బెజవాడ విమానాశ్రయానికి..అంతర్జాతీయ కళ
06-07-2017 01:29:41
కాలుమోపుతున్న ‘కస్టమ్స్’
179 మంది సిబ్బందికి శిక్షణ
2.5 కోట్లతో టెర్మినల్ ఆధునికీకరణ
ఎన్డీఆర్‌ఎఫ్ కార్యాలయం కృష్ణాలో
విజయవాడలో నేషనల్ రైల్ అకాడమీ
కమాండో శిక్షణకు మరో కేంద్రం
విజయవాడ, జూలై 5(ఆంధ్రజ్యోతి):నవ్యాంధ్రప్రదేశ్‌కు తలమానికమైన విజయవాడ ఎయిర్‌పోర్టులో మరికొద్ది రోజుల్లో కస్టమ్స్ విభాగం అడుగు పెట్టబోతోం ది. విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా వచ్చిన నేపథ్యంలో.. తనిఖీ సంబంధ కార్యకలాపాల నిర్వహణకు సిబ్బందిని సంసిద్ధం చేస్తోంది. కార్యాలయాల ఆధునీకరణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. కస్టమ్స్ హోదా వస్తే.. తక్షణం ఆసియా.. అందునా గల్ఫ్ దేశాలకు విమానాలను నడిపేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఏపీసీఐఎఫ్ దీనిపై గట్టిగా పోరాడింది. అనేక దఫాలు కేంద్రానికి, కస్టమ్స్‌కు లేఖలు రాసింది. ఉమ్మడి ఏపీగా ఉండగా హజ్ యాత్రికు లు హైదరాబాద్ నుంచే సౌదీ అరేబియాకు వెళ్లేవారు.
రాష్ట్ర విభజన తర్వాత కూడా హైదరాబాద్ నుంచే వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రకు చెందిన యాత్రికులను విజయవాడ విమానాశ్రయం నుంచి పంపితే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వం యోచించింది. అప్పటి సమాచార, మైనారిటీ వ్యవహారాల మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఈ దిశగా కృషి చేశారు. దీంతో అప్పటి కస్టమ్స్ ఏపీ కమిషనర్ రెహమాన్ విజయవాడ ఎయిర్‌పోర్టును పరిశీలించారు. పాత టెర్మినల్ భవనంలో చేపట్టాల్సిన మార్పులు, చేర్పులపై సూచనలు, సలహాలు ఇచ్చారు. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు రూ.2.5 కోట్ల వ్యయంతో టెర్మినల్ ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఇందులో కస్టమ్స్ కోసం ఎయిర్‌పోర్టు అథారిటీ ప్రత్యేకంగా ఐదు గదులను కేటాయించింది. పాత టెర్మినల్‌లో జరుగుతున్న పనులను కస్టమ్స్ అదనపు కమిషనర్ కాటం బేబి రాజుతో కూడిన బృందం బుధవా రం పరిశీలించింది.
ఎయిర్‌పోర్టు డైరెక్టర్ గిరి మధుసూదనరావు, విమానాశ్రయ సివిల్, ఎలక్ర్టికల్ విభాగాల ఇన్‌చార్జులు పనుల పురోగతిని వివరించారు. ఇంకోవైపు.. మరో వారం రోజుల్లో ఇమిగ్రేషన్ అధికారులు కూడా ఎయిర్‌పోర్టుకు రానున్నారు. కాగా.. విజయవాడలోని రాష్ట్ర కస్టమ్స్ కమిషనరేట్ కార్యాలయంలో పనిచేసే ఇన్‌స్పెక్టర్లు, సూపరింటెండెంట్‌లు మొత్తం 179 మందికి శంషాబాద్ విమానాశ్రయంలో శిక్షణ ఇప్పించారు. రూ.కోటి వ్యయంతో అధునాతన తనిఖీ యంత్రాలు కొనుగోలు చేయనున్నారు. కస్టమ్స్ విభాగం ఏర్పడగానే.. తక్షణం విజయవాడ నుంచి ఆసియా దేశాలకు విమాన సర్వీసులు ప్రారంభించేందుకు అవకాశం కలుగుతుంది. సింగపూర్, మలేసియా, హాంకాంగ్‌లకు విమానాలు నడిపేందుకు ‘ఎయిర్ ఆసియా’ ఆసక్తి చూపిస్తోంది. సింగ పూర్ ఎయిర్‌లైన్స్ కూడా నేరుగా విజయవాడకు సర్వీసును నడిపే అంశాన్ని పరిశీలిస్తోంది.