Jump to content

AnnaGaru

Members
  • Posts

    9,821
  • Joined

  • Days Won

    20

Everything posted by AnnaGaru

  1. chepptho kottinattu chepparu Raju garu......
  2. http://www.eenadu.net/andhra-pradesh-news-inner.aspx?category=general&item=break8 రాజధానికి తరలివస్తోన్న పరిశ్రమలు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతికి తరలివస్తున్న పరిశ్రమల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విభజన తర్వాత రాష్ట్రానికి తరలిరావాలన్న ఆకాంక్ష మేరకు హైదరాబాద్‌, జీడిమెట్ల, నాచారం ప్రాంతానికి చెందిన ఏపీ పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలోనూ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు కృష్ణా జిల్లా బాపులపాడులోని మల్లవెల్లి పారిశ్రామిక క్లస్టర్‌లో 400కు పైగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయి. తొలిదశలో 216 పరిశ్రమలకు ప్రభుత్వం భూములు కేటాయించింది. రూ.800 కోట్ల‌తో రానున్న ఈ పరిశ్ర‌మ‌లు ప్రాథ‌మికంగా 7,250మందికి ప్ర‌త్య‌క్షంగా, ఉపాధి అవ‌కాశాల‌ను క‌ల్పించ‌నున్నాయ‌ని మ‌ల్ల‌వెల్లి ఇండ‌స్ట్రీస్ సహ‌య కార్య‌ద‌ర్శి జీఎన్‌బీ చౌద‌రి తెలిపారు..
  3. http://www.andhrajyothy.com/artical?SID=535320 బ్లూసిటీ.. అమరావతి! 12-02-2018 07:55:27 రెండు దశల్లో వరద నియంత్రణ.. తొలి దశలో రాజధాని ప్రాంతంపై దృష్టి మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి రూ.667 కోట్లు..237కోట్లతో ఉండవల్లి వద్ద ఎత్తిపోతల పథకం బోర్డింగ్‌ పాయింట్‌గా నీరుకొండ రిజర్వాయరు..కాలువ కట్టలపై గ్రీనరీ అభివృద్ధికి బఫర్‌జోన్‌ మంగళగిరి (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిని పర్యావరణానికి నెలవైన నీలిహరితయుత నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ ప్రాంతానికి అతిపెద్ద వరదముంపు శాపంగా ఉందని చరిత్ర చెబుతోంది. దీన్నే ఓ వరంగా మార్చుకునేలా ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. వరద నియంత్రణ, పుష్కలమైన తాగునీటి వసతి, నావిగేషన్‌ ప్రధాన లక్ష్యాలతో కూడిన ఓ బృహత్తరమైన పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనుంది. రెండు దశలతో అమలుచేసే ఈ పథకం తొలిదశను ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడతారు. దీనికోసం ప్రభుత్వం గత వందేళ్ల నుంచి వర్షపాతం, వరదల పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేసింది. వాగుల విస్తరణ, బఫర్‌జోన్‌ వాగులను బాగా లోతుగాను పెద్దఎత్తున విస్తరించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. వాగు/కాలువలకు ఇరువైపులా కట్టలమీద 30మీటర్ల వెడల్పున గ్రీనరీని అభివృద్ధి చేస్తూ బఫర్‌జోన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. నీరుకొండ నుంచి వయా కృష్ణాయపాలెం మీదుగా ఉండవల్లి వరకు 11కి.మీ. పొడవున కొండవీటివాగు విస్తరణకు రూ.193.47కోట్లు, దొండపాడు- కొండమరాజుపాలెం మధ్య 7.4 కి.మీ.పొడవున పాలవాగును అభివృద్ధికి 55.96 కోట్లు, కొండమరాజుపాలెం-కృష్ణాయపాలెం మధ్య 9.3 కి.మీ. పొడవున పాలవాగు అభివృద్ధికి రూ.87.27 కోట్లు, నెక్కల్లు-పిచ్చుకాలపాలెం మధ్య 7.84 కి.మీ. పొడవున సహజ ప్రవాహ కాలువ నిర్మాణానికి రూ.153.16కోట్లు కావాలని అంచనా వేశారు. ఉండవల్లి వద్ద చేపట్టిన ఎత్తిపోతల పనులను మరో రెండు నెలల్లో పూర్తి చేయనున్నారు. వరద నియంత్రణ, రిజర్వాయర్ల నిర్మాణం కొండవీటివాగు దిగువ పరీవాహక ప్రాంతంలో వరదనీటి మొత్తాన్ని సుమారు 16వేల క్యూసెక్కులుగా అంచనా వేశారు. ఇందుకోసం ప్రతిపాదించిన తొలిదశ ప్రణాళికను ఇప్పటికే ఆరంభించారు. ఈ వాగు ఉండవల్లి వద్ద కృష్ణానదిలో కలిసేచోట రూ.237కోట్ల వ్యయంతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారు. దీనిద్వారా 5వేల క్యూసెక్కులు నదిలోకి, మరో 5వేల క్యూసెక్కులు కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువలోకి ఎస్కేప్‌ రెగ్యులేటర్‌ ద్వారా తరలించే విధంగా పనులను చేపట్టారు. తొలిదశలో మూడు రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపట్టడంతో పాటు కొండవీటివాగు..దాని ఉపవాగులను లోతుచేసి విస్తరిస్తారు. నీరుకొండ, కృష్ణాయపాలెం, శాఖమూరుల్లో వీటిని నిర్మిస్తారు. అత్యంత ప్రధానమైన నీరుకొండ రిజర్వాయరును 455ఎకరాల విస్తీర్ణంలో రూ.453.45కోట్ల వ్యయంతో 0.43టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండేలా అభివృద్ధి చేస్తారు. కృష్ణాయపాలెం వద్ద 190ఎకరాల విస్తీర్ణంలో రూ.159.44కోట్లతో 0.1టీఎంసీల సామర్థ్యం గల చెరువును నిర్మిస్తారు. శాఖమూరు వద్ద ప్రస్తుతం ఉన్న చెరువును రూ.54కోట్లతో 50ఎకరాల విస్తీర్ణంలో 0.03టీఎంసీల నిల్వ సామర్థ్యంతో కూడిన రిజర్వాయర్‌గా అభివృద్ధి చేస్తారు. నీరుకొండ రిజర్వాయరు నుంచి కొండవీటివాగులో పడవల్లో ప్రయాణం ఉంటుంది. ఈ కారణంగా ఈ రిజర్వాయర్‌ను బోర్డింగ్‌ పాయింట్‌గా నిర్ణయించారు. దక్షిణాభిముఖంగా షిప్‌లాక్‌ను ఏర్పాటు చేస్తారు. ఎక్కువ ప్రవాహగతి మార్గంలో ఓగి స్పిల్‌వేను, తక్కువ ప్రవాహగతి మార్గంలో స్టాప్‌లాగ్స్‌, గేట్లు ఏర్పాటు చేస్తారు. ప్రతిపాదనలు ఇవీ... కొండవీటివాగు క్యాచ్‌మెంట్‌ ఏరియా మొత్తం విస్తీర్ణాన్ని 421చదరపు కిలోమీటర్లుగా గుర్తించారు. అమరావతి హద్దులకు లోపలివైపు ప్రాంతాన్ని దిగువ క్యాచ్‌మెంట్‌ ఏరియా(231చ.కి.మీ.), వెలుపలి ప్రాంతాన్ని ఎగువ క్యాచ్‌మెంట్‌ ఏరియా(190చ.కి.మీ.)గా వర్గీకరించారు. వరదనీటిని నిల్వ చేసేందుకు ఎగువ క్యాచ్‌మెంట్‌ ఏరియాలో ఉన్న లాం, పెదపరిమి, వైకుంఠపురం వద్ద మూడు రిజర్వాయర్లు నిర్మించి వాటిని సహజ ప్రవాహ కాలువతో అనుసంధానించాలి. దీనివల్ల లాం, పెదపరిమిలో 0.3టీఎంసీలు చొప్పున, వైకుంఠపురంలో 0.2 టీఎంసీల వరదనీటిని తాగునీటి అవసరాలకు నిల్వ చేయవచ్చు. ఇంకా మిగిలి ఉన్న వరదనీటిని సహజ ప్రవాహకాలువ ద్వారా వైకుంఠపురం వద్ద ఎత్తిపోతల పథకం సహాయంతో కృష్ణానదిలోకి తరలించవచ్చు. వైకుంఠపురం-దాములూరు మధ్య కృష్ణానదిపై బ్రిడ్జి కం ఆనకట్టను నిర్మిస్తే అక్కడినుంచి మరో కొత్త కాలువను నీరుకొండ వద్ద రిజర్వాయర్‌కు అనుసంధానించడం ద్వారా అదనపు నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.
  4. http://www.andhrajyothy.com/artical?SID=535324 సిద్ధమవుతున్న రాజధాని రక్షణ కవచం 12-02-2018 08:08:36 పట్టిసీమ పనులను తలపిస్తూ శరవేగంగా... కొండవీటివాగు ఎత్తిపోతల పథకం పనుల్లో పట్టిసీమ ‘జోరు’ కనిపిస్తోంది. గోదావరి వరద జలాలను కృష్ణమ్మ చెంతకు చేర్చేలా పట్టిసీమ ఎత్తిపోతలను రికార్డు సమయంలో పూర్తిచేసిన విధంగానే కొండవీటివాగు ఎత్తిపోతల పనులను కూడ శ్రీఘ్రంగా జరిపిస్తున్నారు. పట్టిసీమ ప్రాజెక్టును పూర్తిచేసిన మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీయే కొండవీటివాగు ఎత్తిపోతలను కూడ చేపట్టింది. పట్టిసీమ అనుభవం ఇక్కడ ఆ సంస్థకు బాగా కలిసొచ్చింది. మంగళగిరి: రాజధాని అమరావతికి వరదల నుంచి రక్షణ కల్పించేందుకు చేపట్టిన కొండవీటివాగు వరద నియంత్రణ పథకం తాలూకు పనులు చివరి దశకు చేరుకున్నాయి. వరద నియంత్రణ కోసం ఉండవల్లి కరకట్ట వద్ద వాగు కృష్ణానదిలో కలిసేచోట ఎత్తిపోతల పనులను చేపట్టిన సంగతి తెలిసిందే. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం అందించిన రూ.1500 కోట్ల నిధుల నుంచి రూ.237 కోట్లను వెచ్చించి దీనిని చేపట్టారు. మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ కాంట్రాక్టు ఒప్పందం కుదుర్చుకుని నిర్మాణ పనులను జరిపిస్తోంది. ప్రస్తుతానికి 75 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. కాంట్రాక్టు ఏజెన్సీ సంస్థ మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ పట్టిసీమ ఎత్తిపోతలను ఎంతైతే వేగంగా పూర్తిచేసిందో అదే వేగాన్ని కొండవీటివాగు ఎత్తిపోతల నిర్మాణ పనుల్లోనూ చూపిస్తోంది. కలెక్షన్‌ పాయింట్‌ కొండవీటివాగులో గరిష్ట నీటి ప్రవాహాన్ని 16వేల క్యూసెక్కులుగా అంచనా వేస్తూ ఎత్తిపోతలను డిజైన్‌ చేశారు. ఉండవల్లి కరకట్ట నుంచి 350 మీటర్ల దూరంలో వాగు వెంబడి వరదనీటి కలెక్షన్‌ పాయింట్‌ అంటే ఓ సంపు వంటి మినీ రిజర్వాయర్‌ను నిర్మిస్తారు. ఈ సంప్‌ నిర్మాణాన్ని చివర్లో అంటే వచ్చేనెలలో చేపట్టనున్నారు. దీనికోసం సుమారు ఆరేడు కోట్ల రూపాయలను వెచ్చించనున్నారు. ఇంకో ఆరేడు కోట్లను బ్యూటిఫికేషన్‌ నిమిత్తం ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. ఎస్కేప్‌ రెగ్యులేటర్‌ సంపులోకి వచ్చిపడే వరదనీటిని కృష్ణానదితో పాటు కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువలోకి తరలించేవిధంగా ఈ పథ కాన్ని రూపొందించారు. సంపుకు తూర్పువైపున ఐదు లాకులతో కూడిన వంతెన వంటి నిర్మాణాన్ని ఎస్కేప్‌ రెగ్యులేటర్‌ పేరుతో నిర్మించారు. వరదల సందర్భంలో రెగ్యులేటర్‌ లాకులను ఎత్తేస్తే ఐదువేల క్యూసెక్కుల వరదనీరు పశ్చిమ ప్రధానకాలువలోకి తరలిపోతుంది.ఈ ఎస్కేప్‌ రెగ్యులేటర్‌ను రూ.9.5 కోట్లవ్యయంతో నిర్మించారు. పైౖపులతో అనుసంధానమే కీలకం డెలివరీ సిస్టమ్‌ను పంప్‌హౌస్‌తో అనుసంధానిస్తూ కరకట్టరోడ్డు దిగువ నుంచి రెండుమీటర్ల డయా వ్యాసం కల 16 పైపులను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం కరకట్ట రోడ్డును తవ్వేశారు. పైపుల అనుసంధానం పూర్తయ్యాక తిరిగి రోడ్డును పునర్నిర్మిస్తారు. ఈ పైపుల కోసం రూ.18 కోట్లను ఖర్చు చేశారు. డెలివరీ సిస్టమ్‌ ఉండవల్లి కరకట్టకు దిగువన కృష్ణాతీరం వైపు రూ.ఎనిమిది కోట్ల వ్యయంతో డెలివరీ సిస్టమ్‌ను ఏర్పాటుచేశారు. ఇది చూసేందుకు ఓ మినీ శ్రీశైలం ప్రాజెక్టు మాదిరి వుంటుంది. ఈ డెలివరీ సిస్టమ్‌ నుంచే మరో ఐదువేల క్యూసెక్కుల వరదనీరు నదిలోకి వేగంగా దూసుకుపోతుంది. సబ్‌స్టేషన్‌ పనులు షురూ చివరిగా మొత్తం పథకాన్ని నడిపించేందుకు అవసరమైన విద్యుశ్చక్తి కోసం సంపునకు దక్షిణంగా 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. ఇక్కడినుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో నులకపేట వద్ద వున్న తాడేపల్లి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌తో దీనిని అనుసంధానించేలా 22 టవర ్లతో ట్రాన్స్‌మిషన్‌ లైనును ఏర్పాటుచేశారు. ఈ లైను, కంట్రోల్‌రూమ్‌, అంతర్గత రోడ్ల నిమిత్తం రూ.14 కోట్లను ఖర్చు చేస్తుండగా అచ్చంగా విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ కోసం మరో రూ.13.6 కోట్లను వెచ్చిస్తున్నారు. అత్యవసర సందర్భాలను దృష్టిలో వుంచుకుని ముందుజాగ్రత్తగా నాలుగు డీసెల్‌ జనరేటర్లను రూ.4.25 కోట్ల వ్యయంతో అందుబాటులో ఉంచుతున్నారు. క్షేత్రస్థాయిలో కొంతమేర పంప్‌హౌస్‌, సంపు నిర్మాణ పనులు మాత్రమే మిగిలివున్నాయి. వీటిని మార్చి మాసాంతానికి పూర్తిచేసి ఏఫ్రిల్‌ నెలాఖరులోగా ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నారు. పంప్‌హౌస్‌ ఉండవల్లి కరకట్టకు ఎగువన డెలివరీ సిస్టమ్‌కు దక్షిణ అభిముఖంగా అత్యంత ప్రధానమైన పంప్‌హౌస్‌ను రూ.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇందులో మొత్తం 16 పంపులను ఏర్పాటుచేస్తున్నారు. ప్రస్తుతానికి 12 పంపులను బిగించేందుకు అనువుగా పంప్‌హౌస్‌ నిర్మాణం పూర్తయింది. మరో నాలుగు పంపులను ఏర్పాటుచేసేందుకు వీలుగా నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పంప్‌హౌస్‌పైన మోటార్లను ఏర్పాటుచేసేందుకు మోటారుహౌస్‌ను ఏర్పాటు చేయాల్సివుంది. పంప్‌హౌస్‌పైన నిర్మించిన కాంక్రీటు శ్లాబ్‌పై సంబంధిత మోటార్లను బిగించి వాటి రక్షణ కోసం ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ నిర్మాణాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ పంప్‌ కమ్‌ మోటారు హౌస్‌లో ఏర్పాటు చేయబోయే అన్ని రకాల యంత్రసామాగ్రిని రూ.91 కోట్లతో కోనుగోలు చేసి క్షేత్రస్థాయిలో సిద్ధంగా వుంచారు.
  5. Still very early stages but Emirates is interested in Amaravati avivation center and new airport at Mangalagiri.....BEtween Vijayawada-Guntur untundi idi and that will make it best airport in India with train(7 tracks)&road connectivity from whole state.... CBN is seeing this part of main driver for "International medical tourism center on riverfront" http://www.merinews.com/article/emirates-to-bring-an-investment-of-rs-30000-crore-to-andhra-pradesh/15929030.shtml ivvala Emirates MOU with Emirates(sheikh ahmed bin saeed al maktoum, Top#10 in world richest guy)
  6. all road works great progress and moving fast
  7. DB bros, farming lo invest cheddam anukune vallu 10 lakhs lopu polam vaste konesukovachu e right canal main branch kinda unless complete chavudu.. akari vakasam(maximum 1+ 2019 season lo lo full water ichestaru as per plan and trails will complete this year and project has no risk except land acquitsition) for good farming lands in Guntur D.t particularly..... Total 15+ lakh acres will get benefit by 2019....another 2+ lakhs 1 year after that with Gundlakamma side areas linking... Karempudi,Nakrekallu Top beneficiaries as water drops there in NSP right... Sattenapalli-Amaravati total road lands inka bangaram....Sattenapalli-Krosuru kooda as the pipe line&canal goes close to them and gravity helps them... Sattenapalli-Bellamkonda,Narasaraopeta,canal baga veltundi konni areas ikkada and make sure on that) daggara unnai manchi lands takkuva ki.... Trupurantakam&Addanki branch canal vallaki malli life vachinatle after decades...vallaki drinking water kooda ledu e madya.. Bellamkonda(nagaram) daggara not so great but erra nelalu unnai and water vaste commercial crops pandutai...ikkada Grey hounds vastundi so naxal bahyam kooda undadu like before... little becareful of faction villages and YSRCP batch areas....
  8. actually that is NEW IT zone kapuluppada....1500 acres decoit got UNITECH fradster&ras-alkhaima gang part bauxite loot....finally CBN govt got land back in COURT
  9. http://www.andhrajyothy.com/artical?SID=529671 జూన్‌కల్లా భూసేకరణ ఇక ఆలస్యం వద్దు 31-01-2018 02:46:23 అనంత-అమరావతి రహదారిపై ముఖ్యమంత్రి ఆదేశం రాజధాని రింగ్‌రోడ్లకు సమీకరణే బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ పొడిగింపు నిడమానూరు దాకా విస్తరణ దుర్గగుడి ఫ్లైఓవర్‌ పనులపై సీఎం అసంతృప్తి నిర్మాణ సంస్థ సోమాపై ఆగ్రహం అమరావతి, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ‘రాయలసీమను అమరావతికి అనుసంఽధానించే అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ వే నా కలల ప్రాజెక్టు. వంపులు లేకుండా తిన్నగా రహదారి నిర్మించి సీమ ప్రజలు తక్కువ సమయంలోనే రాజధానికి చేరుకోవాలన్న సంకల్పంతోనే దీన్ని చేపట్టా. రకరకాల కారణాలతో ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు. ప్రభుత్వమే భూసేకరణ చేపట్టనుంది. అందుచేత ఇక ఆలస్యం వద్దు. జూన్‌ నెలాఖరు నాటికి భూసేకరణ ప్రక్రియ పూర్తిచేయాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్లు భవనాల శాఖను ఆదేశించారు. మంగళవారం రాత్రి సచివాలయంలోని తన కార్యాలయంలో ఆయన ఆర్‌ అండ్‌ బీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. జాతీయ రహదారులు, దుర్గగుండి, బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్లతో పాటు ఇతర రహదారుల నిర్మాణ పురోగతిని సమీక్షించారు. బెంజ్‌ సర్కిల్‌ ప్లైఓవర్‌ను భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిడమానూరు వరకు పొడిగించాలని ఆదేశించారు. ఈ ఏడాది నవంబరుకల్లా పూర్తిచేసి తీరాలని నిర్దేశించారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే నగర ట్రాఫిక్‌ సమస్యలు చాలా మేరకు పరిష్కారమవుతాయని తెలిపారు. జాతీయ రహదారికి తక్షణమే మరమ్మతులు విజయవాడ-రాజమహేంద్రవరం మధ్య దెబ్బతిన్న జాతీయ రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని సీఎం అన్నారు. రహదారి సరిగా లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొనడంతో అధికారులు మౌనం దాల్చారు. పనుల్లో పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. విజయవాడ-గుండుగొలను, గుండుగొలను-రాజమహేంద్రవరం రహదారిని రెండు దశల్లో పూర్తిచేయాలన్నారు. నెల్లూరు-తడ మార్గాన్ని, ఇచ్ఛాపురం-నరసన్నపేట రహదారులను ఆరు వరుసలుగా మార్చాలని ఆదేశించారు. తిరుపతి వైకుంఠమాల రహదారిని నాయుడుపేట, చిత్తూరు, మదనపల్లె తదితర ప్రాంతాలకు అనుసంధానం చేసే ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. కృష్ణపట్నం నుంచి సత్యవేడు మీదుగా తిరుపతికి వంపులు లేని రహదారిని నిర్మించే అంశాన్ని పరిశీలించాలన్నారు. డ్రోన్లు ఉపయోగించి రహదారుల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని చెప్పారు. అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్ల నిర్మాణం కోసం అవసరమైన భూములను భూ సమీకరణ కిందే సేకరించాలని స్పష్టం చేశారు. దుర్గగుడి ఫ్లైఓవర్‌ నిర్మాణం తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణ సంస్థ సోమా కంపెనీపై విరుచుకుపడ్డారు. ‘మీ చేతకానితనం, అసమర్థత వ ల్ల నిర్మాణంలో ఎంతో జాప్యం జరుగుతోంది. దీనివల్ల ప్రభుత్వ పరువు పోతోంది. పనులు వేగవంతం చేయాలని ఎన్నిసార్లు ఆదేశించినా పురోగతి కనిపించడం లేదు. మరోవైపు నిర్మాణం కోసం ప్రధాన రహదారిపై వాహనాలను అనుమతించకపోవడంతో తీవ్రమైన ట్రాఫిక్‌ చిక్కులు ఎదురవుతున్నాయి. పనుల్లో వేగం పెంచడానికి రాష్ట్రం తన వాటా కింద నిధులను ఎప్పటికప్పుడు అందిస్తోంది. ఎలాంటి సాంకేతిక, ఇతర సమస్యలు రాకుండా సజావుగా పనులు కొనసాగించేలా అవకాశాన్ని కల్పించినా సోమా అందిపుచ్చుకోవడం లేదు. మార్చి నాటికి ఫ్లైఓవర్‌ పైభాగాన్ని 13వ పిల్లర్‌ వరకు పూర్తిచేయాల్సిందే. ప్రధాన రహదారి రాకపోకలను పునరుద్ధరించి తీరాలి. లేనిపక్షంలో తీవ్ర చర్యలు తీసుకుంటా’ అని సీఎం హెచ్చరించినట్లు తెలిసింది. బుధవారం నుంచే ఫ్లైఓవర్‌ పైభాగం పనులు మొదలవుతాయని అధికారులు తెలిపారు. పనులకు అడ్డంకిగా మారిన కాలువ ప్రవాహాన్ని తాత్కాలికంగా ఆపడానికి జలవనరుల శాఖతో మాట్లాడామని చెప్పారు. పనుల్లో వేగం పెంచేందుకు సోమా కోరినట్లుగా మరో రూ.10 కోట్లు ఇవ్వడానికి సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. గుంతలు కనిపిస్తే వేటే.. రాష్ట్రంలో ఫిబ్రవరి ఆఖరునాటికి రహదారులు అస్తవ్యస్తంగా గుంతలతో కనిపించకూడదని చంద్రబాబు ఆర్‌ అండ్‌ బీకి గడువు విధించారు. ‘రోడ్లు ఎలా ఉన్నాయో నేనూ పరిశీలిస్తా. గుంతలు కనిపిస్తే సహించను. గుంతలున్న రోడ్డు పరిధిలోని జేఈ, ఏఈలను అసమర్థులుగా జమకట్టి సస్పెండ్‌ చేయడానికైనా వెనుకాడను’ అని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రమాదాలకు ఆస్కారం లేకుండా రహదారులను రూపొందించుకునే అంశంపై ప్రభుత్వానికి సహకరించేందుకు డస్సాల్ట్‌ అనే సంస్థ త్వరలో రాష్ట్రానికి రానుందని సీఎం వెల్లడించారు. రహదారుల లోపాలను సవరించడం, ప్రమాదాలను అరికట్టేందుకు ఈ సంస్థ మార్గనిర్దేశం చేస్తుందన్నారు. రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలను సత్వరమే పూర్తిచేసేలా రైల్వే మంత్రితో చర్చిస్తానని చెప్పారు.
  10. http://www.andhrajyothy.com/artical?SID=529771 భూసేకరణకు రెడీ.. ఆరు గ్రామాలకు అవార్డులు జారీ 31-01-2018 08:27:41 గుంటూరు: అమరావతి రాజధాని నగర పరిధిలోని ఆరు గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియని గుంటూరు జిల్లా యంత్రాంగం కొలిక్కి తీసుకొచ్చింది. భూసేకరణలో చివరి అంకంగా పరిగణించే అవార్డుల జారీని ప్రకటించింది. గతంలో నేలపాడు గ్రామానికి అవార్డు ప్రకటన పూర్తి కాగా తాజాగా అబ్బరాజుపాలెం, బోరుపాలెం, లింగాయపాలెం, రాయపూడి-1, రాయపూడి-2, శాకమూరు గ్రామాలకు అవార్డులను ప్రకటించారు. అవార్డులు ప్రకటించిన రైతులకు త్వరలోనే నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేయనున్నట్లు సీఆర్డీయే వర్గాలు తెలిపాయి. మరికొద్ది రోజుల్లో మిగిలిన గ్రామాల అవార్డులను కూడా ప్రకటిస్తామని వెల్లడించాయి. ఒకవేళ ఈలోపు రైతులు ముందుకొస్తే వారి భూములను భూసమీకరణ పథకం కింద తీసుకొనేందుకు ఇంకా అవకాశం ఉందని స్పష్టం చేశాయి. భూసమీకరణే మేలు భూసేకరణలో ప్రభుత్వం ఎకరానికి నిర్ణయించిన ధర కంటే రెండున్నర రెట్లు అధికంగా వస్తుంది. అబ్బరాజుపాలెంలో ఎకరం భూమి రూ.8 లక్షలు కాగా దీనికి రెండున్నర రెట్లు కలిపితే కేవలం రూ.28 లక్షలు మాత్రమే రైతులకు వస్తాయి. అదే భూసమీకరణ కింద ఇస్తే ఎకరానికి వెయ్యి చదరపు గజాల నివాస, 250 చదరపు గజాల వాణిజ్య భూమిని సీఆర్‌డీఏ ఇస్తోంది. ప్రస్తుతం రాజధాని గ్రామాల్లో చదరపు గజం భూమి విలువ రూ.20 వేల వరకు ఉన్నట్లు అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిని పరిగణనలోకి తీసుకొంటే ఎకరం భూమి ఎల్‌పీఎస్‌ కింద ఇస్తే ప్రస్తుతం ఉన్న ధరని లెక్కిస్తేనే సుమారు రూ.2.50 కోట్ల మేరకు లబ్ధి కలుగుతుందని బేరీజు వేసి చూపిస్తున్నాయి. అంతేకాకుండా ఏటా రూ.30 వేలు ప్రతీ ఏటా 10 శాతం పెంచుతూ కౌలు ప్రభుత్వం చెల్లిస్తుంది. దీనికి అదనంగా విద్య, వైద్యం, పక్కా ఇళ్లు, పెన్షన్లు, ఒకేసారి రుణమాఫీ వర్తింపు వంటి ప్రోత్సాహకాలు అదనంగా లభిస్తాయని వివరిస్తున్నాయి. మిగిలిన గ్రామాల్లో రైతులు అవార్డులు ప్రకటించే లోపు వస్తే వారి భూములను ఎల్‌పీఎస్‌ కింద తీసుకొనే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నాయి.
  11. Vizag lo cisco&IBMe.t.c same itlantide inka advanced chestunaru....
  12. E candidate venaka undi cheyistunna court case in land acq(just some 7 acres and avi kooda occupied lands) valla SEEMA project water release 3 years late ayyindi.....ante a kasi e range ardam chesukondi...
  13. Rk bro, I am sure CBN NSP right varaku immediate ga chestadu and pulichintala(provided center does not play games with tribunal cutting krishna share) lo storage ki link istadu... Gundlakamma kooda 2 years lone chesestadu... Somasila long term vision provided center helps
  14. eyana drama and why behaves like that gurinchi mottam teliste me mind pelipotundi.....edo allies ani calm ga untunnamu manam kooda
  15. Gadkari varu, Keleswatram 80,000 crores karchu pedtunnaru...so meeru enta share chestaru ani other states(AP,K,Tamilandu) adigadu... Kaleswaram 80,000 crores lo share entra arey....mind dobbinda....asalu daniki PENNA riverconnect ki link entra...adi vallu 4 reservoirs kosam+500 meters altitude lift ki pette karchu.. daniki share enduku chesukovali ra arey....edu daniki PENNA ki lnk edutunandu....edavalni advisors ga pettunkunte ittanti salahale istaru...
  16. YES, if our time becomes that bad we have to put lift inside RESERVOIR to the bottom in SUMMER....but I don't think we are planning that level PATTISEEMA&PURUSHOTHA patnam LIFT are down the RESERVOIR.......Once polavaram is complete they are not used but TUNNELS from regulator provide water to RIGHT&LEFT... You can see pattiseema PIPELINE under ground and TUNNEL below DAM. Same you can see LEFT LIFT canal below DAM but HILL TUNNEL above DAM https://www.google.com/maps/place/Polavaram,+Andhra+Pradesh+534315,+India/@17.2383101,81.6280377,11217m/data=!3m1!1e3!4m5!3m4!1s0x3a37044d8a93cb1d:0xf63e7f91cf8f3a5!8m2!3d17.2478932!4d81.6432353
  17. meeku perfect explanation "Polavaram Project is essentially a diversion scheme elevating water level with reservoir so that discharge happens to right/left canal. It is not meant for OPTIMAL storage usage to the bottom of reservoir".... diniki SAGAR laga to the bottom usage ledu....SAGAR is at HIGH altitude where as POLAVARAM is very low altitude.... Main reason, at polavaram godavari is just 20 meters altitude and right canal is 50 meters
  18. NO plan for PUMPING from RESERVOIR ground level to Rigth/Left canal...a avasaram radu mostly.... * in SEASON(almost 6-9 months) from head regulator water flows with gravity to Right canal through tunnel * Rest of time we use above regulator storage for right/left * No plans to pump from RESERVOUR ground(20 meters).... Same like Sagar anukondi....Sagar lo manam bottom water ni eppudu LIFT cheyyam....we take only that is at regulator level
  19. Not just ground water, SEEMA area generally does not need lining all across compared to DELTA area....DELTA area soil erosion is big risk so LINING is mandatory all across with high risk....
  20. palamuru-rangareddy dirnking water varaku chestaru kani irrigation water(I mean 2 TMC per day) cheyyaru...KCR drinking water ni exagarate chesi 2 TMC per day ani asala apllaki ekkistunadu....adi cheste NALGONDA,KHAMMAM edari ayipotai permanent ga... KCR just declared that but funds are released ONLY for UPPER T LIFT projects(the belt he has interests) - project cost is 60,000 crores - power cost 7-10K?, so anta tondaraga cheyadu KCR is against NALGONDA,KHAMMAM and all his irrigation plans are for UPPER T belt.......He rejected whatever proposal(dummagudem,Godavari-penna@ akinepalli) that helps these districts till now
  21. VELUGODU- 260 meters altitude so BIG NO , pothireddypadu - also same HIGH altitude so BIG no But we don't need to connect them as SRISAILUM will be dedicated for SEEMA(already this year AP gave 150 TMC to 3 districts of seema and once handri-2,3 are complete another 50 TMC) Summary, SRISAILUM&TUNGABADRA are good enough(unless it becomes more worse) for pothireddypadu demands as we store water there when there is flood...
  22. visaalandhra mudranalayam vundhi aa road lo.. established 63 years ago on June 22, 1952 in Vijayawada anta, as of 2014 Circulation: 40000. Readership: 80000 still feasible to survive ?
  23. 20,000 crore wrong just for NSP right canal.....Eenadu vadu penna link lo unna works kooda mix chestunadu...
  24. idi mana intra state project....pushpams Environment clearences and Tribunal hurdles create cheyykunte adi padivelu... pushpams kakpote LOAN rakunda chustaru showing riverinterlink project(which will never happen)...
×
×
  • Create New...