ్డించేందుకు ఏర్పాట్లు చేశారు. 26వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో అన్నిరాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్ధుల మార్చ్ ఫాస్ట్ ఉంటుందని, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...