Jump to content

టీచర్.. ఇదే నా చివరికోరిక :ఆత్మహత్య లేఖలో ఓ బాలుడు


KING007

Recommended Posts

టీచర్.. ఇదే నా చివరికోరిక : ఆత్మహత్య లేఖలో ఓ బాలుడు
21-09-2017 14:38:29
 
636416015294834193.jpg
గోరఖ్‌పూర్: టీచర్ ఇచ్చిన పనిష్మెంట్‌తో మనస్తాపానికి గురైన ఓ 5వ తరగతి విద్యార్ధి విషంతాగి ఆత్మహత్య చేసుకున్న వైనమిది. గోరఖ్‌పూర్‌లోని సెయింట్ ఆంటోనీ కాన్వెంట్ స్కూల్లో చదువుతున్న 11 ఏళ్ల నవనీత్ ప్రకాశ్ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇదే తన చివరికోరిక అంటూ బాలుడు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘‘ఇక ఎవరినీ అంత బాగా కొట్టవద్దని మా టీచర్‌కి చెప్పండి ప్లీజ్..’’ అని అందులో రాసి ఉంది. టీచర్ తనను మూడు గంటల పాటు కుర్చీలో నిలబెట్టారనీ.. తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించారని నవనీత్ తన లేఖలో పేర్కొన్నాడు.
 
ఈ నెల 15న ఎగ్జామ్ ఉందని స్కూలుకు వెళ్లిన పిల్లాడు, తిరిగి వచ్చేటప్పుడు చాలా విచారంగా కనిపించాడని తల్లిదండ్రులు పేర్కొన్నారు. అదే రోజు సాయంత్రం విషం తాగాడని కన్నీరు మున్నీరయ్యారు. సదరు టీచర్ నవనీత్‌ను తీవ్ర మనోవేదనకు గురిచేసినట్టు ఆరోపించారు. టీచర్‌తో పాటు స్కూల యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా దీనిపై స్కూల్ యాజమాన్యం ఇప్పటి వరకు నోరు విప్పకపోవడం గమనార్హం.

 

Link to comment
Share on other sites

Ee kalam lo ela ayyaru naa chinna appudu ela perigi unte ee patiki okkadu migile vadu kaadhu. Appatilo prathi dhanki teachers chithakabadhe vallu . Paiga parents baga encourage chese vallu baaga kotti ayna chadhivinchandi ani

Aa kaalam veru ee kaalam veru mastaaru. Mana pillalni ala kodithe, avamaanisthe manam oorukuntaama? Nenaithe oorukonu. Oorukonu anedi understatement.
Link to comment
Share on other sites

inTlO kOppaDDaaru extra curriculars yekkuvayyaayani- monnO 17 yELLa ammaayi, medical seat govt. rules valla koddilO tappindi- ninnO tamiLammaayi....goal chEstE 3 periods nilabeTTindhi pantulamma-ivvaaLa 12 yELLa navaneet

 

navaneetam laaga penchaali pillalni -popular liberal culture...prapanchamEmO manassulu paTTinchukOni paashaaNam ....yEnTO paapam, pillalu madyalO !

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...