కేఆర్పీపీ వ్యవస్థాపకుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి సోమవారం బెంగళూరులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు బీవై. విజయేంద్ర సమక్షంలో బీజేపీలో అధికారికంగా చేరారు. గాలి జనార్దన్ రెడ్డి వెంట ఆయన భార్య గాలి లక్ష్మీ అరుణ కూడా ఉన్నారు