Jump to content

RamaSiddhu J

Members
  • Posts

    28,007
  • Joined

  • Last visited

  • Days Won

    10

Posts posted by RamaSiddhu J

  1. అయోమయంలో దారి తప్పి పోతున్న జగన్‌

    వరస కేసుల ముట్టడి నుంచి ఆత్మరక్షణ చేసుకోవడానికి వైకాపా అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అవలంభిస్తున్న ఆకతాయి పద్ధతులు రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అన్యాయాల మీద కేసులు, అరెస్టులతో మోత మోగిస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇందుకోసం ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటుచేసి, ఎక్కడెక్కడ ఏ కేసులు పెట్టే అవకాశం వుందో అధ్యయనం చేస్తున్నారు. పెట్టిన కేసుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నారు. స్థానికంగా పోలీసు అధికారులు సమస్య తలెత్తకుండా ఇతర ప్రాంతాల పోలీసు ఆఫీసర్లను పంపి విచారణ జరిపిస్తున్నారు. న్యాయస్థానాలలో బెయిల్‌, రిమాండ్‌, కస్టడీ విచారణలకు అమరావతి నుంచి ప్రత్యేక ప్రాసిక్యూటర్లను పంపుతున్నారు. కీలక కేసు అయితే, జిఓ జారీ చేసి మరీ న్యాయవాదులను పంపుతున్నారు. అరెస్ట్‌ అంటూ జరిగితే, అంత సులభంగా బెయిల్‌ రాకుండా చూస్తున్నారు. ఈ క్రమంలో వైకాపా సీనియర్‌ నేతలు, ముఖ్యులనుకొన్న వారు ఒకరొకరుగా బోనులో చిక్కి పోతున్నారు. ఈ వరస ఎక్కడ ఆగుతుందో తెలియడం లేదు. ఇప్పటికే దాదాపు వందకుపైగా కేసులు నమోదైనాయి. అన్ని కేసులలో అరెస్టులు జరుగుతున్నాయి. ఏ ఒక్క కేసులో కూడా ఏ నిందితుడికీ సులభంగా బెయిల్‌ లభించడం లేదు. పక్కాగా ఆధారాలు సేకరించి, కేసులు నమోదు చేస్తుండడం వల్ల అరెస్టు అయిన వారు తప్పించుకోలేక పోతున్నారు. అరెస్ట్‌ భయంతో రాష్ట్రం మొత్తం మీద, వివిధ స్థాయిలలోని వైకాపా నేతలు పరారీలో వున్నారు. ఈ కేసుల ముట్టడితో పార్టీ కార్యాలయాలు మనిషి లేక వెల వెల పోతున్నాయి. మద్యం కుంభకోణం ఎక్కడ నుంచి ఎక్కడకు పోతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. మద్యం వ్యాపారంలో వేల కోట్ల రూపాయల ముడుపులు తీసుకొన్న సంగతి బహిరంగ రహస్యం. కానీ అంతా నగదు రూపంలో జరిగింది కాబట్టి ఎటువంటి ఆధారాలూ లభించవనే ధీమాతో వున్నారు, నిందితులందరూ. కానీ పోలీసు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడో ఏడాది, రెండేళ్ల క్రితం రాష్ట్రంలో వివిధ టోల్‌ గేట్ల మీదుగా ప్రయాణించిన వాహనాల వివరాలు, ఆ వాహనాల లోపలున్న వారి ముఖాల గుర్తులతో సహా సేకరించారట. ముడుపులు చేతులు మారిన ప్రదేశాలలో సెల్‌ఫోన్‌ టవర్ల నుంచి అత్యంత సాంకేతికమైన సమాచారం సేకరించారట. ఏరోజు ఎవరెవరు ఒక చోట కలిశారు అనే సమాచారాన్ని బట్టి, వారి ఫోన్ల సిగ్నెల్‌ సంకేతాలను బయటకు తీశారు. నిందితులుగా వున్నవారు ఈ వివరాలు చూసి హతాశులై పోతున్నారు. ఒకరొకరుగా తెలిసో తెలియకో నిజాలు బయట పెట్టేస్తున్నారు. మద్యం నిందితులను ఒకరొకరుగా జత చేసుకొంటూ పోతున్నారు. దానితో మనకేమీ కాదనే ధీమాతో వున్న వారికి, పోలీసు ఇంటి తలుపు తట్టిన తర్వాత ఉలిక్కి పడుతున్నారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఉదంతం ఇందుకొక ఉదాహరణ. ఈ కేసులో మొత్తం నిందితుల సంఖ్య కొన్ని వందల సంఖ్యకు చేరువ అవుతుందని చెప్తున్నారు. ఇప్పటికి నిందితులుగా చేర్చిన వారి సంఖ్య 35 మాత్రమే. దానితో బయటవున్న వారి గుండెలలో గుబులు మొదలైంది. పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడానికి ఏ నాయకుడికి కూడా మనసు రావడం లేదు.

    ప్రభుత్వం తన మీద ఒక పథకం ప్రకారం జరుపుతున్న దాడి జగన్ను కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. ఏ కేసులో ఏ నిందితుడు ఏ సాక్ష్యం చెప్తాడో, దాని ఆధారంగా ఏ తీగ లాగితే ఏ డొంక కదలుతుందో అర్థంకాక మనసు స్థిమితం కోల్పోతున్నాడాయన. మనసులోని బాధను పంచుకోవడానికి పక్కన మనిషి లేకుండా పోయాడు. ఆత్మీయంగా, అంతరంగికంగా మాట్లాడే వారంతా అయితే జైలులోనో లేకుంటే పరారీలోనో వున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిధున్‌రెడ్డి వంటి ఒకరిద్దరు బయట వున్నా, వారి గుండెల నిండా దిగులు నిండి వుంది.

    ఈ పరిస్థితిలో పార్టీని ఎట్లా నడపాలో, కార్యకర్తలలో నైతిక స్థైర్యం ఎట్లా నింపాలో అర్ధం కావడం లేదు. ఏదో ఒకటి చేసి, రాష్ట్రం మొత్తం కదలిక తెస్తే తప్ప పార్టీలో ఉత్తేజం క్షీణించి పోతుందనే భావన ఏర్పడింది. దాని ఫలితమే, తెనాలి, పల్నాడు వంటి పర్యటనలు. నిజానికి వీటిలో ఏ ఒక్కటి కూడా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు పర్యటించి, పరామర్శించవలసిన విషయాలు కావు. గంజాయి బ్యాచ్‌గా ప్రసిద్ధి చెంది, రౌడీ షీట్లు తెరిచి వున్న వారి ఇంటికి వెళ్లి ఒక మాజీ ముఖ్యమంత్రి పరామర్శించడం చరిత్రలో ఎప్పుడైనా విన్నామా? పల్నాడు పర్యటనలో అంత ఆగం కూడా పార్టీ పరువు తీసింది. పాకిస్తాన్‌ తీవ్రవాదుల తరహాలో ‘2029లో జగన్‌ అధికారంలోకి వస్తున్నాడు, గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్లు రఫ్పా... రఫ్పా.. నరుకుతాము ఒక్కొక్కడిని’ అనే నినాదంతో పోస్టర్లు వెలిశాయి. ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత బరితెగింపుగా వ్యవహరించలేదు. దాన్ని చూసిన వారికి, జగన్‌ మళ్లీ వస్తే రాష్ట్రం ఏమైపోతుందో అన్న భయం కలుగుతుంది. ఆ భయం పార్టీ భవిష్యత్తుకు మంచి చేస్తుందా కీడు కలిగిస్తుందా అనే విమర్శ చేసుకోవడానికి కూడా జగన్‌ పక్కన మనిషి లేడు.

    ఆయన ప్రసంగాలలో, పత్రికా విలేఖరుల సమావేశాలలో కూడా కేసుల ప్రస్తావన తప్ప వేరొకటి లేదు. కడుపు మంట, ఆక్రోశం, ఆవేశం, నిస్సహాయ స్థితి వంటివన్నీ వ్యక్తమౌతున్నాయి ఆయన మాటలలో. తనను, తన వారిని, తన పార్టీని ఎట్లా కాపాడుకోవాలో అర్ధం కాని అయోమయ పరిస్థితిలో పడిపోతున్నాడు వైఎస్‌ జగన్‌. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల వ్యవధి వుంది. అప్పటివరకు ప్రతిపక్ష పార్టీగా మనుగడ సాగించే శక్తి ఆయనలో లేదని అర్ధమై పోతున్నది.

    ఇటువంటి విపత్కర పరిస్థితులలో, మనోనిగ్రహం కూడదీసుకొని, ఒక వ్యూహం ప్రకారం పార్టీ పునరుజ్జీవానికి ప్రయత్నం చేయడం అవసరం. రౌడీ మూకలకు, అరాచక శక్తులకు పెత్తనం అప్పచెప్పి, పార్టీ అంటేనే ప్రజలు భయపడిపోయే పరిస్థితి తెచ్చుకోవడం ఆత్మహత్యతో సమానం. ఇప్పటివరకు జగన్‌ మీద ఒక్క కేసు కూడా లేదు. కానీ ఇక ముందు రావని చెప్పలేము. ఒకవేళ తను కూడా కేసుల ఊబిలో చిక్కుకోక తప్పని పరిస్థితి వస్తే పార్టీని నడిపించే ఏర్పాట్లు ఏమిటో ఆలోచించుకోవలసిన సమయం వచ్చింది. గతంలో ఆయన చంచలగూడ జైలులో 16 నెలల కాలం గడిపినా, అసంఖ్యాకమైన నాయకగణం బయట వుండేది. పార్టీకి నాయకత్వమే కాకుండా, ఆర్థికంగా కూడా వారు అండగా నిలిచారు. ఇప్పుడటువంటి పెద్దలు ఎవరూ కన్పించడం లేదు. గతంలో వలె ఆయనకు రెడ్డి కుల ముఖ్యుల మద్దతు కూడా లభించడం లేదు. ఆయన బలం ఆ కుల మద్దతు అన్నది బహిరంగ రహస్యం. అధికారంలో వున్న ఐదేళ్లపాటు తనను ఆదుకొన్న, అభిమానించిన కుల ముఖ్యులను ఆయన పట్టించుకోలేదు. దానితో మరొకసారి ఆపదలో ఆదుకోవడానికి ముందుకు వచ్చే చొరవ వారు చూపడం లేదు.

    ఏ కోణం నుంచి చూసినా జగన్‌ పరిస్థితి ఆందోళనకరంగా వుంది. అయోమయంగా కూడా వుంది. ఈ పరిస్థితులను ఆయన ఎట్లా ఎదుర్కొంటాడో వూహించడం కష్టం.

  2. 4 hours ago, Rajakeeyam said:

    uncle mamata paintings vaipu ekkuva chusthunnattu unnav:comfort:

    Bramhi Chachipovalanipisthundi gif

  3. Just now, bezawadaking said:

    adhega... aa krishna lo seat ento telisthe cadre velli akkada local leader ni kottamani cheppali... 

    ee lekkana 11 to 7 ante... anna next elections ki kutame poti chesthe... nijamgaane kadapa lo okkade gelustaademo with rest sleeping

    Tiruvuru

  4. 2 minutes ago, Bleed_Blue said:

    5-6 districts eh cheppadenti....ante migatha districts zero na:dream:
    Jagan ga nee xxxxxx...ah range lo bhayapettav entra :roflmao:

    Even I was surprised...later realized

  5. I think there are some overboard scenes which are beyond imagination.

    When script is narrated (bring a crazy project) she accepted with enthusiasm.

    Reality lo Vanga Anna Chukkalu Chupinchi Untadi..Lucky Prabhas .

    Anyway Deepika PR thelisindega..Vanga Anthakuminchi..

×
×
  • Create New...