Jump to content

Titli Cyclone | Coastal Districts Put On High Alert |


sonykongara

Recommended Posts

  • Replies 156
  • Created
  • Last Reply
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి లోకేష్ పర్యటన
13-10-2018 12:45:21
 
636750315232246796.jpg
శ్రీకాకుళం: తితలీ తుపాను ప్రభావిత ప్రాంతాలైన హరిపురం, ఉద్దానంలో మంత్రి నారా లోకేష్ శనివారం పర్యటించారు. బాధిత ప్రజలతో మాట్లాడిన మంత్రి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు.
Link to comment
Share on other sites

చలించిపోయిన సీఎం.. అండగా ఉంటానంటూ భరోసా
13-10-2018 11:57:05
 
636750287369091767.jpg
శ్రీకాకుళం: తుఫాన్‌ తెచ్చిన నష్టానికి అధైర్యపడొద్దని.. అండగా ఉంటానని బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఏరియల్‌ సర్వేద్వారా టెక్కలి, ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో తితలీ సృష్టించిన బీభత్సాన్ని సీఎం చూసి చలించిపోయారు. అనంతరం రోడ్డు మార్గంలో శుక్రవారం మధ్యాహ్నం పలాస చేరుకున్నారు. ముందుగా పలాస రైల్వే కాలనీ బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం పెట్రోల్‌బంకు సమీప ప్రాంతాలకు వెళ్లి బాధితుల గోడు ఆలకించారు. అక్కడి నుంచి తాళ్లభధ్ర రోడ్డు మీదుగా రాజాంకాలనీగ్రామంలో కొద్దిసేపు పర్యటించారు. తమకు తాగునీరు, ఆహారం అం దలేదని, విద్యుత్‌ సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందని గ్రామస్థులు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. సత్వరమే చర్యలు ప్రారంభమయ్యాయని సీఎం హామీ ఇచ్చారు.
 
అనంతరం గరుడభద్ర, బొడ్డపాడు జంక్షన్‌ల వద్ద కూడా బాఽధితులను పరామర్శించారు. భారీగా కూలిన కొబ్బరి, అరటి, జీడి తోటలను పరిశీలించారు. కరెంట్‌ లేక, తాగునీరు లేక ఇబ్బందులకు గురవుతున్నామంటూ ఓ మహిళ సీఎంకు రోదిస్తూ విన్నవించుకుంది. అక్కుపల్లి చేరుకుని అక్కడి బాధితులను ముఖ్యమంత్రి ఓదార్చారు. అందరికీ అండగా ఉంటానని, ఇక్కడ సమస్యలను చక్కదిద్దేంతవరకు తాను పలాసలోనే మకాం వేస్తానని చెప్పారు. అనం తరం పలాస మున్సిపల్‌ కౌన్సెల్‌హాల్‌లో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి తాను సేకరించిన ప్రజాభిప్రాయాన్ని వెల్లడించారు. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ కాలేదని 78 శాతం, తాగునీరు అందడంలేదని 60 శాతం, తుపాను రోజున భోజనం కూడా పెట్టలేదని 55 శాతం మంది ప్రజలు అభిప్రాయం వ్యక్తంచేశారని సీఎం వివరించారు.
 
విపత్తులు సంభవించినప్పుడే ప్రజలకు అధికారులు అండగా నిలబడాలని సూచించారు. ఇప్పటికీ ప్రజలకు సహకారం అందించనివారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే వంద మంది డిప్యుటీకలెక్టర్‌లు, ఐఏఎస్‌లను ప్రత్యేకంగా రప్పిస్తున్నారు. వీరితో పునరావాస పనులపై పర్యవేక్షణ చేయిస్తామన్నారు. అలాగే మూడురోజుల పాటు పలాసలోనే సీఎం మకాం వేసి అక్కడ పనులను చక్కదిద్దేంతవరకు సిద్ధపడ్డారు. హుద్‌హుద్‌ తుపానును గుండెధైర్యంతో ఎదుర్కొన్నామని, అలాగే ప్రజల ఆత్మవిశ్వాసంతో తితలీను కూడా ఎదుర్కొంటామని సీఎం భరోసా కల్పించారు. మంత్రుల బృందానికి పనుల పర్యవేక్షణ బాధ్యతను అప్పగించారు.
Link to comment
Share on other sites

నన్నెవరూ కలవొద్దు!
13-10-2018 02:48:45
 
  •  అందరూ క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేయండి
  •  మంత్రులంతా సిక్కోలుకు రావాలి
  •  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు
  •  తుఫాను సాయంపై సీఎం టెలీకాన్ఫరెన్స్‌
శ్రీకాకుళం/పలాస/వజ్రపుకొత్తూరు/అమరావతి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ‘‘నన్నెవరూ కలవద్దు. నా పర్యటనల్లో వెంట రావొద్దు. జిల్లా కేంద్రంలో ఎవరూ ఉండొద్దు. అందరూ క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేయండి. తుఫాను బాధితులకు అండగా నిలవండి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. గురువారం రాత్రి నుంచి శ్రీకాకుళంలోనే మకాం వేసిన ఆయన శుక్రవారం నిర్విరామంగా సహాయ చర్యలను సమీక్షించారు. టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అందుబాటులో మంత్రులంతా శ్రీకాకుళం జిల్లాకు వచ్చి తమతమ శాఖలకు సంబంధించిన సహాయ చర్యలను దగ్గరుండి పర్యవేక్షించాలని ఆదేశించారు. ఉత్తరాంధ్ర మంత్రులతోపాటు... దేవినేని ఉమా, లోకేశ్‌ తదితరులు శ్రీకాకుళం వెళ్లారు. విద్యుత్‌ వ్యవస్థ పునరుద్ధరణ జరిగే వరకు ఆయా ప్రాంతాల్లో పర్యటించాలని మంత్రి కళావెంకట్రావుకు సీఎం సూచించారు. స్థానిక ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఉండి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
 
‘‘సిక్కోలు ప్రజలకు తీవ్ర ఆపద వచ్చింది. సహాయ పునరావాస చర్యలపై అందరూ కదలండి. బాధితులకు సేవలందించడంలో పోటీపడండి. మీరు పేరు తెచ్చుకోవాలి. ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి’’ అని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. బాగా పనిచేసిన వారికి అవార్డులిస్తామని... నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రతి మండలం బాధ్యత ఒక సబ్‌ కలెక్టర్‌ చేపట్టాలన్నారు. పంట నష్టం, ఆస్తి నష్టంపై అంచనా రూపొందించాలన్నారు. ఇదొక అత్యవసర పరిస్థితి అని, అందుకు తగ్గట్టుగా శరవేగంగా పనులు చేయాలని స్పష్టంచేశారు.
Link to comment
Share on other sites

తితలీ ప్రాంతాలకు 60 మంది అధికారులు
13-10-2018 02:44:22
 
అమరావతి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తితలీ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు 60 మంది సీనియర్‌ అధికారులను ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించింది. వీరంతా వెంటనే శ్రీకాకుళం వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్రపునేఠా శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. వారిలో 40 మంది ఐఏఎ్‌సలు... 20 మంది డిప్యూటీ కలెక్టరు.
 
హుద్‌హుద్‌ తుఫాన్‌ను గుర్తు చేసుకొన్న చంద్రబాబు
నాలుగేళ్ల కింద ఇదే రోజు (అక్టోబరు 12) విశాఖను ఊపేసిన హుద్‌హుద్‌ తుఫాన్‌ను ముఖ్యమంత్రి ట్విటర్‌లో గుర్తు చేసుకున్నారు. ‘నాలుగేళ్ల కింద సరిగ్గా ఇదే రోజు.. హుద్‌హుద్‌ విశాఖను అతలాకుతలం చేసింది. కానీ ప్రజల పట్టుదల, అంకితభావంతో త్వరగానే అధిగమించగలిగాం. అదే స్ఫూర్తితో తితలీ తుఫాన్‌ నష్టాన్ని, విధ్వంసాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాం. హుద్‌హుద్‌ అనుభవంతో ఈసారి ప్రభావాన్ని ముందుగానే అంచనా వేయగలిగాం. ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగాం’ అని ట్వీట్‌ చేశారు.
Link to comment
Share on other sites

పలాసలో బైక్‌పై మంత్రి నారాయణ
13-10-2018 02:43:24
 
పురపాలక మంత్రి కె.నారాయణ శుక్రవారం పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో ద్విచక్ర వాహనంపై పర్యటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. బైక్‌పై వీధి వీధినా తిరుగుతూ తుఫాను నష్టం ఏ మేరకు ఉందో స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్‌ కమిషనర్‌ ఎన్‌.రమే్‌షనాయుడుతో నష్టంపై చర్చించారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. - పలాస
Link to comment
Share on other sites

తితలీ సహాయ చర్యలు ముమ్మరం
13-10-2018 02:42:59
 
  • అధికారులతో మంత్రి లోకేశ్‌ సమీక్ష
అమరావతి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): తితలీ తుఫానుతో దెబ్బతిన్న శ్రీకాకుళం జిల్లాలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని పంచాయతీరాజ్‌ మంత్రి లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన.. అక్కడ నుంచే అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మంత్రి ఆదేశాలతో విశాఖ నుంచి 12 పెద్ద జనరేటర్లు, విజయనగరం నుంచి మరో 4 జనరేటర్లు పంపించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం నుంచి 12 మంది డీఈఈలను డిప్యుటేషన్‌పై శ్రీకాకుళం పంపారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో మంచినీళ్ల ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. ప్రజలు కోలుకునే వరకు వారికి అవసరమైన అన్నీ విధాల సాయం అందించాలని మంత్రి ఆదేశించారు. ఢిల్లీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం అమరావతికి చేరుకున్న ఆయన వెంటనే శ్రీకాకుళం బయలుదేరి వెళ్లారు.
 
అమెరికా పర్యటనకు లోకేశ్‌
వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ ప్రెసిడెంట్‌ అంబాసిడర్‌ కెన్నెత్‌ ఆహ్వానం మేరకు లోకేశ్‌ అమెరికా వెళ్తున్నారు. ఈ నెల 15న పర్యటన మొదలై 21న తిరిగి వస్తారు. రైజ్‌ టు ఛాలెంజెస్‌ అనే అంశంపై జరిగే సదస్సు, వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Link to comment
Share on other sites

చింతపడ్డ సిక్కోలు!
13-10-2018 02:42:04
 
636749953260470007.jpg
  • ఇంకా కల్లోల సుడిలోనే..
  • తీవ్ర తుఫాను తగ్గగానే ముంచెత్తిన ఉగ్ర వరద
  • లక్షల ఎకరాల్లో పంట మునక
  • ‘తితలీ’ నష్టం.. అంచనా కష్టం
శ్రీకాకుళం, అమరావతి, విజయనగరం, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): తీవ్ర తుఫాను విడిచింది! ఉగ్ర వరద ముంచెత్తింది! మృత్యుగాలుల ఘోష పూర్తిగా సద్దుమణగకముందే, సరిగ్గా కాళ్లు కూడదీసుకోకముందే సిక్కోలును వరద బీభత్సం అమాంతం చుట్టుముట్టింది. ‘తితలీ’ తుఫాను ప్రభావంతో బుధవారం, గురువారం కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లి, శ్రీకాకుళానికి మరో కష్టం తెచ్చిపెట్టాయి. ఈ వరదంతా పొలాల్లోకి పోటెత్తి..లక్షలాది ఎకరాల్లో పంటలను ముంచెత్తాయి. పెనుగాలులకు పై కప్పులు ఎగిరిపోగా, ఆ మిగిలిన ఇంటి భాగంలోనే ప్రజలు తల దాచుకొంటున్నారు. మోకాలు లోతు నీళ్లలో వందల గ్రామాలు నిలబడిపోయాయి. ఈ ప్రాంతాలను శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ బృందం పర్యటించాయి. సహాయక చర్యలు చేపట్టే వీలు కూడా లేనంతగా గ్రామాలకు పోయే దారులు మూసుకుపోవడం కనిపించింది. దీంతో హైవేల పక్కనున్న ప్రాంతాల్లో వేగంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పలాస, ఇచ్ఛాపురం మండలాల్లో విద్యుత్‌ పునరుద్ధరణ చర్యలు వేగవంతంగా సాగుతున్నాయి.
 
Srikakula5.jpgజాతీయ రహదారులకు దూరంగా, సౌకర్యాలకు ఆమాద ఎడంలో ఉన్న మండలాలకు మాత్రం ప్రభుత్వ సాయం అందే పరిస్థితి కనిపించడం లేదు. వంశధార నది ఉగ్రరూపం దాల్చింది. 1980 తర్వాత 1.70 లక్షల క్యూసెక్కుల వరద ఉప్పొంగింది. గురువారం రాత్రి 11 గంటల వరకు అవుట్‌ఫ్లో 72వేల క్యుసెక్కులు ఉండగా, శుక్రవారం ఉదయం 10 గంటలకు 1.57లక్షల క్యుసెక్కులకు పెరిగింది. మధ్యాహ్నం ఒంటిగంటకు 1.71లక్షలకు, సాయంత్రం 6 గంటలకు 1.54లక్షలకు చేరింది. దీంతో తీరప్రాంత మండలాలు వణికిపోయాయి. ఆమదాలవలస, వంగర, జలుమూరు, ఎల్‌ఎన్‌పేట, సరుబుజ్జిలి, నరసన్నపేట తదితర మండలాల్లోని గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. మరోవైపు బహుదా నది సైతం మునుపెన్నడూ లేనంతగా ఉగ్రరూపం దాల్చింది. 1.50లక్షల క్యుసెక్కుల ప్రవాహం వచ్చి పడడంతో కవిటి, ఇచ్ఛాపురం మండలాల్లోని లక్షలాది ఎకరాల వరి పంట మునిగిపోయింది. ఇచ్చాపురం, కొజ్జరియా వద్ద వరద నీరు జాతీయరహదారిపై ప్రవహిస్తుండటంతో రాకపోకలను నిలిపివేశారు. వందలాది లారీలు నిలిచిపోయాయి.
 
4stled-4ss.jpgనాగావళి కూడా ఉగ్రరూపం దాల్చడంలో జిల్లా ఉక్కిరిబిక్కిరి అయింది. ప్రజలను అప్రమత్తం చేసుందుకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న తహసీల్దారు బి. వెంకట్రావు చిక్కుకుపోయారు. ఉద్దానానికి పచ్చని కోనసీమ అని పేరు. కోనసీమ తరువాత ఆ స్థాయిలో కొబ్బరి సాగు జరుగుతున్న ప్రాంతం ఇది. లక్షల ఎకరాల విస్తీర్ణంతో అందంగా అల్లుకొని వింత అనుభూతిని పంచే ఉద్దానంలో పెను గాలులకు 70శాతం చెట్లు కూలాయి.
 
పక్క ఊరులో పడ్డ పడవలు
సోంపేట మండలం బారువ తీరంలో మత్స్యకారులు నిలిపిన బోట్లు పెను గాలులకు ఎగిరి పక్క గ్రామంలోకి వెళ్లి పడ్డాయి. సోంపేట సమీపంలోనే తితలీ తీరం దాటింది. ఈ సమయంలో గంటకు 165 కిలోమీటర్ల వేగంతో వీచిన పెను గాలులకు బారువ తీరంలోని పర్యాటకశాఖ రిసార్ట్‌ నామరూపాలు లేకుండా పోయింది. ఈ తీరంలో లంగరు వేసిన 40 బోట్లను మత్స్యకారులు ఒడ్డుకు చేర్చగా, ప్రచండగాలులకు వేరే గ్రామానికి వెళ్లి ఎగిరిపడ్డాయి. బారువలో ఓ సెల్‌టవర్‌ కూలి పక్కనే ఉన్న ఇంటిపై పడింది.
 
ఉద్దానానికి మరో కష్టం..
కిడ్నీ సంబంధ వ్యాధులు పెద్దఎత్తున బయటపడటంతో వెలుగుచూసిన ప్రాంతం ఉద్దానం. ఇక్కడి భూగర్భాలు విషతుల్యం కావడంతో బావుల్లోంచి తెచ్చుకొన్న నీటిని నేరుగా తాగడం ఉద్దానవాసులకు ప్రాణాంతకమే. నీటిని శుద్ధి చేసుకొని తాగాల్సిన పరిస్థితి! ఈ ప్రాంతానికి మరో కష్టాన్ని తితలీ తుఫాను తెచ్చిపెట్టింది. తాగడానికి మంచినీరు లేక, దొరికిన నీరు తాగడానికి పనికిరాక గొంతులు ఎండిపోతున్నాయి. కరెంటు లేక భూగర్భజలాలను శుద్ధిచేసే ప్లాంట్లు మొరాయించాయి. మండల కేంద్రాల్లో కొంత వరకు ట్యాంకర్లతో మంచి నీటిని అందిస్తున్నా వందలాది గ్రామాలు దాహార్తితో అల్లాడిపోతున్నాయి.
 
చీకట్లోనే సిక్కోలు
ఒక గ్రామంలో పది విద్యుత్‌ స్తంభాలు ఉంటే, ఏడు స్తంభాలు నేలకూలడమో లేక ఎగిరి ఎటో పడిపోవడమో జరిగింది. ఉద్దానంతోపాటు టెక్కలి నియోజవర్గం పరిధిలోని ఐదు మండలాల్లోనూ ఇదే పరిస్థితి! వీటిని తిరిగి నిలబెట్టి, విరిగిపోయిన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడంతోపాటు వాటికి లైన్లు వేయాలంటే కనీసం 500 బృందాలు అవసరం.
ఆ మాత్రం సిబ్బంది ఉంటే మూడు రోజుల్లోనే శ్రీకాకుళంలో తిరిగి విద్యుత్‌వ్యవస్థను గాడిలో పెట్టవచ్చు. అయితే, రాష్ట్రంలో అందరిని ఒకేచోటకు చేర్చినా, 125 బృందాలకు మించలేదు. దీంతో సిక్కోలు చీకట్లు తొలగడానికి ఎంతలేదన్నా రెండు వారాలు పడుతుందని అంచనా వేస్తున్నారు. తితలీ తుఫాన్‌ బాధిత ప్రాంతాల్లో తూర్పు నౌకాదళం ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టింది. సుమారుగా 700 కిలోల ఆహార పదార్థాలు, దుస్తుల అందించడానికి రెండు సీ కింగ్‌ హెలికాప్టర్లు విశాఖ నుంచి వెళ్లాయి. వాటిలోనే డైవింగ్‌ బృందాలు, జెమినీ బోట్లను తీసుకువెళ్లారు. విజయనగరం జిల్లాలో 2424 హెక్టార్లలోని అరటి పంటకు తీవ్రనష్టం వాటిల్లింది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...