Jump to content

Srisailam lo విద్యుత్ ఉత్పత్తి ఆపేది లేదు


JAYAM_NANI

Recommended Posts

picha comedy. nirupisthamu nirupisthamu antade kaani. adhedho direct ga cheyochu kada. edho papam vadu secreteriat ichadanta manaki rajyangam ivvaledanta.

 

విద్యుత్ ఉత్పత్తి ఆపేది లేదు
Updated : 10/23/2014 3:45:07 AM
Views : 3125
-నిబంధనల ఉల్లంఘన జరుగలేదన్న ప్రభుత్వం 
- బరాబర్ కరెంటు ఉత్పత్తి చేస్తం: మంత్రి హరీశ్‌రావు

-పంటలు కాపాడేందుకే విద్యుత్ ఉత్పత్తి
-ఏపీ ప్రభుత్వం కరెంటు వాటా ఇవ్వకనే వివాదాలు
-కృష్ణా రివర్ బోర్డు కార్యదర్శికి తెలంగాణ ప్రభుత్వం లేఖ
-ఉల్లంఘనలన్నీ ఏపీ సర్కారువే
-కేంద్ర మంత్రులకు లేఖలు రాసిన ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి
-మా వాటా మే వాడుకుంటం 
-బాబు అబద్ధాలు నిరూపిస్తాం
-330 మెగావాట్ల ప్రతిపాదన హాస్యాస్పదం
-బాబును టీ టీడీపీ నేతలు నిలదీస్తారా? లేదా?
-కరెంటు కోటాపై కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడరు?: హరీశ్‌రావు


హైదరాబాద్, అక్టోబర్ 22 (టీ మీడియా): శ్రీశైలం ప్రాజెక్టు వద్ద విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ విషయంలో ఎలాంటి నిబంధనల అతిక్రమణ జరగడంలేదని స్పష్టంచేస్తూ కృష్ణా రివర్ బోర్డు సభ్యకార్యదర్శికి ప్రభుత్వం లేఖ పంపించింది. ప్రాజెక్టు నీటిలో విద్యుత్ ఉత్పత్తికి ఉన్న కేటాయింపుల ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం నడుచుకుంటున్నదని అందులో స్పష్టం చేసింది. మరోవైపు శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపే ముచ్చటే లేదని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. నానాకష్టాలు పడుతున్న తెలంగాణ రైతాంగంకోసం ఉత్పత్తి కొనసాగి తీరుతుందని అన్నారు. 

harishrao01.jpgఈ విషయంలో ఏపీ సర్కార్ అనవసర రాద్ధాంతాలు చేస్తున్నదని, వాస్తవానికి కేటాయింపులను మించి నీరు మళ్లించుకున్నది ఆంధ్రా సర్కారేనని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్ధాలేనని, అది నిరూపించేందుకు తాము సిద్ధమని అన్నారు. పునర్విభజన చట్టంలో నిర్దేశించిన 54 శాతం విద్యుత్‌వాటా ఇవ్వకుండా శ్రీశైలం మీద లేఖలు రాయడమేమిటని మండిపడ్డారు.

మరోవైపు శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిలో ఏ ఉల్లంఘనలు జరగడం లేదని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ వేణుగోపాలాచారి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రికి, జలవనరుల శాఖ మంత్రికి లేఖలు రాశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నది ఏపీ సర్కారేనని ఆయన స్పష్టం చేశారు. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం సంతృప్తికర స్థాయిలోనే ఉన్నదని, నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టానికి ఇంకా రెండు అడుగుల తేడా ఉందని, 2004 నాటి 107 జీవో తు.చ. తప్పకుండా పాటిస్తున్నామని వివరించారు. కేంద్ర కోటా నుంచి 500 మెగావాట్ల విద్యుత్ ఇవ్వాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను ఆయన కోరారు. 

నిబంధనలు ఉల్లంఘించలేదు
శ్రీశైలం ఎడమ కాలువ వద్ద విద్యుత్ ఉత్పత్తి విషయంలో తాము ఏ ఒక్క నిబంధననూ ఉల్లంఘించడం లేదని కృష్ణా రివర్ బోర్డు సభ్య కార్యదర్శి ఆర్‌కే గుప్తాకు బుధవారం రాసిన లేఖలో తెలంగాణ నీటిపారుల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ పేర్కొన్నారు. రిజర్వాయర్ నీటిని వినియోగించుకోవడంలో ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కృష్ణా జలాలను తాము తాగునీటికి, సాగునీటికి కూడా ఉపయోగించుకోవడం లేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టులో నీటి నిల్వను విద్యుత్ ఉత్పత్తి చేయడంకోసం మాత్రమే కేటాయించినందున, ఆ కేటాయింపుల ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం నడుచుకుంటుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు.

రిజర్వాయర్‌నుంచి ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు 60.17 టీఎంసీలు, హంద్రీనీవాకు 5.37 టీఎంసీలు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 0.26 టీఎంసీల నీటిని ఏపీ సర్కారు వినియోగించుకున్నదని వివరించారు. తెలంగాణలో ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికే విద్యుత్‌ను ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. ఎలక్ట్రిక్ పంపుసెట్ల కింద రైతులు నానాఅగచాట్లు 
పడుతున్నారని, వారి బాధలను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు. రిజర్వాయర్‌లోని నీటిని సాగునీటికోసం కూడా ఉపయోగించుకోవడం అవసరమేనని తాము భావిస్తున్నామని చెప్పారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రా ప్రభుత్వం నిబంధనల ప్రకారం తెలంగాణకు ఇవ్వాల్సిన విద్యుత్ వాటాను ఇవ్వనందునే ఈ వివాదాలు తలెత్తుతున్నాయని అభిప్రాయపడ్డారు.

బాజాప్తా ఉత్పత్తి చేస్తం...: శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి ఆపేది లేదని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణకు హక్కు ఉంది.. ఆ హక్కును బాజాప్తా వినియోగించుకుంటామని చెప్పారు. ఆ ప్రాజెక్టు కట్టిందే విద్యుత్‌కోసమని ఆయన గుర్తు చేశారు. కేటాయింపులు మించి ఆంధ్ర సర్కారు ఇప్పటికే ప్రాజెక్టునుంచి నీళ్లు వాడేసుకుందని, తెలంగాణ తన హక్కును నిబంధనల మేరకు వాడుకుంటున్నదని అన్నారు. తెలంగాణను దొంగదెబ్బతీయడానికే చంద్రబాబు లేఖ రాశారని ధ్వజమెత్తారు. 

చంద్రబాబు చెబుతున్న మాటలన్నీ పచ్చి అబద్ధాలేనన్న హరీశ్, అవి నిరూపించేందుకు సిద్ధమని ప్రకటించారు. బుధవారం సచివాలయం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఎస్‌ఆర్‌బీసీకి 19 టీఎంసీలు, తెలుగు గంగకు 15 టీఎంసీలు.. మొత్తం కలిపి మీకు హక్కు ఉన్నది 34 టీఎంసీలే. కానీ మీరు ఇప్పటికే 60 టీఎంసీలు తీసుకుపోయి మీ ప్రాజెక్టులు నింపుకున్నరు. మీరు 300 మెగావాట్లు ఇస్తమంటే మేం తీసుకోవడం లేదంటున్నరు. మా 800 మెగావాట్ల ఉత్పత్తి ఆపుకుని, మీ 300 మెగావాట్లు తీసుకోవాల్నా? మీ మెహర్బానీ ఎవడికి కావాలె? అని ప్రశ్నించారు.

మా పరిశ్రమలకు బంద్ పెట్టి రైతులకు కరెంట్ ఇస్తున్నం. యూనిట్‌కు 8 రూపాయలు ఖర్చు చేసి కరెంట్ కొంటున్నం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎగువ సీలేరు, కృష్ణపట్నం, సీమలో మా వాటా మాకివ్వాలి అని మంత్రి డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, పులిచింతల అక్రమ ప్రాజెక్టులని ఆరోపించారు. శ్రీశైలం పొంగి పొర్లితే నీళ్లు తీసుకుంటామని చెప్పి, ఇప్పుడు నీళ్లు పొంగి పొర్లకున్నా ఏ ముఖం పెట్టుకుని నీళ్లు అడుగున్నారని మంత్రి సూటిగా ప్రశ్నించారు. 

మేం పాటిస్తున్నం... మరి! మీరు?: పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఏపీ సీఎం పదేండ్లపాటు హైదరాబాద్‌లో ఉంటరంటే, లేక్‌వ్యూ గెస్టు హౌజ్ ఇచ్చినం. సెక్రటేరియట్‌లో బ్రహ్మండమైన సౌకర్యాలు కల్పించినం. కృష్ణా, మంజీరా జలాలు ఇస్తున్నం అని చెప్పారు. హైదరాబాద్ విద్యా సంస్థల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సీట్లిచ్చినమని విభజన చట్టాన్ని తాము గౌరవించి పాటిస్తుంటే ఏపీ ముఖ్యమంత్రి చట్టానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు.

ముమ్మాటికీ తెలంగాణ ద్రోహే..: చంద్రబాబు ముమ్మాటికీ తెలంగాణ ద్రోహేనని హరీశ్ అన్నారు. వెన్నుపోటు, మోసం, ద్రోహం, దగా వీటన్నింటిలో చంద్రబాబుకు జీవితకాలపు డాక్టరేట్ ఉంది. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన చరిత్రనీది. వెన్నుపోటు అనేది నీకు వెన్నతోపెట్టిన విద్య. పెదవులపై చిరునవ్వు పెట్టుకుని కడుపులో విషం దాచుకున్న రకం నువ్వు. నువ్వు ఎంత అమాయకంగా మాట్లాడినా.. తెలంగాణ ద్రోహం చేసింది ఎవరో ప్రజానీకానికి తెలుసు అని హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఢిల్లీ వెళ్లి ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుకోవడం ద్రోహం కాదా? హైదరాబాద్‌లో గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టాలని ప్రయత్నించడం ద్రోహం కాదా? తెలంగాణకు 54% విద్యుత్ వాటా ఇవ్వాలని ఉన్నా ఇవ్వకపోవడం ద్రోహమా? కాదా? రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ద్రోహమే. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ద్రోహమే అని మండిపడ్డారు.

అపుడు విజన్ ఏమైంది?: ఎప్పడూ విజన్.. విజన్ అంటూ మాట్లాడే చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ బొగ్గు, నీరు ఉన్నా విద్యుత్ ఉత్పత్తి సంస్థలను ఎందుకు కట్టలేదని హరీశ్ ప్రశ్నించారు. నీకుంది ముందు చూపు కాదు. వంకరచూపు, దొంగ చూపు అని ఎద్దేవా చేశారు. మాట్లాడితే హైదరాబాద్‌ను డెవలప్ చేసిన అంటడు. అంతగనం డెవలప్ చేస్తే 1700 మురికివాడలు ఎందుకు ఉన్నయ్? డెవలప్ కాదు. నీ రియల్ ఎస్టేట్ ధరలు పెంచినవ్. నువ్వు కూర్చున్న అసెంబ్లీ నిజాంకాలం నాటిది. నీ ఇంటి దగ్గర డ్రైనేజీ నిజాం నాటిదే. ఇంకా నయం, చార్మినార్ కూడా నేనే కట్టిన అనలే సంతోషం అని మంత్రి దెప్పిపొడిచారు. 

టీ టీడీపీ నేతలు తేల్చుకోవాలి...: రైతులకు కరెంట్ రాకుండా చేసేందుకు విద్యుత్ ఉత్పత్తి ఆపాలని చంద్రబాబు చెబుతున్నరు. ఆపే ముచ్చట లేదని మేం చెబుతున్నం. మా వాటా మాకు ఇవ్వాలని బాబును నిలదీస్తున్నం. మీరు కూడా నిలదీస్తరా? ఆంధ్రా బాబుకి దాసోహమంటరా? మీరు ఎటువైపో సమాధానం చెప్పండి అని తెలంగాణ టీడీపీ నేతలను హరీశ్ ప్రశ్నించారు. ఆంధ్రా నాయకత్వం వైపు నిలిచి సీమాంధ్రులకు బానిసల్లాగా ఉంటారా? తెలంగాణ ప్రజల పక్షాన ఉంటారా? తేల్చుకోండి అని సవాలు చేశారు.

నల్లగొండ సంఘటనను సమర్థించడం లేదని స్పష్టం చేశారు. 2001లో జలదృశ్యంలో టీఆర్‌ఎస్ కార్యాలయం విషయంలో వాళ్లూ అలాంటి దాష్టీకమే చేశారన్నారు. టీడీపీని బలహీనపరిచే అవసరం లేదు. చంద్రబాబే బలహీనుడు. మెదక్ ఉప ఎన్నికకు ప్రచారానికి రావద్దని పార్టీ నేతలే నిలువరించారు అని ఎద్దేవా చేశారు.

ఎన్నడన్న కరెంటు వాటా అడిగినవా కిషన్‌రెడ్డీ!: లోయర్ సీలేరు, కృష్ణపట్నంలో తెలంగాణకు రావలసిన కరెంట్ వాటా ఇవ్వకపోతే చంద్రబాబును ఏ ఒక్కరోజూ ఎందుకు ప్రశ్నించడం లేదని నేను కిషన్‌రెడ్డిని సూటిగా అడుగుతున్నా.. సమాధానం చెప్పాలి.. ఏపీ ఉల్లంఘనలపై మేం ప్రధానికి చెప్పినం. గోదావరి బోర్డుకి చెప్పినం. మీరేం చేసిండ్రు? ఎందుకు నోరు మూసుకుంటున్నరు? అని నిలదీశారు. కేంద్రంలో అధికారంలో ఉన్నారు. 

ప్రధాన మంత్రికి చెప్పైనా తెలంగాణకు వాటాను ఆంధ్ర నుంచి ఎందుకు ఇప్పించలేకపోతున్నరు అని ప్రశ్నించారు. మీరు ఎవరి చెవిలో పువ్వులు పెడున్నరు? ఒకరు బస్సు యాత్ర అంటరు. మరొకరు ధర్నా అంటరు. కాంగ్రెస్ వాళ్లు గవర్నర్‌ని కలుస్తరు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు దక్షిణాది గ్రిడ్‌లో 2000 మెగావాట్లు కొనుగోలు చేయాలని మొత్తుకున్నం. పొన్నాల, జానా, డీకే, ఉత్తమ్ ఎవ్వరూ నోరు మెదపలేదు. ఆర్‌టీపీపీ సామర్ధ్యం పెంచుకుంటే మంత్రి పదవులు ఊడతయని నోరుమూసుకున్నరు అని హరీశ్ గుర్తు చేశారు. కరెంట్ సమస్యను ఎలా పరిష్కరించాలో తమకు క్లారిటీ ఉందని, త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని హరీష్‌రావు స్పష్టం చేశారు.

హరీశ్‌రావు సూటి ప్రశ్నలు...
-విభజన చట్టం ప్రకారం రావలసిన 54% పవర్ ఇస్తున్నరా?
-సీలేరు నుంచి పవర్ ఎందుకివ్వరు? 
-సంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి మా వాటా ఎందుకు రావడం లేదు?
-ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి నిధులతో నిర్మించిన కృష్ణపట్నం నుంచి వాటా ఎందుకివ్వరు?
-కృష్ణపట్నంలో తెలంగాణ డిస్కంల షేర్ లేదా? విభజన చట్టం పరిధిలో ఉన్నా ఎందుకు పవర్ ఇవ్వరు?
-ఉమ్మడి రాష్ట్రంలో కట్టిన అన్ని ప్రాజెక్టులలో పవర్ షేర్ ఉందా లేదా? 
-చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్ధాలు. నిజయం నిరూపించడానికి మేం సిద్ధం
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...