Jump to content

ఆగదూ.. ఆగదూ .. ఆగదూ ఆగదు ఏ నిముషము నీ కోసమూ


Cyclist

Recommended Posts

ఆగదూ ఆగదూ ఆగదూ
ఆగదు ఎ నిమిషము నీకోసము
ఆగితే సాగదు ఈ లోకము
ముందుకు సాగదు ఈ లోకము ||ఆగదు||

జాబిలి చల్లనని వెన్నెల దీపమని
తెలిసినా గ్రహణము రాక మానదు
పూవులు లలితమని తాకితే రాలునని
తెలిసినా పెనుగాలి రాక ఆగదు
హృదయము అద్దమని పగిలితె అతకదని
తెలిసినా మృత్యువు రాక ఆగదూ
హ హహ హహ హ
ఈ మనిషి తపన ఆగదు ||ఆగదు||

జీవితమొక పయనమని గమ్యము తెలియదనీ
తెలిసినా ఈ మనిషి పయనమాగదు
జననం ధర్మమని మరణం ఖర్మమని
తెలిసినా జనన మరణ చక్రమాగదు
మరణం తధ్యమని ఈ జీవికి తప్పదని
తెలిసినా మనిషి తపన ఆగదు
హ హహ హహ హ
ఈ మనిషి తపన ఆగదు                 ||ఆగదు||

Link to comment
Share on other sites

aagadU aagadU aagadU
aagadu e nimiShamu neekOsamu
aagitE saagadu ee lOkamu
muMduku saagadu ee lOkamu ||aagadu||

jaabili challanani vennela deepamani
telisinaa grahaNamu raaka maanadu
poovulu lalitamani taakitE raalunani
telisinaa penugaali raaka aagadu
hRudayamu addamani pagilite atakadani
telisinaa mRutyuvu raaka aagadU
ha haha haha ha
ee maniShi tapana aagadu ||Agadu||

jeevitamoka payanamani gamyamu teliyadanee
telisinaa ee maniShi payanamaagadu
jananaM dharmamani maraNaM kharmamani
telisinaa janana maraNa chakramaagadu
maraNaM tadhyamani ee jeeviki tappadani
telisinaa maniShi tapana aagadu
ha haha haha ha
I maniShi tapana aagadu                 ||Agadu||

Link to comment
Share on other sites

అక్కినేని నాగేశ్వర్‌రావు మరణంతో చిత్ర పరిశ్రమ రెండో కన్నును కోల్పోయిందని, ఈ రోజు చాలా దుర్దినమని నటుడు జూనియర్ఎన్టీఆర్ అన్నారు. మంగళవారం ఉదయం అక్కినేని భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ అంతటి మహోన్నత వ్యక్తి గురించి మాట్లాడేంత అర్హత తనకు లేదన్నారు. అక్కినేని ఏ లోకంగా ఉన్నా ఆయన చల్లని చూపు కుటుంబపై, చిత్ర పరిశ్రమపై ఉండాలని కోరుకుంటున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

అన్నపూర్ణ స్టూడియోలో ఉన్న అక్కినేని నాగేశ్వరరావు భౌతికకాయానికి నటుడు మహేష్‌బాబు దంపతులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్కినేని గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఎప్పటికీ మనతోనే ఉంటారని, మన మధ్యలోనే ఉంటారని మహేష్‌బాబు అన్నారు.

Link to comment
Share on other sites

మహానటులిద్దరూ కూడా జనవరిలోనే కన్నుమూయడం విషాదం.. యాదృచ్ఛికం. ఎన్ టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే మృతి చెందారు. అంతేకాకుండా ఎన్ టీఆర్ జనవరి 18 తేదీన, ఏఎన్నార్ జనవరి 22 తేదీన తెల్లవారుజామునే తుది శ్వాస విడవడం యాదృచ్ఛికమే అయినా, వారి మధ్య స్నేహ, ఆత్మీయ బంధాలను అది ప్రతిబింబించిందని చెప్పుకోక తప్పదు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...