Jump to content

నాయకుల విజన్


nbk@myHeart

Recommended Posts

రాష్ట్రం విడిపోయాక అందరి ద్రుష్టి కొత్త రాజధాని మీదా, రాష్ట్రాభివృద్ధి మీదా పడింది.

 

కాంగ్రెస్ వాళ్ళు అక్కడ రాజధాని ఇక్కడ రాజధాని అని రియల్ మాఫియాతో జనాలను మోసం చేస్తూ మమ్మల్ని గెలిపిస్తేనే సీమంధ్ర అభివృద్ధి చెందుతుంది అని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.

 

BJP  వాళ్ళేమో విభజన జరిగేటప్పుడు సీమంధ్రకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించకుండా ఇపుడు మమ్మల్ని గెలిపిచండి రాబోయే మా ప్రభుత్వం నుండి  నిధులు తెస్తాం అభివృద్ధి చేస్తాం అంటున్నారు. 

 


పిల్ల కాంగ్రెస్ పార్టీ ఏమో విభజనకి సహకరించి కొత్త రాజధానిని రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చెయ్యాలో తెలియక బాబే విభజనకి కారణం అని పసలేని పాత పాటతో తమ పార్టీ మూతపడ్డ రాష్ట్రంలో ఓదార్పు చేసి విభజన వాదుల కోపానికి గురై సీమంధ్రలో సెంటిమెంటు ఓట్ల కోసం ప్రయత్నిస్తుంది. 

 



ఉత్తమ నాటక అవార్డు గ్రహీత ముఖ్యమంత్రి గారేమో ముఖ్యమంత్రిగా  కేంద్ర ప్రభుత్వానికి విభజనకు అవసరమైన పనులన్నీ చక్కగా చేస్తూ పైకి సమైక్యాంధ్ర అంటూ నాటకాలు ఆడి విభజన జరిగాక కూడా సమైక్యాంధ్ర నినాదంతో కొత్త పార్టీ పెట్టటానికి ఇటలీ అమ్మ ఆజ్ఞ కోసం వేచి చూస్తున్నాడు.

 



 

కాని ఒక్కడు మాత్రం  విభజనలో అన్యాయానికి గురైన రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చెయ్యాలో ఏ పట్టణం ఎలాంటి అభివృద్ధికి ఉపయోగపడుతుందో చెబుతూ ఢిల్లీ భిక్ష మాకు అక్కర్లేదు మా రాజధానిని ఎక్కడ నిర్మించుకోవాలో మాకు తెలుసు, మా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్కోవాలో మాకు తెలుసు అని కక్ష్య తో చేసిన విభజనతో కుంగిపోయిన ప్రజలకి భవిష్యత్తు మీద భరోసా ఇస్తున్నాడు. 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...