Jump to content

వెబ్‌సైట్‌లో హల్‌చల్ చేస్తున్న లెజెండ్ సినిమా


RamaSiddhu J

Recommended Posts

హైదరాబాద్, ఏప్రిల్ 2 : ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న 'లెజెండ్' సినిమా వెబ్‌సైట్‌లో హల్‌చల్ చేస్తోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన లెజెండ్ సినిమా పైరసీ భారిన పడింది. దీంతో బాలయ్యబాబు అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సినిమా మంచి విజయం సాధించిన నేపథ్యంలో ఇలా పైరసీ భారిన పడడం దురదృష్టకరమని, కేవలం కొంతమంది కుట్రపన్ని ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఎవరూ కూడా పైరసీని ప్రొత్సహించవద్దని, లెజెండ్ చిత్రాన్ని థియేటర్‌లోనే చూడాలని బాలయ్య అభిమానులు విజ్ఞప్తి చేశారు.


మరోవైపు లెజెండ్ సినిమా విజయవంతమైన సందర్భంగా చిత్ర యూనిట్‌తో కలిసి హీరో బాలయ్య, దర్శకుడు బోయపాటి ఉత్తరాంధ్రలో విజయోత్సవ ర్యాలీను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే బుధవారం విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుంటూరు చేరుకన్న బాలయ్యకు అభిమానులు లెజెండ్ సినిమా పైరసీ విషయాన్ని ఎస్ఎమ్ఎస్ ద్వారా తెలియజేశారు. విషయం తెలుసుకున్న బాలయ్య వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని చిత్ర నిర్మాతలను, పోలీసులను కోరారు.


విడుదలైన మొదటి రోజు నుంచి రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తున్న ఈ సమయంలో లెజెండ్ సినిమా పైరసీ భూతం భారిన పడడం బాలయ్య అభిమానుల్లోనే కాదు, నిర్మాతలకు తలనొప్పిగా మారింది. సినిమా పైరసీలను ప్రోత్సాహించవద్దని, ధియేటర్‌కు వెళ్ళే సినిమా చూడలని సినీ ప్రియులకు నిర్మాత, అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వీలైనంత త్వరగా నిందుతులను పట్టుకోవాలని బాలయ్య బాబు అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.


Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...