Jump to content

Krish to direct NTR Biopic


sonykongara

Recommended Posts

  • Replies 91
  • Created
  • Last Reply
ఎన్టీఆర్‌-ఏయన్నార్‌లను ఒకేచోట చూశారా?
ఆకట్టుకుంటున్న ‘యన్‌.టి.ఆర్‌’ సరికొత్త పోస్టర్‌

044654BRK119-NTRBIOPIC1.JPG

హైదరాబాద్‌: వెండితెరపై వారిద్దరూ లెజండరీ నటులు. ఒకరు పౌరాణిక, జానపద చిత్రాల్లో ఉద్ధండులైతే, మరొకరు సాంఘిక చిత్రాల్లో నటించి ఆయా పాత్రలకు ప్రాణం పోశారు. వారే నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు. నటన విషయంలో ఎవరి శైలి వారికి ఉంది. ఒకరితో ఒకరికి ఎప్పుడూ పోటీనే. కానీ, అది సినిమాల వరకే పరిమితం. అందుకే వారి స్నేహం చిరకాలం కొనసాగింది. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ల స్నేహబంధం ఎలాంటిదో ‘యన్‌.టి.ఆర్‌’ చిత్రం ద్వారా చూపే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు క్రిష్‌.

తెలుగువారి అభిమాన నటుడు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యన్‌.టి.ఆర్‌’. బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నఈ చిత్రం శరవేగంగా షూటింగ్‌ జరుపుకొంటోంది. ఈ నేపథ్యంలో ‘యన్‌.టి.ఆర్‌’పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగినట్లుగానే చిత్ర బృందం పాత్రలను పరిచయం చేస్తూ సర్‌ప్రైజ్‌లను ఇస్తోంది.

‘యన్‌.టి.ఆర్‌’లో అక్కినేని నాగేశ్వరరావు పాత్రను పోషిస్తున్న సుమంత్‌ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా మరో ఆసక్తికర పోస్టర్‌ను పంచుకుంది. ఎన్టీఆర్‌ నోటిలో పెట్టుకున్న సిగరెట్‌ను ఏయన్నార్‌ వెలిగిస్తున్న పోస్టర్‌ అభిమానులను విశేషంగా అలరిస్తోంది. ‘సోదరత్వం పునః సృష్టి జరుగుతోంది’ అని సుమంత్‌ తాజా పోస్టర్‌ను పంచుకున్నారు. ఎన్టీఆర్‌ పాత్రలో నటిస్తున్న బాలకృష్ణ పెద్ద కాలర్‌ ఉన్న చొక్కాను వేసుకుని సిగరెట్‌ను నోట్లో పెట్టుకోగా.. లాల్చీ, కళ్లజోడు ధరించి అక్కినేని పాత్ర పోషిస్తున్న సుమంత్‌ తాను కూడా ఓ సిగరెట్‌ను నోటిలో పెట్టుకుని ఎన్టీఆర్‌ సిగరెట్‌ను వెలిగిస్తూ కనిపించారు. ఇప్పటికే ఈ చిత్రంలో నటిస్తున్న వివిధ పాత్రలకు సంబంధించిన పోస్టర్‌లు అభిమానులను అలరిస్తుండగా, చిత్ర బృందం ఇంకెన్ని సర్‌ప్రైజ్‌లు ఇస్తుందో చూడాలి.

brk119-NTRBiopic2.JPG

ఎన్‌బీకే ఫిల్స్మ్‌, వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా పతాకంపై సాయి కొర్రపాటి, విష్ణు వర్థన్‌ ఇందూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.

 
 
 
 

రాజకీయం

Link to comment
Share on other sites

ఏఎన్ఆర్ పోస్టర్ చూసి కన్ఫ్యూజ్ అయ్యా: వెంకటేష్ Updated : 20-Sep-2018 : 20:57
 
 
636730738247242406.jpg
తాజాగా ‘యన్‌టీఆర్’ బయోపిక్‌‌ నుంచి విడుదలైన ఏఎన్ఆర్ స్టిల్ చూసి కన్ఫ్యూజ్ అయ్యాడట విక్టరీ వెంకటేష్. తన తాత ఏఎన్‌ఆర్ పాత్రలో సుమంత్ పరకాయ ప్రవేశం చేసినట్లు కనిపించారు. ఇదే విక్టరీ వెంకటేష్ కన్ఫ్యూజ్కి కారణమైంది. ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా ట్వీట్ చేశాడు వెంకటేష్. ‘‘ఒక్క క్షణం పాటు నేను కన్ఫ్యూజ్ అయ్యా. అతను సుమంతా? లేక నాగేశ్వర్ రావా? అనేది అర్థం కాలేదు. లెజెండ్, గొప్ప వ్యక్తి ఏఎన్‌ఆర్ మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు’’ అని పేర్కొన్నాడు.
 
 
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నిర్మాణ సారధ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘యన్‌టీఆర్’ బయోపిక్‌‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. వారి అంచనాలను రెట్టింపు చేసేలా రోజుకో సర్‌ప్రైజ్ బయటకు వదులుతూ సినిమాపై మరింత హైప్ తీసుకొస్తోంది చిత్రయూనిట్. తాజాగా విడుదలైన ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్.. పిక్ అయితే నెటిజన్లలో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ వైరల్‌గా మారింది.
Link to comment
Share on other sites

ఎన్టీఆర్ కూతురు ఫిక్స్! Updated : 22-Sep-2018 : 15:19
 
 
636732263429563695.jpg
నందమూరి బాలకృష్ణ నిర్మాతగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఎన్టీఆర్. ఈ సినిమాకు సంబంధించి కొన్ని పాత్రలు ఇప్పటికే రివీల్ అయినప్పటికీ మరికొన్ని పాత్రలపై స్పష్టత రావాల్సి ఉంది. ఎన్టీఆర్‌గా బాలకృష్ణే నటిస్తున్న ఈ సినిమాలో ఆయన భార్య బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తున్నారు. చంద్రబాబుగా రానా, ఏఎన్నార్‌గా సుమంత్ తదితరులు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడొక కొత్త పాత్ర ఫిక్స్ అయినట్టు వార్తలు వినవస్తున్నాయి.
 
ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి పాత్రలో నటించనున్నది ఈమేనంటూ సోషల్ మీడియాలో ఓ పిక్ వైరల్ అవుతోంది. ఈ పిక్‌లో పురందేశ్వరితోపాటు విజయవాడకు చెందిన ప్రముఖ నృత్య కారణి హిమన్సీ కనిపిస్తున్నారు. ఈ పిక్ చూసిన నెటిజన్లు ఈ పాత్రకు హిమన్సీ సరిగ్గా సరిపోతారని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలిపేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
Link to comment
Share on other sites

On 9/20/2018 at 2:26 PM, sonykongara said:
ఏఎన్ఆర్ పోస్టర్ చూసి కన్ఫ్యూజ్ అయ్యా: వెంకటేష్ Updated : 20-Sep-2018 : 20:57
 
 
636730738247242406.jpg
తాజాగా ‘యన్‌టీఆర్’ బయోపిక్‌‌ నుంచి విడుదలైన ఏఎన్ఆర్ స్టిల్ చూసి కన్ఫ్యూజ్ అయ్యాడట విక్టరీ వెంకటేష్. తన తాత ఏఎన్‌ఆర్ పాత్రలో సుమంత్ పరకాయ ప్రవేశం చేసినట్లు కనిపించారు. ఇదే విక్టరీ వెంకటేష్ కన్ఫ్యూజ్కి కారణమైంది. ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా ట్వీట్ చేశాడు వెంకటేష్. ‘‘ఒక్క క్షణం పాటు నేను కన్ఫ్యూజ్ అయ్యా. అతను సుమంతా? లేక నాగేశ్వర్ రావా? అనేది అర్థం కాలేదు. లెజెండ్, గొప్ప వ్యక్తి ఏఎన్‌ఆర్ మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు’’ అని పేర్కొన్నాడు.
 
 
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నిర్మాణ సారధ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘యన్‌టీఆర్’ బయోపిక్‌‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. వారి అంచనాలను రెట్టింపు చేసేలా రోజుకో సర్‌ప్రైజ్ బయటకు వదులుతూ సినిమాపై మరింత హైప్ తీసుకొస్తోంది చిత్రయూనిట్. తాజాగా విడుదలైన ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్.. పిక్ అయితే నెటిజన్లలో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ వైరల్‌గా మారింది.

Its not just Venki ... 

Some of these pictures are phenomenal ... 

I corrected myself in one case ... really thought I was looking at NTR and CBN ... 

Remarkable ... 

Link to comment
Share on other sites

‘ఎన్టీఆర్‌’లో సావిత్రి 
22tollywood-7a.jpg

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్‌ పాత్రలో నటిస్తున్నారు. క్రిష్‌ దర్శకుడు.    బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణువర్ధన్‌ ఇందూరి కలిసి  నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ  జరుగుతోంది. ఎన్టీఆర్‌ జీవితం సినీ రంగంతో పాటు రాజకీయాలతో ముడిపడి ఉంది. అందుకే ఎన్టీఆర్‌తో కలిసి నటించిన కథానాయికల పాత్రలు కూడా ఈ   చిత్రంలో కీలకం. పలు చిత్రాల్లో కలిసి నటించిన ఎన్టీఆర్‌, సావిత్రిల నేపథ్యంలో కీలక సన్నివేశాల్ని రూపొందిస్తున్నట్టు సమాచారం. సావిత్రిగా నిత్యా మేనన్‌ నటిస్తోంది. మొదట ఆ పాత్రని ‘మహానటి’లో సావిత్రిగా నటించి మెప్పించిన కీర్తి సురేష్‌ చేస్తుందని ప్రచారం సాగింది. కానీ తాజాగా నిత్యా మేనన్‌ని ఎంపిక చేసుకొన్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
ఎన్టీఆర్ బయోపిక్.. రేపట్నించి కీలక సన్నివేశాల చిత్రీకరణ
02-10-2018 16:59:33
 
636740963727159152.jpg
 
కృష్ణాజిల్లా: ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలు రేపటి (బుధవారం) నుంచి కృష్ణాజిల్లాలో చిత్రీకరించనున్నారు. వివిధ ప్రాంతాల్లో వారం రోజులపాటు షూటింగ్ జరగనుంది. ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు హంసలదీవి ప్రాంతానికి చేరుకుని విలేజ్ సెట్‌ను నిర్మాణం చేస్తున్నారు. దివిసీమకు తుఫాన్ వచ్చిన సమయంలో ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు ఏ విధంగా ఆ ప్రాంతంలో పర్యటించింది, విరాళాలు సేకరించిన వైనాన్ని ఇక్కడ చిత్రీకరించనున్నట్లు సమాచారం.
 
దివిసీమ తుపాన్ సీన్ తర్వాత నిమ్మకూరులో ఎన్టీఆర్ బాల్యానికి సంబంధించిన సన్నివేశాలు, ఆ ఊరితో ఎన్టీఆర్‌కు ఉన్న అనుబంధాన్ని తెలిపే సన్నివేశాలు కూడా చిత్రీకరించనున్నట్లు సమాచారం. రేపటి నుంచి సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సినీనటులు బాలకృష్ణ, సుమంత్, విద్యాబాలన్, రానా సినిమా చిత్రీకరణలో పాల్గొంటారని యూనిట్ సభ్యులు తెలిపారు. వారం రోజుల పాటు షూటింగ్ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
ఎన్టీఆర్ బయోపిక్‌లో భారీ సంఖ్యలో స్టార్ నటీనటులు నటిస్తున్నారు. తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ, బసవతారకం పాత్రలో విద్యాబాలన్ కనిపిస్తారు. ఎఎన్నార్‌గా సుమంత్, చంద్రబాబుగా రానా, శ్రీదేవిగా రకుల్ ఫ్రీత్ సింగ్, జయప్రదగా రాశీఖన్నా తదితరులు నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న ఎన్టీఆర్ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 1983లో సరిగ్గా అదే రోజున ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అందుకే ఆరోజు సినిమాలను విడుదల చేయాలని నిర్ణయించారు. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
Link to comment
Share on other sites

 వివేక్.. and 5 others liked

ప్రతి కథకీ ఓ నాయకుడుంటాడు.. కానీ కథగా మారే నాయకుడొక్కడే వుంటాడు.. జనవరి 9 న #NTRకథానాయకుడు #NTRKathanayakuduOnJan9

Doos9JuU8AAl-pD.jpg
14 replies201 retweets408 likes
Reply
 14
 
Retweeted
 201
 
 
Liked
 408
 
Direct message
Link to comment
Share on other sites

యన్‌టిఆర్‌’ పార్ట్‌ 1: కథానాయకుడు

రెండు భాగాలుగా రాబోతున్న బయోపిక్‌

1037434BRK-NTR.JPG

హైదరాబాద్‌: విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్‌ జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యన్‌టిఆర్’. క్రిష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. కాగా.. ఆయన బయోపిక్‌ను రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారట. ఈ విషయాన్ని క్రిష్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటిస్తూ తొలి భాగం టైటిల్‌ పోస్టర్‌ను పంచుకున్నారు.

తొలి భాగం సినిమాను ‘యన్‌టిఆర్‌ కథానాయకుడు’ టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. ‘ప్రతి కథకీ ఓ నాయకుడుంటాడు. కానీ కథగా మారే నాయకుడొక్కడే ఉంటాడు’ అని వెల్లడిస్తూ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. తొలి భాగాన్ని వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రెండో భాగానికి ‘యన్‌టిఆర్‌ రాజకీయనాయకుడు’ అనే టైటిల్‌తో విడుదల చేస్తారని తెలుస్తోంది. తొలి భాగం విడుదలైన కొన్ని రోజుల వ్యవధిలోనే రెండో భాగాన్ని కూడా విడుదల చేస్తారట. విద్యాబాలన్‌, రానా, సుమంత్‌ కీలక పాత్రలు పోషిసున్నారు. సావిత్రి పాత్రలో నిత్యమేనన్‌ నటిస్తున్నారు. ప్రస్తుతం కృష్ణాజిల్లా దివిసీమలో చిత్రీకరణ జరుగుతోంది. హంసలదీవి సమీపంలో సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. బుధవారం మొదలైన చిత్రీకరణ శనివారం వరకూ హంసలదీవిలోనే జరగనుంది. ఎన్‌బికే ఫిలింస్‌ బ్యానర్‌పై బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Link to comment
Share on other sites

సాగర సంగమం వద్ద ఎన్టీఆర్‌ బయోపిక్‌ కోసం సెట్టింగ్స్‌ Updated : 04-Oct-2018 : 11:44
 
 
636742502477904053.jpg
పాలకాయితిప్ప, కృష్ణా: 1977 నవంబర్‌ 19.. దివిసీమకు అది కాళరాత్రి.. కడలి కెరటాలు ఉప్పెనలా వచ్చి, ఊళ్లను ముంచేసిన విషాద ఘటన. పెద్దా, చిన్నా, ధనికా, పేద, కులమూ, మతమూ ఏ తారతమ్యమూ లేదు ఆ కెరటాలకు. ఆ ఉప్పెన ఉధృతికి ఊళ్లకు ఊళ్లే తుడిచిపెట్టుకుపోయాయి. వరదను తట్టుకుని ఏ చిటారు కొమ్మనో, రాతి గుట్టనో పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్న కొందరు మినహా, మొత్తం మనుషులు, మూగ జీవాలు శవాలగుట్టలై గుండెలను కదిపేసిన విషాదమది. దివిసీమను అల్లకల్లోలం చేసిన ఆ ఉప్పెన సద్దుమణిగాక అంతా శోక సముద్రమే.
 
భారీగా జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంతో అల్లకల్లోలంగా మారిన ఆ ప్రాంతాన్ని, నాటి సన్నివేశాలను మళ్లీ కళ్లముందుంచుతున్నారు ఎన్టీఆర్‌ బయోపిక్‌ తీస్తున్న దర్శకుడు క్రిష్‌. హంసలదీవి సమీపంలోని సాగర సంగమం వద్ద సముద్ర తీరంలో ఈ బయోపిక్‌ షూటింగ్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. బుధవారం నుంచి చిత్ర సిబ్బంది కొన్ని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తోంది. అందుకు అవసరమైన సెట్టింగ్‌లను వేశారు. ఈ సెట్టింగ్‌లో ఎన్టీఆర్‌, అక్కినేని నాగేశ్వరరావులు మండలి వెంకటకృష్ణారావుతో కలిసి దివిసీమ ప్రజలను ఓదార్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్‌గా నందమూరి బాలకృష్ణ, నాగేశ్వరరావుగా సుమంత్‌, మండలి వెంకటకృష్ణారావుగా ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ నటించనున్నారు.
 
 
సెట్టింగ్‌లు వేసిన ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవనిగడ్డ డీఎస్పీ వి.పోతురాజు పర్యవేక్షణలో అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు ఎస్సైలు మణికుమార్‌, రాజారెడ్డి, ప్రియకుమార్‌, పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశారు. షూటింగ్‌ జరిగే ప్రాంతానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున పాలకాయితిప్ప మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ సీఐ కె.మురళీకృష్ణ ఆధ్వర్యంలో సాగరసంగమం, సముద్రతీరం వద్ద బుధవారం కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. సముద్రతీరం, సాగరసంగమ ప్రదేశాల్లో ఎవరూ లోతైన ప్రదేశాల్లో స్నానాలు ఆచరించరాదని మైక్‌ ద్వారా ప్రచారం చేయించారు.
Link to comment
Share on other sites

ఎన్టీఆర్ బయోపిక్‌లో డిప్యూటీ స్పీకర్‌ Updated : 04-Oct-2018 : 12:22
 
 
636742525407228916.jpg
ఎన్టీఆర్‌ బయోపిక్‌లో... దివిసీమ గాంధీ, మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు పాత్రలో డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దివిసీమ ఉప్పెన అంటే ప్రధానంగా గుర్తుకువచ్చేది మండలి వెంకట కృష్ణారావు చేసిన సేవా కార్యక్రమాలే. మంత్రి పదవికి రాజీనామా చేసి ఆయన ప్రజలకు సేవలందించారు.
 
బుధవారం చిత్రషూటింగ్‌ సందర్భంగా ఈ మేరకు బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌, మండలి నడుమ ఆసక్తికర సంభాషణ సాగింది. ‘మా తండ్రి పాత్రను పోషించే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. మీ తండ్రిగారి పాత్రలో మీరు నటిస్తే బావుంటుంది.’ అని బాలకృష్ణ అన్నారు. దర్శకుడు క్రిష్‌ కూడా బుద్ధప్రసాద్‌ను వెంకటకృష్ణారావు పాత్రలో నటించాల్సిందిగా కోరగా, పక్కనే ఉన్న ఎంపీ కొనకళ్ల నారాయణరావు తప్పకుండా బుద్ధప్రసాద్‌ తండ్రి పాత్ర ధరిస్తారని భరోసా ఇచ్చారు. ఈ సంభాషణ జరుగుతున్నంతసేపూ బుద్ధప్రసాద్‌ నవ్వుతూనే ఉన్నారు.
Link to comment
Share on other sites

కాళ్లు మొక్కిన నిరుపేదకు.. సాయమందించిన బాలయ్య Updated : 05-Oct-2018 : 12:43
 
 
636743406052472553.jpg
నందమూరి బాలకృష్ణ షూటింగ్‌లో ఉండగా ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఓ నిరుపేద వ్యక్తి సడెన్‌గా వచ్చి ఆయన కాళ్లపై పడిపోయాడు. విషయం తెలుసుకున్న బాలయ్య చలించిపోయారట. ప్రస్తుతం బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్‌ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ కృష్ణా జిల్లా హంసల దీవి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.
 
ఈ చిత్ర షూటింగ్‌లో బాలయ్య ఉండగా.. ఓ వ్యక్తి వచ్చి బాలయ్య కాళ్లపై పడిపోయాడు. వెంటనే బాలయ్య అతన్ని పైకి లేపి విషయం అడగ్గా.. తాను నిరుపేదనని, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నానని.. తనకు సాయమందించాలని కోరాడని తెలుస్తోంది విషయం విని చలించిపోయిన బాలయ్య వెంటనే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు ఫోన్ చేసి అతని వివరాలను తెలియజేసి.. ఉచిత వైద్యం అందించాలని ఆదేశించారట. దీంతో ఆ వ్యక్తి చాలా సంతోషించాడట. ఆ వ్యక్తి బాలయ్య కాళ్లకు మొక్కుతున్న పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పిక్స్, కథనం షూటింగ్‌కి సంబంధించిందా? లేదంటే నిజంగానే జరిగిందా? తెలియాల్సి ఉంది.
Link to comment
Share on other sites

సముద్రపు శింకులో నాటుపడవలపై ఎన్టీఆర్‌ బయోపిక్‌ చిత్రీకరణ Updated : 05-Oct-2018 : 14:31
 
 
636743468502598985.jpg
పాలకాయితిప్ప గ్రామ సమీపంలోని డాల్ఫిన్‌ భవనం వద్ద, సముద్రపు శింకు వద్ద ఎన్టీఆర్‌ బయోపిక్‌ షూటింగ్‌ రెండవ రోజు గురువారం నిర్వహించారు. హీరోగా నటిస్తున్న నందమూరి బాలకృష్ణపై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. ఎన్టీరామారావును తలపించేలా బాలకృష్ణ వేషధారణ చూపరులను ఎంతగానో ఆకర్షించింది. సముద్రపు శింకులోని నాటుపడవలపై షూటింగ్‌ జరిగింది. హంసలదీవి గ్రామ సమీపంలోని రొయ్యల చెరువుల వద్ద చిత్రయూనిట్‌ షూటింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేశారు. 1977 నవంబర్‌ 19న సంభవించిన పెను తుఫానులో ప్రాణ, ఆస్తినష్టం, అప్పుడు జరిగిన సన్నివేశాలను ఎన్టీఆర్‌ బయోపిక్‌లో చూపించనున్నారు.
 
 
సినిమాకు ఎన్టీఆర్‌ కథానాయకుడు అనే పేరు కూడా పెట్టినట్టు సమాచారం. దర్శకుడు జాగర్లమూడి క్రిష్‌, హీరో నందమూరి బాలకృష్ణ, ఆర్ట్స్‌ డైరెక్టర్‌ సాయి సాహిత్‌, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, ఎం.ఆర్‌.వి. ప్రసాద్‌ షూటింగ్‌లో పాల్గొన్నారు. శుక్రవారం సాగరసంగమం వద్ద జరిగే షూటింగ్‌లో ఉపసభాపతి బుద్ధప్రసాద్‌ సైతం పాల్గొంటారని సమాచారం. ఈ షూటింగ్‌ తిలకించటానికి దూర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో బాలకృష్ణ అభిమానులు, ప్రేక్షకులు తరలివచ్చారు. ఏ ఇబ్బందులు కలగకుండా డీఎస్పీ వి.పోతురాజు, సీఐ మూర్తి పర్యవేక్షణలో నాగాయలంక, కోడూరు ఎస్సైలు రాజారెడ్డి, ప్రియకుమార్‌, మెరైన్‌ సీఐ మురళీ కృష్ణ ఆధ్వర్యంలో 28 మంది మెరైన్‌ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Link to comment
Share on other sites

రేపల్లెలో సందడి చేస్తున్న ‘ఎన్టీఆర్’ Updated : 07-Oct-2018 : 10:43
 
 
636745058882921644.jpg
ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఎన్టీఆర్‌ చిత్రంలోని సన్నివేశాలను రేపల్లె పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు. శనివారం రేపల్లె పట్టణంలో దివిసీమ ఉప్పెనకు సంబంధించిన బాధితుల సహాయార్థం భిక్షాటన సన్నివేశాలను చిత్రీకరిం చారు. షూటింగ్‌ను తిలకించేందకు బాలకృష్ణ అభిమానులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ, ఏఎన్‌ఆర్‌గా సుమంత్‌పై కొన్ని సన్నివేశాలను రేపల్లె రైల్వేస్టేషన్‌, పద్మావతి థియేటర్‌ రోడ్డు, బ్రిటీషు కాలంలో కట్టిన కోర్టు, తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో దర్శకుడు క్రిష్‌ చిత్రీకరించారు.
 
ఈ సందర్భంగా డైరెక్టర్‌ క్రిష్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ బయోపిక్‌ చిత్రాన్ని తీయటం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. మూడు రోజులపాటు కృష్ణాజిల్లా హంసలదీవి సముద్రం ఒడ్డున, కోడూరు తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేశామన్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ నట సార్వభౌముడు, అన్న నందమూరి తారక రామారావు బాలకృష్ణ చేస్తున్న పాత్ర ఎన్టీఆర్‌ను తలపించే విధంగా ఉందని, బయోపిక్‌ సినిమాకు మంచి ఆదరణ వచ్చే విధంగా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారన్నారు. తెలుగువాడి కీర్తిని నలుదిశలా చాటిచెప్పిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని, అలాంటి వ్యక్తి బయోపిక్‌ తీయటం భవిష్యత్తు తరాలకు, నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అప్పట్లో మండలి కృష్ణారావు దివిసీమ ఉప్పెనలో చేసిన సహాయ సహకార కార్యక్రమాలను డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న మండలి బుద్ధ ప్రసాద్‌ తన తండ్రి పాత్రలో నటిస్తూ తనదైన శైలిలో నటనా చాతుర్యాన్ని ప్రదర్శించటం అభినందనీయమన్నారు.
 
ఈ సందర్భంగా మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘నా తండ్రి పాత్ర చేయటం గర్వంగా ఉంది.. మహానటులు ఎన్టీరామారావు, ఏఎన్‌ఆర్‌లు దివిసీమలోని ఉప్పెన వచ్చిన ప్రాంతాన్ని సందర్శించి చలించిపోయారు. నిరాశ్రయులైన ప్రజలకు తనవంతుగా సాయం అందించాలనే ఉద్ధేశంతో మా నాన్నగారైన మండలి కృష్ణారావుతో సంప్రదింపులు జరిపి భిక్షాటన చేసి రూ.13 లక్షల ఆర్థిక సహాయాన్ని దివిసీమ ప్రజలకు అందించారు. ఆ సమయంలో కృష్ణారావు, వారికి చేదోడువాదోడుగా ఉన్న సన్నివేశాలను ఈ రోజు కళ్ళకు కట్టేవిధంగా... తండ్రి పాత్రలో నేను చేయటం పూర్వజన్మ సుకృతం’’ అని పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

శ్రీదేవి పాత్రలో ఎలా ఉంటానో..!
6tollywood-5a.jpg

‘ఎన్టీఆర్‌’లో నేను శ్రీదేవిగా ఎలా ఉంటానో అని చాలా కుతూహలంగా ఉందంటోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. నందమూరి తారకరామారావు జీవిత కథతో తెరకెక్కుతోన్న చిత్రం  ‘ఎన్టీఆర్‌’. దీన్ని రెండు భాగాలుగా  ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’ పేరుతో విడుదల చేయనున్నారు. ‘ఎన్టీఆర్‌’లో అతిలోక సుందరి శ్రీదేవిగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తోంది. ‘‘నేను ఇప్పటి వరకూ పోషించిన పాత్రల్లో సవాల్‌ విసిరే పాత్ర ఇది. ఎందుకంటే శ్రీదేవి ఓ లెజెండ్‌. ఆమెను నేటికీ  కోట్లాదిమంది ఆరాధిస్తున్నారు. నేనూ ఆమె అభిమానుల్లో ఒకదాన్నే. శ్రీదేవిగా తెరపై కనిపించాలనేసరికి నాపై బాధ్యత మరింత పెరిగింది. నేను ఆమె పాత్రకు న్యాయం చేస్తానని దర్శకనిర్మాతలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను’’అని చెప్పింది రకుల్‌. శ్రీదేవి పాత్ర కోసం తను ఎలా కష్టపడుతోందో చెబుతూ  ‘‘దురదృష్టవశాత్తు నేను శ్రీదేవిని కలవలేదు. అందుకే ఆమె శారీరక భాష ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి తను నటించిన చిత్రాలు చూస్తున్నాను. శ్రీదేవి సన్నిహితుల్ని కలిసి ఆమె గురించిన కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను. తొలిసారి శ్రీదేవి పాత్రను వెండితెరపై పోషించే అవకాశం దక్కడంతో మరింత శ్రద్ధగా కష్టపడుతున్నాను. ‘ఎన్టీఆర్‌’లో ఆమె పాత్రను మలుస్తున్న తీరు చాలా బాగుంది. నా పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణకు ముందే ఎంతటి సాధన అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను’’అని చెప్పింది రకుల్‌.

Link to comment
Share on other sites

నాకు తెలుసు.. అందరి కళ్లు నాపైనే: రకుల్ ప్రీత్ Updated : 07-Oct-2018 : 08:40
 
 
636744984022276254.jpg
న్టీఆర్‌ జీవితంలో పలు కీలక దృశ్యాలను తెరపై చూపించే పనిలో పడ్డాడు డైరెక్టర్ క్రిష్‌. ఈ మేరకు ‘యన్‌.టి.ఆర్‌’ రూపంలో చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. బాలకృష్ణ నిర్మాణంలో రాబోతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ, బసవతారకం పాత్రలో విద్యాబాలన్, సావిత్రిగా నిత్యామీనన్‌, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా.. సుమంత్‌, రానా కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రానికి తొలి భాగాన్ని ‘యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు’ టైటిల్‌తో, రెండో భాగాన్ని ‘మహానాయకుడు’ టైటిల్‌తో విడుదల చేయనున్నామని ఇటీవలే డైరెక్టర్ క్రిష్ ప్రకటించాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఎంతటి ఆసక్తి ఉందో.. అంతకంటే ఎక్కువ ఆసక్తి అందులో నటించే నటీనటులకు ఉంది.
 
 
తాజాగా ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన రకుల్ ప్రీత్ సింగ్.. లెజెండ్ శ్రీదేవి పాత్ర పోషించడమనేది సాధారణ విషయం కాదని, ఈ పాత్ర తనకెంతో సవాలుతో కూడుకున్న పాత్ర అని చెప్పింది. తాను కూడా శ్రీదేవి అభిమానినే అని, తనపై నమ్మకముంచి ఈ పాత్ర ఇచ్చినందుకు.. అది పెద్ద భాద్యత అయినప్పటికీ న్యాయం చేస్తాననే నమ్మకముందని చెప్పింది. శ్రీదేవి గురించి తెలిసిన వారిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నానని, ఆమె నటించిన సినిమాలు చూసి.. ఈ పాత్ర కోసం సిద్దమవుతున్నానని చెప్పుకొచ్చింది. తొలిసారి శ్రీదేవి పాత్ర తెరపై దర్శమీయనుంది కాబట్టి.. అందరి కళ్లు తనపై ఉంటాయనే విషయం తెలుసని చెప్పింది. ఈ ప్రాజెక్టులో పాలుపంచుకోవడం తనకు సంతోషంగా ఉందని వెల్లడించింది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...