Jump to content

****Sri Ramya Rajyam*****


Abhi_nfan

Recommended Posts

EETHA RAMA CHARITHAM

 

సీతారామ చరితం శ్రీ సీతారామ చరితం

గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం

ప్రతిపదపదమును శ్రుతిలయాన్వితం చతుర్వేదవినుతం

లోకవిదితం ఆదికవి వాల్మికి రచితం సీతరామచరితం

కోదండపాణి ఆ దండకారుణ్యమున కొలువుండె భార్యతో

నిండుగా అండదండగ తమ్ముడుండగ కడలితల్లికి కనుల పండగ

 

సుందర రాముని మోహించె రావణ సోదరి సూర్పనఖ

సుద్దులు తెలిపి పొమ్మనిన హద్దులు మీరి పైబడగ

తప్పనిసరియై లక్ష్మనుడే ముక్కు చెవులను కోసి

అన్న చూడని అక్కసు కక్కుచు రవణు చేరెను రక్కసి

 

దారునముగ మాయ చేసె రావణుడు మాయ లేడి అయినాడు మారీచుడు

సీత కొరకు దాని వెనుక పరిగెడె శ్రీరాముడు అదను చూసి

సీతని అపహరించె రావణుడు కడలి నడుమ లంకలోన కలికి సీతనుంచి

కరకు గుండెలొపాసుల కాపలాగ వుంచి

 

శోక జలధి తానైనది వైదేహి ఆ శోక జలధిలో మునిగె దాశరధి

సీతా సీతా సీతా సీతా అని సీతకి వినిపించేలా రొదసి కంపించేలా

రోధించె సీతపతి

 

రాముని మోమున దీనత చూసి వెక్కి ఎడ్చినవి వేదములే

సీతకెందుకీ విషాదం రామునికేలా వియోగం

కమలనయనములు మునిగె పొంగె కన్నీటిలో చూడలేక

సూర్యుడే దూకెను మున్నీటిలో సూర్యుడే దూకెను మున్నీటిలో

 

వానర రాజుకు సుగ్రీవునితో రాముని కలిపె మారుతి

జలధిని దాటి లంకను చేరగ కనపడెనక్కడ జానకి

రాముని ఉంగరం అమ్మకు ఇచ్చి రాముని మాటల ఓదార్చి

లంకను కాల్చి రయమున వచ్చి

సీత సిరోమణి రామునికిచ్చి చూసినదంతా చేసినదంతా తెలిపె పూస గుచ్చి

 

వాయువేగముగ వానర సైన్యము కడలికి వారధి కట్టెరా

వానరవేగముగ రామభద్రుడె రావణ తలపడికొట్టెర

భుజమున చేరగ కులసతి సీతని దూరంగ నిలబెట్టెగా

అంత బాధ పడి సీతకోసమని ఇంత చేసె శ్రీరాముడు

చెంతచేర జగమంత చూడగా వింత పరీక్ష విధించెను

 

ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికీ పరీక్ష ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికీ పరీక్ష

శ్రీరాముని భార్యకా శీలపరీక్ష వయోనిజకి అవనిజకా అగ్ని పరీక్ష

దశరథుని కోడలికా ధర్మ పరీక్ష జనకుని కూతురికా అనుమాన పరీక్ష

రాముని ప్రాణానికా జానకి దేహానికా సూర్యుని వంశానికా ఈ లోకం నోటికా

ఎవ్వరికీపరిక్ష ఎందుకు ఈ పరీక్ష శ్రీరామ

 

అగ్గిలోకి దూకె అవమానముతొ సతి అగ్గిలోకి దూకె అవమానముతొ సతి

నిగ్గుతేలి సిగ్గుపడె సందేహపు జగతి అగ్నిహొత్రుడె పలికె దిక్కులు మార్మొగగా

సీత మహాపతివ్రతని జగమే ప్రణమిల్లగా

లోకులందరికి సీత పునీతని చాటె నేటి శ్రీరాముడు

ఆ జానకితో అరణ్యమేగెను సకల ధర్మసందీపుడు సీతాసమేత శ్రీరాముడు

Link to comment
Share on other sites

  • Replies 342
  • Created
  • Last Reply

శ్రావ్యమైన సంగీతం

వీనుల విందైన పాట

బాపు సృష్టించిన పట్టాభిషేక దృశ్యంతో

పట్టరాని ఆనందం

ప్రపంచంలో ఏ జాతికి దక్కని

అదృష్టాన్ని అనుభవిస్తుంటే

అలా ఆనంద బాష్పాలు వచ్చేసాయి…..

ఆ తరువాత

రామ కథలో

సీతారాముల జంట విడిపోతుంటే

అలనాటి అయోద్యవాసుల్లా

మనలను విలపింపజేసిన బాపూ తీరు

రమణ గారి రసరమ్యమైన రచన

మరో సారి

రామ రాజ్యం చూడాల్సిందే

అని పదే పదే మనసు పోరుతోంది.

Link to comment
Share on other sites

Tell us about Balakrishna who played Rama in the film?

I had worked with him earlier in Simha. He is the main reason for me to be a part of Sri Ramarajyam I thank him from the bottom of my heart for believing in me and having the confidence that only I could do this role to perfection, more than me. And he is so convincing as Lord Rama in the film, that I cannot imagine any other actor in that role.

 

Source: http://www.telugucin...ra_chitchat.php

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...