Jump to content

sonykongara

Members
  • Posts

    75,552
  • Joined

  • Last visited

  • Days Won

    113

Posts posted by sonykongara

  1. రామాయపట్నం అనుబంధంగా జేఎస్‌డబ్ల్యూ ఉక్కు

    ABN , Publish Date - Jul 15 , 2025 | 03:39 AM

     

    నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టుకు అనుబంధంగా మరో భారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ప్రఖ్యాత జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ ఇక్కడ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయనుంది.

    AP Govt: రామాయపట్నం అనుబంధంగా జేఎస్‌డబ్ల్యూ ఉక్కు

     

    • స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు దిశగా అడుగులు

    • లింగసముద్రంలో ఐరన్‌ ఓర్‌ కేటాయింపునకు ఎన్‌వోసీ

    కందుకూరు, జూలై 14 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టుకు అనుబంధంగా మరో భారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ప్రఖ్యాత జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ ఇక్కడ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయనుంది. దీని కోసం రామాయపట్నం పరిసరాల్లో భూ కేటాయింపులు చేయాలని గత ప్రభుత్వంలోనే దరఖాస్తు చేసుకోగా..ప్రస్తుతం ఆ దిశగా చకచకా అడుగులు పడుతున్నాయి. ఉక్కు రంగంలో జేఎస్‌డబ్ల్యూకు మంచి పేరు ఉండడంతో ఈ పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన తోడ్పాటు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తంచేసి..అవసరమైన అనుమతుల మంజూరుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. పోర్టు సమీపంలో భూ కేటాయింపునకు అంగీకరించడంతోపాటు లింగసముద్రం, వలేటివారిపాలెం మండలాల్లో ఇనుప ఖనిజ నిక్షేపాలున్న కొండలు, ఇతర ప్రభుత్వ భూములు కూడా ఆ సంస్థకు కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు లింగసముద్రం మండలంలో ఐరన్‌ ఓర్‌ నిక్షేపాలున్న పలు గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూములు, కొండలను 726 ఎకరాల విస్తీర్ణం మేర జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌నకు మైనింగ్‌ కోసం అప్పగించేందుకు ఎన్‌వోసీ ఇస్తూ లింగసముద్రం తహసీల్దారు సీతామహాలక్ష్మి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. ఈ ఎన్‌వోసీ సమర్పించి ఐదు నెలలు గడవగా తాజాగా విషయం వెలుగులోకి వచ్చింది. ప్రకాశం,నెల్లూరు జిల్లాల సరిహద్దు మండలాల్లో 9.14 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఐరన్‌ ఓర్‌ నిక్షేపాలున్నట్లు జియోగ్రాఫికల్‌ సర్వే అధికారులు గతంలోనే నిర్ధారించారు.

     
    ABN ఛానల్ ఫాలో అవ్వండి
     

    ఈ క్రమంలో లింగసముద్రం మండలంలోని నాలుగు గ్రామాల్లో భూకేటాయింపులకు ఎన్‌వోసీ జారీచేశారు. మండల కేంద్రమైన లింగసముద్రంలో 19.78 ఎకరాలు, తిమ్మారెడ్డిపాలెంలో 150.76 ఎకరాలు, ఆర్‌ఆర్‌ పాలెంలో 21 ఎకరాలు, జంగంరెడ్డికండ్రికలో వివిధ సర్వే నంబర్లలో ఉన్న 423.33 ఎకరాల ప్రభుత్వ భూమితోపాటు, రైతులకు సంబంధించిన 111 ఎకరాల పట్టాభూములను, ఎర్రారెడ్డిపాలెంలో 3.46 ఎకరాలను జేఎ్‌సడబ్ల్యూ ఐరన్‌ఓర్‌ మైనింగ్‌కు అప్పగించేందుకు ఎన్‌వోసీ జారీచేశారు.

  2. అమరావతి అభివృద్ధికి కొత్త దిశగా చంద్రబాబు సింగపూర్ పర్యటన..

     
    • Published By:techteam
    • July 13, 2025 / 06:45 PM IST
    • Facebook
    • twitter
    • whatsapp
    Chandrababu Singapore Tour 2

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కి సింగపూర్ (Singapore) తో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనదిగా భావిస్తారు. గతంలోనూ ఆయన సింగపూర్ ను పలుమార్లు సందర్శించారు. ముఖ్యంగా 2014 ఎన్నికల అనంతరం రాష్ట్రానికి రాజధానిగా అమరావతి (Amaravati) ఎంపికైన తరువాత, దాన్ని సింగపూర్ తరహాలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందడుగు వేశారు. అప్పట్లో సింగపూర్ కి చెందిన అనేక కన్సల్టెన్సీలు అమరావతికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడంలో భాగస్వామ్యం అయ్యాయి.

    Telugu Times Custom Ads

    ఆ సమయంలో సింగపూర్ నుండి మంత్రి ఈశ్వరన్ (Iswaran) కూడా ఆంధ్రప్రదేశ్ కి పలు పర్యటనలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు బృందంతో సమావేశమయ్యారు. తద్వారా రెండు ప్రాంతాల మధ్య పరస్పర అవగాహన ఏర్పడింది. అప్పట్లో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరిగేందుకు సింగపూర్ నుండి పలు సాంకేతిక సూచనలు, వ్యూహాలు వచ్చాయని చెబుతారు. ఆ అనుభవంతోనే మరోసారి చంద్రబాబు సీఎం అయిన వెంటనే అమరావతి అభివృద్ధిపై దృష్టి సారించారు.

    ఇప్పుడు మరోసారి ఆయన సింగపూర్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. జూలై 26వ తేదీ నుండి ఐదు రోజుల పాటు పర్యటన జరుగనుంది. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు తో పాటు మంత్రులు లోకేష్ (Lokesh), నారాయణ (Narayana), పయ్యావుల కేశవ్ (Payyavula Keshav),  హాజరవుతారు. ఈ పర్యటనలో ప్రధానంగా పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపన వంటి అంశాలపై చర్చలు జరగనున్నట్లు సమాచారం. అలాగే అమరావతి నగర మాస్టర్ ప్లాన్, ఇతర అభివృద్ధి కార్యాచరణలపైనా సమీక్ష జరుగుతుందనే ఊహలు ఉన్నాయి.

    చంద్రబాబు ఈసారి రాజధాని అమరావతిని ఆంధ్రుల గర్వంగా మలచాలని నిశ్చయించుకున్నారు. గతంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను తిరిగి మొదలుపెట్టి, ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో అమరావతిని తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ప్రయాణంలో సింగపూర్ టూర్ మరో కీలకమైన ముందడుగు అవుతుంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టుబడులు ఆకర్షించడం, విశ్వాసాన్ని పెంచడం ఈ పర్యటన లక్ష్యం కానుంది.

     

  3. తీరం వెంబడి ప్రగతికి బాటలు..!

     

    Eenadu icon
    By Andhra Pradesh Dist. DeskUpdated : 14 Jul 2025 05:07 IST
    Ee
    Font size
     
     
     
     
    1 min read
     
     

    మూలపేట నుంచి విశాఖ వరకు సాగర నడవ
    4 వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణానికి సన్నాహాలు

    skl%20130725%206a.webp

    న్యూస్‌టుడే, టెక్కలి: తీరప్రాంత అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు(భావనపాడు) నుంచి విశాఖపట్నం వరకు 4 వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. సుమారు 150 నుంచి 200 కిలోమీటర్ల మేర తీరం వెంబడి మరో జాతీయ రహదారి రానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు చొరవతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి సూచికగా నిలిచే ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆమోదం తెలిపారు. ఆ మేరకు డీపీఆర్‌ తయారీ, భూసేకరణ ప్రక్రియ చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

    సిక్కోలు కొత్త శోభను సంతరించుకోనుంది. పోర్టు నిర్మాణంతో పాటు మూలపేట పారిశ్రామిక క్లస్టర్‌కు ఈ రహదారి మణిహారంగా మారనుంది. బారువ బీచ్‌ ఫెస్టివల్‌ జరిగిన తర్వాత తీరాన్ని గోవాకు దీటుగా మార్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీంతో పాటు గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి అందుబాటులోకి వస్తే ఇచ్ఛాపురం వరకు పర్యాటకాభివృద్ధికి అవకాశాలు మెరుగుపడతాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మూలపేట నుంచి భోగాపురం విమానాశ్రయం మీదుగా విశాఖపట్నం వరకు ఈ నడవ నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నారు. 

    పెరగనున్న ఉపాధి అవకాశాలు..

    నడవ నిర్మాణంతో ఉత్తరాంధ్రలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పరిశ్రమలు, పర్యాటక రంగాల అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. జిల్లాలోని మత్స్యకారులకు కొత్త అవకాశాలు రానున్నాయి. బుడగట్లపాలెంలో హార్బర్‌ నిర్మాణంతో పాటు మరో ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కార్గో ఎగుమతులతో ఆర్థిక పురోభివృద్ధి జరుగుతుందని, స్థిరాస్తి వ్యాపారం మరింత పుంజుకుంటుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

     
×
×
  • Create New...