Jump to content

ఏమవుతుందో.. ఏపీలో తాజా పరిణామాలపై ఐబీ, ఇంటెలిజెన్స్‌ ఆరా


Recommended Posts

ఏమవుతుందో.. ఏపీలో తాజా పరిణామాలపై ఐబీ, ఇంటెలిజెన్స్‌ ఆరా
18-03-2018 15:55:24
 
636569853229784884.jpg
  • ఏమవుతుందో..
  • తాజా పరిణామాలపై ఐబీ, ఇంటెలిజెన్స్‌ ఆరా
  • వైసీపీతో కలిస్తే బీజేపీకి ఉపయోగం ఉంటుందా?
  • చంద్రబాబు నిర్ణయం టీడీపీకి మేలు చేస్తుందా?
  • జనంలోనూ, పార్టీల కేడర్‌లోనూ జోరుగా చర్చ
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-కాకినాడ)
ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగిన టీడీపీ. కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం, వైసీపీ వేర్వేరుగా అవిశ్వాస తీర్మానాలు. సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు, రాష్ట్ర మంత్రి లోకేష్‌పై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తీవ్ర స్థాయి విమర్శలు. పవన్‌ వైఖరిపై చంద్రబాబు ఆగ్రహం. మంత్రులు మాటల యుద్ధం.. ఈ పరిణామాలతో రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. రాజకీయ చైతన్యం ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి పరిణామాలు సంభవించినప్పుడు మేధావుల నుంచి, సామాన్యుడి వరకు దేశ రాజకీయాలపై తమదైన శైలిలో విశ్లేషిస్తుంటారు. జిల్లా ప్రజలకు రాజకీయ అవగాహన ఎక్కువ. లోకల్‌ ఎమ్మెల్యే పనితీరు నచ్చకపోతే ఉన్నవీలేనివీ చెప్పి బద్‌నామ్‌ చేయాలని చూస్తారు. ఏటీఎంలలో సొమ్ములు రాకపోతే మోదీ తీసుకున్న నిర్ణయాలనీ వదిలిపెట్టరు. అంతెందుకు ఎక్కడో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసే పనుల్ని సైతం.. గ్రామాలలో ఉండే సామాన్యుడు విశ్లేషించి, విమర్శించడం పరిపాటి.
 
 
తాజా రాజకీయ పరిణామాలపై జిల్లావాసులు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఎన్డీయేతో టీడీపీ బంధం తెంచుకోవడంపై ఇక్కడ జనం ఏమనుకుంటున్నారు? లోకేష్‌, చంద్రబాబులపై జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ చేసిన ఘాటైన విమర్శల ప్రభావం ఏ మేరకు ఉంటుంది? తదితర అంశాలపై జనం ఏమనుకుంటున్నారు? అనేదానిపై ఐబీ, ఇంటిలిజెన్స్‌ అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. వారం రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించి జనంలో విస్తృతంగా జరుగుతున్న చర్చలలో ప్రధానంగా వచ్చే అంశాలు ఏమిటి? అనేదానిపై నిఘా విభాగాల అధికారులు దృష్టిసారించారు. కేంద్రంపై టీడీపీ, వైసీపీ వేర్వేరుగా పెట్టిన అవిశ్వాసంపై జనం, ఉద్యోగ, కార్మిక, వ్యాపార వర్గాలలో ఎటువంటి అభిప్రాయం నెలకొంది. ఈ పరిణామం వచ్చే ఎన్నికలనాటికి ఏ మేరకు మార్పు తీసుకువస్తుంది? బీజేపీకి టీడీపీ కటీఫ్‌ చెప్పడం వల్ల మెజార్టీ మైనార్టీ వర్గాలు టీడీపీకి దన్నుగా నిలబడాలనుకుంటున్నారా? అనే దానిపైనా ఆరా తీస్తున్నారు.
 
 
పవన్‌ వ్యాఖ్యల ప్రభావం ఎంత?
లోకేష్‌ అవినీతి మీకు తెలియదా? అంటూ చంద్రబాబును జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. ఈ ప్రభావం జిల్లాలో ఏయే వర్గాలలో ఏమేరకు ఉండవచ్చు? ఏయే సామాజిక వర్గాలలో అనుకూల, సానుకూల స్పందన వచ్చింది? టీడీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత పవన్‌ కల్యాణ్‌ సడన్‌గా యూ టర్న్‌ తీసుకున్నారనుకుంటున్నారా? పవన్‌ వ్యాఖ్యల వెనుక రాజకీయ కోణం ఉందని భావిస్తున్నవారు ఎంత శాతం ఉంటారు? వంటి అంశాలపై ఐటీ, ఇంటిలిజెన్స్‌ అధికారులు ఇప్పటికే చాలా సమాచారం సేకరించారు. టీడీపీ నాయకులపై నిప్పులు చెరిగిన పవన్‌ వచ్చే ఎన్నికలలో వైసీపీతో జత కడతారని భావిస్తున్నారా? పవన్‌, జగన్‌తో జతకడితే ఎన్నికలలో ఎలాంటి ప్రభావం ఉండవచ్చు? అనే అంశంపైనా జనాభిప్రాయం తెలుసుకుంటున్నారు.
 
 
టీడీపీ, వైసీపీలలో విశ్లేషణలు
పవన్‌ కల్యాణ్‌ చేసిన విమర్శలు, చంద్రబాబు తీసుకున్న ఎన్డీయేతో కటీఫ్‌ నిర్ణయం వంటివి జిల్లాలో ఏ పార్టీకి ఎంత మేరకు ప్రయోజనం చేకూరుతుంది? అన్న విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో రాజకీయ విశ్లేషకులతోపాటు.. టీడీపీ, వైసీపీ నేతలలోనూ ఈ చర్చ జోరుగా సాగుతోంది. కాకినాడ పార్లమెంటు పరిధిలో ఒక అసెంబ్లీ పరిధిలో ఈ అంశాలపై ఒక పార్టీ నాయకుడు ప్రైవేటు సర్వే కూడా చేయించారు. అయితే ఆ సర్వే ఆ నాయకుడే చేయించాడా? లేదా ఎవరైనా చేయించారా? అనేదానిపైనా ఇంటిలిజెన్స్‌ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ వారం రోజులలో చోటుచేసుకున్న పరిణామాలు, రాజకీయంగా ఏ పార్టీకి అనుకూలం, ఏ పార్టీకి నష్టం అనేదానిపై ఇంటిలిజెన్స్‌, ఐబీ వంటి సంస్థలతోపాటు.. ప్రయివేటు సర్వేలూ జరగడం గమనార్హం. అంటే ఎన్నికల సమయంలో ఉండే రసవత్తర ఘట్టాలు జరుగుతుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...