Jump to content

sonykongara

Members
  • Posts

    66,780
  • Joined

  • Last visited

  • Days Won

    90

Everything posted by sonykongara

  1. అసెంబ్లీ సీట్ల పెంపుపై మరో అడుగు ఆర్టికల్‌ 170(3)కి సవరణే చాలు! న్యాయశాఖ అభిప్రాయం కేంద్ర హోంశాఖకు దస్త్రం తదుపరి కార్యాచరణకు సిద్ధం ఈనాడు - దిల్లీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు దిశగా మరో ముందడుగు పడింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 26 ప్రకారం సీట్లు పెంచుకోవడానికి వీలుగా రాజ్యాంగ సవరణ చేసుకోవడానికి కేంద్ర న్యాయశాఖ పచ్చజెండా వూపినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన దస్త్రానికి న్యాయశాఖ ఆమోదముద్ర వేసి హోంశాఖకు పంపినట్లు సమాచారం. ఇప్పటివరకూ అసెంబ్లీ సీట్ల పెంపునకు అడ్డంకిగా ఉన్న ఆర్టికల్‌ 170(3)కి చిన్న సవరణ చేస్తే సరిపోతుందని న్యాయశాఖ అభిప్రాయపడినట్లు తెలిసింది. ఆ ఆర్టికల్‌ కింద పొందుపరిచిన నిబంధనలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు వర్తించవని పేర్కొంటూ రాజ్యాంగ సవరణ చేస్తే సరిపోతుందని సూచించినట్లు తెలిసింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 26 ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 2019 ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్లు పెంచాలంటే ఆర్టికల్‌170(3)కి సవరణ చేయాల్సిందేనని గత అటార్నీ జనరల్‌ ముఖుల్‌ రోహత్గీ చెప్పారు. ఆయన అభిప్రాయానికి అనుగుణంగానే ఇప్పుడు న్యాయశాఖ సవరణలు సూచించినట్లు సమాచారం. బాధ్యత హోంశాఖదే విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు బాధ్యత హోంశాఖపై ఉన్నందున కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దీనిపై దాదాపు రెండు నెలల క్రితం న్యాయశాఖ సలహా కోరారు. వారు అన్ని కోణాల్లో పరిశీలించి గత అటార్నీ జనరల్‌ ఇచ్చిన సూచనను సమర్థిస్తూనే, రాజ్యాంగ సవరణ ఎలా చేయాలో సూచనలు చేసినట్లు తెలిసింది. ఈ రాజ్యాంగ సవరణకు మళ్లీ 50% రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సిన అవసరం లేదని, కేవలం పార్లమెంటులో బిల్లు పాస్‌ చేస్తే సరిపోతుందని అందులో పేర్కొన్నట్లు తెలిసింది. దీనిపై కేంద్ర హోంశాఖ తదుపరి అభిప్రాయాలు తెలుసుకోనుంది. ఈ సవరణవల్ల ఇతరత్రా ప్రభావాలేమైనా ఉంటాయా? అని నిర్ధారించుకున్న తర్వాత కేబినెట్‌ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలిసింది. తర్వాత దీన్ని రాజకీయ వ్యవహారాల కేబినెట్‌ కమిటీలో పెట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత పార్లమెంటుకు బిల్లు రూపంలో తీసుకొచ్చే అవకాశం ఉంటుందని సమాచారం. ఈ మొత్తం ప్రక్రియ వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే పూర్తి కావాలని ఇటు తెలుగుదేశం, అటు తెరాస పార్టీలు ఆకాంక్షిస్తున్నాయి. పూర్తి చేయాల్సిన అంశాలు ఇంకా ఎన్నో? అసెంబ్లీ సీట్ల పెంపునకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నా ఆ అంశం సాఫీగా పూర్తి కావాలంటే చేయాల్సిన తతంగాలు చాలా ఉన్నాయి. ముందస్తుగానే ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రక్రియ సాఫీగా జరిగే అవకాశం ఉంటుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. * విభజన చట్టంలోని సెక్షన్‌ 26(2) ప్రకారం ఈ నియోజకవర్గాల పునర్వి్యభజన ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘమే పూర్తి చేయాలి. అంటే ప్రధాన ఎన్నికల కమిషనరుతోపాటు, మరో ఇద్దరు కమిషనర్లకు ఇందులో పాత్ర ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనరుకు ఇందులో స్థానం కల్పిస్తేనే ప్రక్రియ సాఫీగా సాగడానికి వీలవుతుంది. విభజన అన్నది పూర్తిగా రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాబట్టి 2003 నియోజకవర్గాల పునర్వి్యభజన చట్టంలోని సెక్షన్‌-3 ప్రకారం ఇరు రాష్ట్రాల ఎన్నికల సంఘం కమిషనర్లనూ ఇందులో ఎక్స్‌అఫిషియో సభ్యులుగా నియమించారు. ఇప్పుడూ అదే నిబంధన ఇక్కడా వర్తింపజేయాల్సి ఉంటుంది. * పునర్వి్యభజన చట్టం ప్రకారం 1975, 2008లో జిల్లాలను యూనిట్‌గా తీసుకుని అసెంబ్లీ నియోజకవర్గాలను విభజించారు. అయితే 2014 ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలను ఏ ప్రాతిపదికన విభజించాలన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. విభజన చట్టంలోని సెక్షన్‌ 1(సి)లో పార్లమెంటు నియోజకవర్గ సరిహద్దులను మార్చవచ్చని స్పష్టంగా చెప్పారు. ఆర్టికల్‌ 81(ఎ), క్లాజ్‌-2 ప్రకారం రాష్ట్ర జనాభా అన్ని అసెంబ్లీ స్థానాల్లో దాదాపు సమానంగా ఉండాలి. ఈ నిబంధనను నెరవేర్చాలంటే అసెంబ్లీ స్థానాల విభజనకు జిల్లాను యూనిట్‌గా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పార్లమెంటు నియోజకవర్గాన్ని యూనిట్‌గా చేసుకుంటే రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనను అమలు చేయడం కష్టమవుతుంది. * నియోజకవర్గాల పునర్వి్యభజన చట్టం ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గం ఒక జిల్లా పరిధిలోనే ఉండాలి. రాజ్యాంగం ప్రకారం 2026 వరకు పార్లమెంటు స్థానాల సంఖ్య పెంచకూడదు తప్పితే వాటి సరిహద్దులు మార్చడానికి ఎక్కడా అడ్డంకులు లేవు. ఈ నిబంధన ఆధారంగా పశ్చిమబంగలో 2016లో మూడు లోక్‌సభ స్థానాల సరిహద్దుల్లో మార్పులు చేశారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఉభయ రాష్ట్రాల్లో జిల్లాను యూనిట్‌గా చేసుకుని విభజన ప్రక్రియ చేపట్టాలి. * అసెంబ్లీ స్థానాల విభజన ప్రక్రియ మొత్తం 2011 జనాభా లెక్కల ప్రకారం జరిగేలా చూసుకోవాలి. అలాగే మొత్తం ప్రక్రియను ఆరు నెలల్లోగా పూర్తి చేసేలా కేంద్ర హోంశాఖ గడువు విధిస్తూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
  2. ‘ఏలేరు’కు 7 నుంచి 9 టీఎంసీలు! పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా వరద జలాలు సరఫరా పూర్తిస్తాయిలో తరలింపు ఈ ఏడాదికి అసాధ్యమే..! పోలవరం ఎడమ కాలువలో ప్రత్యామ్నాయాలపై దృష్టి ఈనాడు - అమరావతి పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా గోదావరి వరద జలాలను కనీసం 1400 క్యూసెక్కులైనా ఆగస్టు 15 నాటికి ఏలేరు జలాశయానికి మళ్లించాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఇందుకోసం పోలవరం ఎడమ కాలువలో పనులకు సంబంధించి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని సూచించింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద గోదావరి ఒడ్డున, పోలవరం ఎడమ కాలువ 50వ కిలోమీటరు వద్ద నీటిని ఎత్తిపోసేలా పంపుల నిర్మాణం పూర్తి చేయనున్నారు. అయితే..ఈ నీటిని పోలవరం ఎడమ కాలువ ద్వారా మళ్లించే విషయంలో కొన్ని సవాళ్లు ఎదురుకానున్నాయి. ప్రధానంగా జాతీయ రహదారిపై మూడు చోట్ల వంతెనలు నిర్మించాల్సి ఉంది. ఆ వంతెనల నిర్మాణం ఆగస్టులోపు పూర్తి చేయడం సాధ్యం కాదు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా తాత్కాలిక వంతెనలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యామ్నాయాలను చేపట్టి.. పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా 3500 క్యూసెక్కుల(దాదాపు 30టీఎంసీలు) గోదావరి వరద జలాలను మళ్లించాలనేది యోచన. ఈ నీరు సరఫరా చేయాలంటే పోలవరం ఎడమ కాలువలో తొలి రెండు ప్యాకేజీల్లో పనులు పూర్తి స్థాయిలో చేయాల్సి ఉంటుంది. * ఎడమ కాలువ 5.986 కిలోమీటరు వద్ద వచ్చి కలిసే వినుకొండ కాలువ పైనుంచి వెళ్లిపోయేలా సూపర్‌ పాసేజ్‌ నిర్మించాల్సి ఉంది. మొత్తం 284 క్యూమెక్కుల నీరు ఈ కాలువ ద్వారా ఎడమ కాలువను దాటుతుంది. ప్రస్తుతం ఈ సూపర్‌ పాసేజ్‌ నిర్మాణం పూర్తి కాకపోయినా ఆ కాలువలో వచ్చే నీటిని పోలవరం ఎడమ కాలువలోనే కలిపి పంపేలా...మరీ ఎక్కువగా వస్తే కాలువ నుంచి బయటకు వదిలేసేలా ప్రత్యామ్నాయం చూస్తున్నారు. * పోలవరం ఎడమ కాలువ 13.26 కిలోమీటరు వద్ద బురద కాలువపై సూపర్‌ పాసేజ్‌ నిర్మించాలి. ఈ కాలువలో గరిష్ఠంగా 1,360 క్యూమెక్కుల నీరు వస్తుంది. ఇక్కడ కూడా పై తరహా విధానాన్నే చేపట్టనున్నారు. * 16.385 కిలోమీటరు వద్ద రెండు వరుసల వంతెన నిర్మించాల్సి ఉంది. నిర్ణీత సమయంలో ఈ పనులను పూర్తి చేసే యోచనలోనే ఉన్నారు. లేని పక్షంలో ఇక్కడా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తారు. * పోలవరం కాలువ 17.365 కిలోమీటరు వద్ద ఒక వరుస వంతెనతో పాటు సూపర్‌ పాసేజ్‌ నిర్మించాలి. ఈ పనులు ప్రారంభమయ్యాయి. వంతెనల నిర్మాణమే సవాల్‌... ఈ ఎడమ కాలువ 58వ కిలోమీటరు లోపు మూడు చోట్ల జాతీయ రహదారిని కాలువ దాటాల్సి ఉంది. దీంతో ఆ ప్రాంతాల్లో జాతీయ రహదారిపై వంతెనలు నిర్మించాల్సి ఉంది. ఈ నిర్మాణ పనులు జలవనరులశాఖే చేపట్టేందుకు జాతీయ రహదారుల సంస్థ అనుమతులిచ్చింది, టెండర్లు పిలిచి పనులు అప్పచెప్పారు. జాతీయ రహదారుల అధికారులు వంతెనల ఆకృతుల అనుమతులకు వేరే అంశానికి ముడిపెట్టడంతో కొంత ఆలస్యమయిందని సమాచారం. ఈ నేపథ్యంలో ఆగస్టు 15 నాటికి ఆ వంతెనల నిర్మాణం పూర్తి కాదనే నిర్థారణకొచ్చారు. ఈ నేపథ్యంలో 1500 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యానికి తగ్గట్టుగా తాత్కాలిక వంతెనలు నిర్మించనున్నారు. ఇందుకు అంచనాలు రూపొందిస్తున్నారు. జాతీయ రహదారుల సంస్థ ఆమోదించిన మేరకే ఈ తాత్కాలిక వంతెనలకు ఆకృతులు సిద్ధం చేస్తున్నామని ఎస్‌ఈ సుగుణాకరరావు తెలిపారు. కనీసం 7 టీఎంసీలైనా మళ్లించాలని.. ఆగస్టు 15న ఈ ఎత్తిపోతల్లో పంపులను ప్రారంభించి కనీసం 7 నుంచి 9 టీఎంసీలనైనా ఏలేరు జలాశయానికి ఈ ఏడాది మళ్లించాలని యోచిస్తున్నారు. ఏలేరులో సహజంగా వచ్చే ప్రవాహాలకు తోడు ఈ నీరు కలిస్తే ఏలేరును పూర్తి స్థాయిలో నింపవచ్చని లెక్క కడుతున్నారు.
  3. విశాఖపట్నంలో మెగా ఐటీ పార్కు కాపుల ఉప్పాడ వద్ద 1300 ఎకరాల్లో ఏర్పాటు తిరుపతిలో రెండో ఎలక్ట్రానిక్‌ క్లస్టర్‌ ఐటీ మంత్రి నారా లోకేష్‌ ఈనాడు - అమరావతి విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం కాపుల ఉప్పాడ వద్ద 1351 ఎకరాల విస్తీర్ణంలో ఒక పెద్ద ఐటీ పార్కు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదలను రాష్ట్ర ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ మంత్రి నారా లోకేష్‌కు చూపించారు. రాష్ట్రంలో చేపడుతున్న ఐటీ ప్రాజెక్టులకు సంబంధించి ఏపీఐఐసీ పరంగా చేపడుతున్న పనులను మంత్రి నారా లోకేష్‌ బుధవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపాదనలపై, అక్కడ అంత స్థలం ఎక్కడ లభ్యమవుతుంది, ఐటీ పార్కు ఏర్పాటుకు అక్కడ ఉన్న అనుకూల అంశాలు తదితరాలను చర్చించారు. దాంతోపాటు తిరుపతి వద్ద వికృతమాల వద్ద ఉన్న ఎలక్ట్రానిక్స్‌ క్లస్టర్‌తో పాటు రెండో ఎలక్ట్రానిక్‌ క్లస్టర్‌ ఏర్పాటు అంశంపైనా మాట్లాడారు. 500 ఎకరాల్లో ఈ రెండో ఎలక్ట్రానిక్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తున్నారు. దాని ప్రగతి గురించి మంత్రి లోకేష్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ ఐటీ రంగ అభివృద్ధికి కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అక్టోబర్‌లోపు మిలీనియం టవర్‌: విశాఖపట్నంలో నిర్మించనున్న మిలీనియం ఐటీ టవర్‌ నిర్మాణాన్ని అక్టోబర్‌లోపు పూర్తి చేయాలని లోకేష్‌ అధికారులను ఆదేశించారు. ఈ పార్కు నిర్మాణానికి ఇప్పటివరకు జరిగిన పనులను ఆయన సమీక్షించారు. మంగళగిరిలో ఏపీఐఐసీ నిర్మిస్తున్న ఐటీ భవన్‌ నిర్మాణాన్ని అక్టోబరులోగా పూర్తిచేయాలన్నారు. మధురవాడలో ఐటీ సెజ్‌లో పలు సంస్థలకు భూములిచ్చామని, అందులో కార్యకలాపాలు ప్రారంభించని సంస్థలపై ఒత్తిడి తెచ్చి అవి త్వరితగతిన ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. ముందుకు రాకపోతే కేటాయించిన భూములను రద్దుచేసి ఇతర సంస్థలకు ఇవ్వాలన్నారు. ఐటీ శాఖ కార్యదర్శి విజయానంద్‌, సలహాదారు జేఏ చౌదరి, ఏపీఐఐసీ ఎండీ ఏ.బాబు, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు. సైబర్‌ భద్రతా దళాల ఏర్పాటు సైబర్‌ దాడుల నుంచి రక్షణ కల్పించేలా రాష్ట్రంలో ప్రత్యేకించి సైబర్‌ భద్రతా దళాలను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి లోకేష్‌ అధికారులకు సూచించారు. వెలగపూడి సచివాలయంలో సైబర్‌ భద్రతపై ఆయన పోలీసు, ఐటీ శాఖ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. లోకేష్‌ మాట్లాడుతూ హ్యాకింగ్‌, వానాక్రై, మాల్‌వేర్‌ లాంటి వైరస్‌లను ఎదుర్కొవడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. పోలీసులకు కూడా ప్రత్యేకించి శిక్షణ ఇవ్వాలన్నారు. సైబర్‌ భద్రతకు ‘భద్రత, నిర్వహణ కేంద్రాలను అభివృద్ధి చేసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.
  4. 12న పరిపాలన, న్యాయ నగరాల తుది ప్రణాళిక ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలో 1,365 ఎకరాల్లో నిర్మించే పరిపాలన, న్యాయ నగరాల తుది ప్రణాళికను లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ ఈ నెల 12న అందజేయనుంది. శాసనసభ, శాసనమండలి భవన తుది ఆకృతుల్ని కూడా సమర్పిస్తుంది. హైకోర్టు భవనానికి సంబంధించిన మూడు ప్రాథమిక ఆకృతుల్ని కూడా ఆ రోజు అందజేస్తుంది. వాటిలో ఒక దానిని ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. 900 ఎకరాల్లో పరిపాలన నగరాన్ని, దానికి కొనసాగింపుగా 465 ఎకరాల్లో న్యాయ నగరాన్ని నిర్మించనున్నారు. వచ్చే బుధవారం అందజేసే తుది ప్రణాళికకు ప్రభుత్వం మోదముద్ర వేస్తే... నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ వివరణాత్మక ప్రణాళికను సిద్ధం చేస్తుంది. దీనికి నవంబరు 17 వరకు సీఆర్‌డీఏ గడువు పెట్టింది. శాసనసభ భవనం తుది ఆకృతికి ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తే... వివరణాత్మక ఆకృతుల్ని దశలవారీగా అందజేస్తుంది. మొదటి పునాది వరకు (పైల్‌ ఫౌండేషన్‌) డ్రాయింగ్‌లు అందజేస్తుంది. హైకోర్టు భవనానికి సంబంధించి నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ఇది వరకు కొన్ని ప్రాథమిక ఆకృతులు ఇవ్వగా... వాటితో ముఖ్యమంత్రి సంతృప్తి చెందలేదు. దాంతో ఆ సంస్థ మరో మూడు ఆకృతుల్ని సిద్ధం చేస్తోంది. వాటిని కూడా బుధవారం అందజేయనుంది
  5. పిడుగుపాటును పసిగట్టే ‘వజ్రపథ్‌’ 05-07-2017 03:51:47 యాప్‌ను రూపొందించిన కుప్పం ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థులు నేడు ఆవిష్కరించనున్న చంద్రబాబు ఇస్రో-ఉన్నత విద్యా మండలి మధ్య ఎంవోయూ ఏపీ స్పేస్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ ఏర్పాటు అమరావతి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): పిడుగుపాటును పసిగట్టేందుకు రూపొందించిన వజ్రపథ్‌ యాప్‌ను సీఎం చంద్రబాబు బుధవారం ఆవిష్కరించనున్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఇస్రో, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. ఈ రెండు సంస్థల భాగస్వామ్యంలో ఏపీ స్పేస్‌ ఇన్నోవేషన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. కాగా, ఇస్రో, బెంగళూరులోని ఓ స్టార్టప్‌ కంపెనీ సాయంతో చిత్తూరు జిల్లాలోని కుప్పం ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థులు ఈ యాప్‌ను రూపొందించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, ఉన్నత విద్యామండలి, విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్‌ కాలేజీల సంయుక్త సహకారంతో ఈ యాప్‌ సేవలను వినియోగించుకోనున్నారు. ఇందుకు అవసరమైన సాంకేతికతను ఇస్రో, నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ అందించనున్నాయి. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న యూనివర్సిటీలు, పలు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో పిడుగుపాటును గుర్తించి హెచ్చరికలు పంపే పరికరాలను అమరుస్తారు. పిడుగు పడే అవకాశం ఉండే వెంటనే ఆ సమాచారాన్ని వజ్రపథ్‌ యాప్‌ ద్వారా ప్రజలకు తెలియజేస్తారు.
  6. రైతు రథంపై మధ్యేమార్గం! ‘రొటోవేటర్‌’ కొనుగోలు నిబంధన తొలగింపు ఈనాడు, అమరావతి: రైతుల సూచనల నేపథ్యంలో ‘రైతు రథం’ పథకం నిబంధనలు మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ పథకంలో రాయితీపై 6 వేల ట్రాక్టర్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ట్రాక్టర్‌తో పాటు రొటోవేటర్‌, లేక మరేదైనా రూ.లక్ష విలువ చేసే పరికరాన్ని తప్పనిసరిగా కొనాలనే నిబంధన పెట్టారు. ఆ పరికరాలను విడిగా తీసుకుంటే రాయితీ వస్తోందని, ట్రాక్టర్‌తో కలపడంతో తమపై భారం పడుతోందని రైతులు వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ట్రాక్టర్లపై ఇస్తున్న రాయితీలో రూ.50 వేలు తగ్గించి.. రొటోవేటర్‌ నిబంధనను తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకంలో 2 వీల్‌ డ్రైవ్‌ ట్రాక్టర్‌పై రూ.2 లక్షలు, 4 వీల్‌ డ్రైవ్‌ ట్రాక్టర్‌పై రూ.2.50 లక్షల రాయితీ ప్రకటించారు.
  7. ఐటీ సంస్థలకు రెడీమేడ్‌ ఆఫీసులు! 04-07-2017 02:19:37 50 లక్షల చ.అడుగుల్లో భవంతులు నిర్మాణ సంస్థలకు 50ు అద్దె రాయితీ అమరావతి, జూలై 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఐటీ రంగాన్ని విస్తృతపరిచేందుకు ప్రభుత్వం కార్యోన్ముఖమైంది. ఇందుకోసం ‘డిజిగ్నేటెడ్‌ ఐటీ పార్కు(డీటీపీ)’ పాలసీని కేబినెట్‌ సోమవారం ఆమోదించింది. మూడేళ్లలో 50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భవనాలను ఐటీ కంపెనీల కోసం నిర్మించాలని నిర్ణయించింది. ఆయా కంపెనీలు తరలివస్తే 50 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని భావిస్తోంది. కొత్త విధానం ప్రకారం..మొత్తం 50 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో ఐటీ రంగం కోసం భవనాలు నిర్మిస్తారు. నిర్మాణం చేపట్టిన సంస్థకు 50 శాతం దాకా అద్దె రాయితీని ఐటీ శాఖే చెల్లిస్తుంది. లక్ష చ.అడుగుల విస్తీర్ణం మేర భవనాన్ని నిర్మిస్తే.. 18 నెలలు, 2 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తే రెండేళ్లు, 3 లక్షల చ.అడుగుల్లో నిర్మిస్తే 30 నెలలు, 4 లక్షల చ.అడుగుల్లో భవనాన్ని నిర్మిస్తే .. 36 నెలల పాటు 50 శాతం అద్దె రాయితీని ఐటీ శాఖ భరిస్తుంది. 70 శాతం ఆక్యుపేషన్‌ రేటు ఉంటే కార్యాలయ భవన నిర్మాతలకు ప్రభుత్వం ఏమీ ఇవ్వదని, అంతకంటే తక్కువ ఉంటే అద్దెలో 50 శాతం రాయితీ ఉంటుందని మంత్రి లోకేశ్‌ తెలిపారు. ప్రభుత్వ కృషితో కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి సిద్ధపడిన కంపెనీలు.. స్థలాల్లేక ఆగిపోతున్నాయని, ఈ సమస్యను అధిగమించడానికి తాజా విధానం ఉపయోగపడుతుందని చెప్పారు.
×
×
  • Create New...