Jump to content

Mullapudi Renuka


sonykongara

Recommended Posts

టీడీపీ మహిళా నేతకు కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం
15-08-2018 12:06:22
 
636699315835689498.jpg
తణుకు, ప.గో.: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథార్టీ సంస్థకు డైరెక్టర్‌గా తణుకు పట్టణానికి చెందిన ముళ్లపూడి రేణుక ఎంపికయ్యారు. ఈ మేరకు ఆమె మంగళవారం సీఎం చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం నమ్మకంతో తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానన్నారు. రియల్‌ ఎస్టేట్‌లో వినియోగదారుడు మోసపోకుండా చూడటానికి పూర్తి సమాచారాన్ని పారదర్శకంగా అందించడానికి ఈ సంస్థ కృషి చేస్తోందన్నారు. ఇకపై 8ప్లాట్‌లకు పైబడి రియలెస్టేట్‌ అప్రోవల్‌ పొందాలంటే 500 స్కేర్‌ మీటర్లు బిల్డింగ్‌ ప్లింటేరియా పైబడి భవనాన్ని నిర్మించి అమ్మాలన్నా రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరి అథార్టీ (రేరా) పరిధిలో నమోదు చేయించుకోవాలన్నారు. ఇకపై ఎల్‌పీ ఉండదని రేరా పరిధిలోనే రియల్‌ ఎస్టేట్‌ రంగం ఉంటుందన్నారు. ఈ రేరా డైరెక్టర్‌ పదవికి ప్రిన్సిపాల్‌ సెక్రటరీ హోదా లభిస్తుందని ఆమె తెలిపారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...