Jump to content

Demonetization - BJP Failure


RKumar

Recommended Posts

వృద్ధికి నిరోధం... ఉపాధికి విఘాతం

ఫలితమివ్వని పెద్ద నోట్ల రద్దు

19opi1a.jpg

వినీతిని, నల్లధనాన్ని, నకిలీనోట్లను నిరోధించడంతోపాటు ఉగ్రవాదులకు నిధుల ప్రవాహాన్ని అడ్డుకోవడానికి పెద్దనోట్లను రద్దు చేస్తున్నామని 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినప్పుడు దేశభక్తి గల ప్రతి భారతీయుడూ స్వాగతించాడు. అయితే ఆచరణలో ఆశించిన లక్ష్యాలను సాధించడంలో ప్రభుత్వం విఫలమైంది. పది నెలల అధ్యయనం తరవాతే ఈ నిర్ణయం తీసుకున్నామని అదే ఏడాది నవంబరు 13న ప్రధాని గోవాలో ప్రకటించిన దృష్ట్యా, పెద్దనోట్ల రద్దు ఆచరణలో లోపాల వల్ల విఫలమైందని సరిపుచ్చుకునే వీలు లేదు. రద్దయిన నోట్ల స్థానంలో కొత్త నోట్లను ప్రవేశపెట్టడానికి ముందస్తు సన్నాహాలు చేసుకోవడంలోనూ సర్కారు విఫలమైంది. 130 కోట్లమంది ప్రజలు చేతిలో నగదు ఆడక నానా ఇబ్బందులు పడ్డారు. నగదు కొరత తలెత్తకుండా కావలసినన్ని రూ.2000, రూ. 500 నోట్లను ముందుగానే ముద్రించడానికి  10 నెలల వ్యవధి సరిపోదా? కొత్త రూ.2000 నోట్లను పాత రూ.1000 నోట్ల సైజులో, కొత్త రూ.500 నోట్లను పాత రూ.500 నోట్ల సైజులో ముద్రించి ఉంటే దేశవ్యాప్తంగా గల దాదాపు 2,20,000 ఏటీఎమ్‌ల నుంచి ఎలాంటి మార్పులు చేయకుండా నగదు పొందే సౌలభ్యం 19opi1b.jpgఉండేది. ఆ పని చేయకపోవడంతో ఏటీఎమ్‌లను కొత్త నోట్లకు అనువుగా మార్చడానికి చాలా సమయం పట్టింది. ఫలితంగా ప్రజలు ఇక్కట్ల పాలయ్యారు. దేశమంతటా ఉన్న 4075 ధనాగారాల్లో ఎక్కువ నోట్లను నిల్వచేసి ఉంటే కొత్త కరెన్సీ సులువుగా వేగంగా బ్యాంకులకు, ఏటీఎమ్‌లకూ చేరి ఉండేది. ఇలాంటి సరళమైన చర్యలూ తీసుకోలేకపోవడం నోట్ల రద్దు వ్యూహకర్తల వైఫల్యాన్ని ఎత్తిచూపింది.

తొందరపాటుతో తీవ్ర ఇబ్బందులు
నల్లధనంపై లక్షిత దాడి అనుకున్నది కాస్తా గురితప్పింది. వెనుకాముందూ ఆలోచించకుండా తొందరపాటుతో మార్పు తీసుకురావాలని చూస్తే కష్టనష్టాలు ఎదురవుతాయని చరిత్రలో అనేకసార్లు నిరూపితమైంది. ఇందిరాగాంధీ హయాములో ఎమర్జెన్సీ కాలంలో చేపట్టిన నిర్బంధ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను ఇక్కడ ఉదహరించాలి. 1975లో సుమారు 62 లక్షలమంది పురుషులకు బలవంతంగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహించగా వారిలో దాదాపు రెండు వేల మంది మరణించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఏ రాజకీయ, ఆర్థిక నిర్ణయమైనా ఆశించిన లక్ష్యాలను అందుకొన్నదా లేదా అన్నదే ముఖ్యం. పెద్ద నోట్ల రద్దు నల్లధనాన్ని, అవినీతిని అరికట్టడానికి ఉద్దేశించినదైనా అది నగదు రహిత డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకు ద్వారాలు తెరుస్తుంది. ఈ సంగతిని ముందుగా చెప్పకపోయినా, తరవాత- అంటే 2017 నవంబరు 27నాటి మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని వెల్లడించారు. దానికి ముందు ఒక ఈవ్యాలెట్‌ కంపెనీ పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలో మోదీ చిత్రం వేసి నగదు రహిత ఆర్థిక వ్యవస్థ గురించి హడావిడి చేశారు.

ఇంతకీ దేశం లోపల, వెలుపల ఉన్న నల్లధనమెంతో ప్రభుత్వానికీ ఇతమిత్థంగా తెలియదు. పెద్ద నోట్లు రద్దు చేయాలని 2016 నవంబరులో ప్రభుత్వం నిర్ణయించడానికి ముందు కానీ, తరవాత కానీ నల్లధన వాస్తవ పరిమాణం గురించి ప్రభుత్వం వద్ద సాధికార సమాచారమేదీ లేదని ఆర్థిక మంత్రి పార్లమెంటుకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో అంగీకరించారు. దాంతో పెద్ద నోట్ల రద్దు వల్ల ఎంత నల్లధనం బయటకు వచ్చిందో ఎవరూ చెప్పలేకపోయారు. ప్రపంచమంతటా ఆర్థిక లావాదేవీల్లో ఎక్కువ భాగం ఇప్పటికీ నగదు రూపంలోనే జరుగుతున్నాయి. నల్లధన వ్యవస్థకూ, చట్టబద్ధమైన నగదు వ్యవస్థకూ సంబంధమే ఉండదని అనుకోవడం తప్పు. అవి ఎన్నటికీ కలవని సమాంతర వ్యవస్థలు కావు. రెండు వ్యవస్థలూ పరస్పర ఆశ్రితాలు. నల్లధనం తెలుపులోకీ, చట్టబద్ధమైన తెల్లధనం నలుపులోకీ తరచుగా మారుతూనే ఉంటుంది. 2016 నవంబరు 8 నుంచి 31 డిసెంబరు వరకు ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్లకు పొంతన లేకపోవడం చూస్తే ఆర్థిక వ్యవస్థలో నగదు ప్రాముఖ్యం పట్ల అవగాహన కొరవడిందని స్పష్టమైంది. నల్లధన నిల్వదారులపై గురి ఎక్కుపెట్టాల్సింది పోయి యావత్‌ వ్యవస్థను ఇబ్బందులకు గురిచేయడం జరిగింది. చెలామణిలో ఉన్న నగదులో 99.35 శాతం బ్యాంకులకు తిరిగి చేరడం చూస్తే అక్రమార్జనపరులు తమ నల్లధనాన్ని గంగలో కలపడం కానీ, కాల్చివేయడం కానీ చేయలేదని, రకరకాల మార్గాల్లో నిక్షేపంగా తిరిగి బ్యాంకుల్లో జమ చేశారని తేలిపోయింది. రద్దు చేసిన నోట్ల స్థానంలో కొత్త నోట్లు ముద్రించడానికి 2016-18 మధ్య రిజర్వుబ్యాంకు సుమారు రూ.12,877 కోట్లు ఖర్చు చేసింది. ఇదంతా ఎంత దండగమారి వ్యవహారమో అర్థమవుతుంది.

పెద్దనోట్లను రద్దు చేసినంత మాత్రాన నల్లధన సమస్య తీరిపోతుందని ప్రధానమంత్రి భరోసా ఇవ్వడం వల్ల మొదట్లో ఈ నిర్ణయంపై సానుకూలత వ్యక్తమైంది. ప్రజలు సైతం ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు. అందుకే ఇబ్బంది అయినా గంటల తరబడి ఏటీఎమ్‌ల ముందు బారులు తీరారు. ఈ నిర్ణయం వల్ల దేశానికి మేలు జరుగుతుందని ఓపిక పట్టారు.

ఇప్పటికీ అత్యంత అవినీతిమయ దేశాల జాబితాలో భారతదేశం పేరు కొనసాగుతోందని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ 2018 ఫిబ్రవరిలో నివేదించింది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో లంచగొండితనం ఎక్కువగా ఉన్న దేశం ఇదేననీ, పత్రికా స్వేచ్ఛకూ ఇక్కడా భరోసా లేదని స్పష్టం చేసింది. పాత్రికేయులు, ప్రతిపక్ష నాయకులు, సామాజిక కార్యకర్తలు, చివరకు చట్టాన్ని అమలు చేసే సంస్థల సిబ్బందిపై సైతం దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో భారత్‌కు తోడుగా ఫిలిప్పైన్స్‌, మాల్దీవులు నిలుస్తున్నాయి. గడచిన ఆరేళ్లలో ఈ మూడు దేశాల్లో అవినీతిని బట్టబయలు చేసే పనిలో నిమగ్నమైన 15 మంది పాత్రికేయులు హత్యకు గురయ్యారు. భారత్‌లో ప్రతి పదిమందిలో ఏడుగురు ప్రభుత్వ కార్యాలయాల్లో పని జరగాలంటే సిబ్బందికి లంచం ఇవ్వకతప్పడం లేదు. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో 69 శాతం లంచం రేటుతో భారత్‌ అగ్రస్థానంలో ఉండగా, 65 శాతంతో వియత్నాం రెండోస్థానంలో ఉంది. పొరుగున ఉన్న పాకిస్థాన్‌లో లంచం రేటు కేవలం 40 శాతం మాత్రమే నమోదవడం విశేషం. 0.2 శాతం లంచం రేటుతో జపాన్‌ అవినీతి మచ్చలేని దేశంగా వెలిగిపోతోంది. ఎంత ఎక్కువ నగదు చెలామణిలో ఉంటే అంత ఎక్కువ అవినీతి ప్రబలుతుందని ప్రపంచవ్యాప్తంగా నిరూపణ అయినట్లు 2016-17 ఆర్థిక సర్వే వ్యాఖ్యానించింది. కానీ, వాస్తవం దీనికి భిన్నంగా ఉంది. 2015లో జపాన్‌లో కరెన్సీ- జీడీపీ నిష్పత్తి 18.61 శాతమైతే భారత్‌లో అంతకన్నా తక్కువగా 12.51 శాతం ఉంది. కానీ అదే సంవత్సరం అవినీతి సూచిలో జపాన్‌ 18వ స్థానంలో నిలవగా, భారత్‌ 76వ స్థానంలో ఉంది. అంటే, ఎక్కువ కరెన్సీ చెలామణిలో ఉన్న జపాన్‌లో అవినీతి తక్కువగా ఉంటే, తక్కువ కరెన్సీ చెలామణిలో ఉన్న భారత్‌లో ఎక్కువ అవినీతి జరుగుతోంది.

చిన్న వ్యాపారులకు చిక్కులు
పెద్దనోట్ల రద్దు ఆశించిన ప్రయోజనం అందించకపోగా అవినీతిని సులభతరం చేసిందనడం అతిశయోక్తి కాదు. కొత్త 2000 రూపాయల నోట్లే దీనికి నిదర్శనం. లంచగొండి అధికారులకు, అవినీతి పరులైన నాయకులకు ఇవి ఎంతో అనుకూలంగా మారాయి. పెద్దనోట్ల రద్దు మూలంగా దేశ ఆర్థిక వ్యవస్థలో నిధుల లభ్యత అకస్మాత్తుగా పడిపోయింది. ఫలితంగా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. చిన్న వ్యాపారులు అష్టకష్టాల పాలయ్యారు. పలు సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) మూతపడ్డాయి. ఎగుమతులు తగ్గాయి. ఆర్థిక వ్యవస్థ మందగించడంతో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు తగ్గిపోయింది. జీడీపీ వృద్ధి రేటు ఒక్క శాతం తగ్గితే దేశం రూ.2.31 లక్షల కోట్లు నష్టపోతుందని అంచనా. ముఖ్యంగా ఉపాధి కోల్పోవడం యువతకు పెను శాపమైంది. వ్యాపార సంస్థలు, నిర్మాణ కంపెనీలు, ఎగుమతి సంస్థలు, ఎంఎస్‌ఎంఈలలో ఉద్యోగ నష్టం 25 నుంచి 40 శాతం వరకు ఉంది. 2016 అక్టోబరు-డిసెంబరు మధ్య కాలంలో పారిశ్రామిక వస్తూత్పత్తి రంగంలో 1.13 లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయారని ఓ సర్వే తెలిపింది. ఈ పరిణామాలు ఆర్థిక వ్యవస్థపై నమ్మకాన్ని హరించి కొత్త పెట్టుబడులను తగ్గించేశాయి. ఫలితంగా నూతన ఉద్యోగాల సృష్టి పడిపోయింది. ఏతావతా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశానికి ఎలాంటి ప్రయోజనం అందించలేకపోయింది!

ఉగ్రవాద కార్యకలాపాల నివారణలో వైఫల్యం

19opi1c.jpg

మావోయిస్టులు, ఉగ్రవాదులు, మానవ అక్రమ రవాణాదారుల చేతుల్లో ఉన్న నల్లధనాన్ని నిర్వీర్యం చేయడంలో పెద్దనోట్ల రద్దు సఫలమైందని 2016 డిసెంబరు 27న దెహ్రాదూన్‌లో జరిగిన భాజపా ర్యాలీలో ప్రధాని సగర్వంగా చాటుకున్నారు. కానీ, వాస్తవం వేరు! గతంలో 500, 1000 రూపాయల నోట్లకు నకిలీలు చాలా ఎక్కువగా తయారయ్యేవి. నోట్ల రద్దు వల్ల బ్యాంకులకు తిరిగొచ్చే కరెన్సీలో 300-400 కోట్ల రూపాయల వరకు నకిలీ నోట్లు ఉంటాయని అంచనా వేశారు. కానీ, 2016-17లో బ్యాంకుల్లో కనిపెట్టిన నకిలీ నోట్ల విలువ రూ.43.47 కోట్లు మాత్రమే. పెద్దనోట్లను రద్దు చేసి మూడు నెలలు గడవక ముందే కొత్త 500 రూపాయలు, 2,000 రూపాయల నోట్లకు నకిలీలు తయారయ్యాయి. 2016 నవంబరు-2017 మార్చి మధ్య స్వాధీనం చేసుకున్న కొత్త నకిలీ నోట్ల విలువ రూ.19.53 కోట్లు. ఉగ్రవాదాన్ని, మావోయిస్టు కార్యకలాపాలనూ నిరోధించడానికి పెద్దనోట్ల రద్దు ఉపయోగపడిందా అని ప్రశ్నించుకుంటే అవునని చెప్పలేని పరిస్థితి. పెద్దనోట్ల రద్దు తరవాత జమ్మూకశ్మీర్‌లో, మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో హింసాయుత ఘటనలు 25 నుంచి 35 శాతం పెరిగాయి.
Link to comment
Share on other sites

14 minutes ago, RKumar said:

Don't know why they are still continuing with 2000/- note, supposed to be removed in 1 year.

No new notes printing.. bank head office ki vellinavi destroying..

Cash Black money 2000 lone vundhi

Ade circulate avuthundhi

Link to comment
Share on other sites

1 minute ago, NatuGadu said:

No new notes printing.. bank head office ki vellinavi destroying..

Cash Black money 2000 lone vundhi

Ade circulate avuthundhi

Election ayyenthavaraku bjp dabbu panchadaaniki vunchutunnara?

Link to comment
Share on other sites

1 hour ago, NatuGadu said:

Official gaa no ban... But circulation taggidshi gradual ga

BJP & YCP vaalle circulation tagginchedi, ee election lo 2000 note circulate ayinantha vere note kaaledu.

1 hour ago, kanagalakiran said:

2000 note came to market with great vision I. e 2019 election after that they will destroy 

Modi kosame 2000 Notes for Elections.

2000 Note tho paatu ee Modi kooda Permanent ban in few months.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...