Jump to content

Recommended Posts

7 minutes ago, ravindras said:

https://www.eenadu.net/ap/mainnews/2019/03/14/75630/

can somebody paste the above link in this thread

వజ్రాయుధం... చేజిక్కడమే గగనం

 

ఓటు హక్కు పొందేందుకు తప్పని ప్రయాస
ఈనాడు - అమరావతి

13AP-main13a.jpg

ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం లాంటి ఓటు హక్కును పొందటానికి ప్రజలు అనేక ప్రయాసలు పడాల్సి వస్తోంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుందామంటే... చిక్కుముళ్లు ఎదురవుతున్నాయి. అదృష్టవశాత్తూ సంబంధిత వెబ్‌సైట్‌ తెరచుకున్నా దరఖాస్తును నింపి, దాన్ని సమర్పించటం అంత సులభంగా లేదు. జాబితాలో పేరుందో లేదో చూసుకోవటానికి కూడా ఇబ్బందులు తప్పటం లేదు. దరఖాస్తులను నింపి నేరుగా అధికారుల చేతికి ఇద్దామన్నా పోలింగ్‌ బూత్‌లలో ఎవరూ అందుబాటులో ఉండని పరిస్థితి. తహసీల్దార్‌ కేంద్రాల్లో అందివ్వాలని చెబుతున్నప్పటికీ అక్కడ కూడా ప్రత్యేకంగా వీటి స్వీకరణకంటూ ఎవరూ ఉండట్లేదు. దరఖాస్తులకు గడువు ఈ నెల 15 వరకే ఉండడంతో ఓటర్ల జాబితాలో పేరులేని వారిలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కనీసం రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో బూత్‌స్థాయి అధికారులను అందుబాటులో ఉంచి, దరఖాస్తుల స్వీకరణ చేపట్టాలని, అక్కడ ఓటర్ల జాబితానూ అందుబాటులో ఉంచాలని డిమాండ్లు వస్తున్నాయి.

పేరుందో లేదో తెలుసుకోవటం ప్రహసనం
ఓటరు జాబితాలో పేరుందో లేదో తెలుసుకోవటం ప్రహసనంగా మారుతోంది. 1950 టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ నెంబరు ఎప్పుడూ బిజీ అనే సమాధానమే వస్తోంది. ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌ ద్వారా తెలుసుకుందామంటే ఓటరు కార్డు సంఖ్య నమోదు చేస్తేనే వివరాలు వస్తున్నాయి. ఓటరు పేరు, తండ్రి పేరు వంటి వివరాలు నమోదు చేసి తెలుసుకుందామంటే కచ్చితమైన సమాచారం రావట్లేదు. ఎన్నికల సంఘానికి సంబంధించిన సీఈవో ఆంధ్ర, నేషనల్‌ ఓటరు సర్వీసు పోర్టల్‌ వెబ్‌సైట్లలోకి వెళ్లి తెలుసుకుందామంటే ‘దిస్‌ సైట్‌ కెనాట్‌ బి రీచ్డ్‌’ అనే సమాధానం వస్తోంది. బూత్‌స్థాయి అధికారుల వద్దకు వెళ్లి ఓటరు జాబితాలో పేరుందో లేదో చూసుకుందామంటే.. వారు అందుబాటులో ఉండని పరిస్థితి. ఓటరు ఫోటో గుర్తింపు పత్రం సంఖ్య ఉంటేనే ‘మీ సేవ’ కేంద్రాల్లో దాని నకలు వస్తోంది. పేరు చెబితే జాబితాలో పేరుందా? లేదా అనేది తెలియటం లేదు.

పరిశీలన సమయం దృష్ట్యా పరిమిత గడువు
తమ ఓట్లు తొలగించేశారని, జాబితాలో పేర్లు లేవని రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వారంతా ఇప్పుడు మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిబంధనల ప్రకారం నామినేషన్ల చివరిరోజు వరకూ ఓటు నమోదు దరఖాస్తులకు అవకాశం కల్పించాలి. ఆ ప్రకారం ఈ నెల 25 వరకూ గడువుంది. దరఖాస్తుల క్షేత్ర పరిశీలనకు సమయం అవసరమంటూ ఈ నెల 15వ తేదీయే తుది గడువుగా పేర్కొన్నారు. దీన్ని మరింత పొడిగించాలని ప్రజల నుంచి విన్నపాలు వెల్లువెత్తుతున్నాయి.

బూత్‌స్థాయి అధికారులతో ప్రత్యేక డ్రైవ్‌లు ఏర్పాటు చేస్తేనే!
ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకునేందుకు, జాబితాలో పేరు చూసుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రతి పోలింగ్‌ కేంద్రంలోనూ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి, రాబోయే రెండుమూడు రోజులపాటు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆ పోలింగ్‌ కేంద్రం పరిధిలోని ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచటంతో పాటు, ఫారం-6 స్వీకరణకు వీలు కల్పించాలని కోరుతున్నారు. లేనిపక్షంలో పోలింగ్‌ నాటికి ఓట్ల వ్యవహారం పెద్ద సమస్యగా మారే అవకాశముంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...