Jump to content

ఎల్లో సిండికేట్ కథనం సర్కారుకు శాసనం


Sravanlokesh

Recommended Posts

పచ్చ పత్రికల్లో పిచ్చి వార్తలు రాగానే టీడీపీ అవే ఆరోపణలు చేస్తూ చర్యలు తీసుకోవాలంటుంది... ప్రభుత్వం అదే పని చేస్తోంది: రవీంద్రనాథ్‌రెడ్డి

 

వైఎస్ బంధువును కనుకనే ఒక పద్ధతి ప్రకారం కుట్ర జరుగుతోంది.. అందుకే అంతా చట్టబద్ధంగా ఉన్నా చీటింగ్ కేసు,

నిత్యావసరాల కేసు, అక్రమరవాణా కేసు ఒకేసారి నమోదు చేశారు

 

అవసరమైన రసాయనిక ఎరువులను ఎవరి నుంచైనా కొనవచ్చు.. ఎరువులకు సంబంధించి సహకార సంఘాలూ డీలర్లే.. వారి నుంచి కొనడంలో అక్రమమన్న మాటే లేదు

క్రిభ్‌కో నుంచి తీసుకున్నా, సహకార సంఘం నుంచి తీసుకున్నా ఒకే రేటుతో తీసుకుంటాం.. అన్నిటిపైనా ఒకేరకం సబ్సిడీ ఉంటుంది

దారిమళ్లించామని వెర్రి ఆరోపణలు చేస్తున్న 2,200 టన్నుల యూరియా ఆంక్షలు విధించక ముందు కొన్నదే...

ఆగస్టు 8 నుంచి యూరియా సరఫరాయే కావడంలేదు... అమ్మోనియా సల్ఫేట్ తెప్పించుకుంటున్నాం.. ఇక యూరియా ఆధారంగా దోచుకుంటున్నదేముంటుంది?

 

రాష్ట్రంలో ఈ సీజన్‌లో సరఫరా అయిన మొత్తం 12.5 లక్షల టన్నుల యూరియాలో మాకిచ్చింది కేవలం 18 వేల టన్నులే

భారీగా పోటీ ఉన్న మార్కెట్లో నాణ్యత లేకపోతే నిలబడలేం... హెరిటేజ్ పాలకూ, రామోజీ పచ్చళ్లకూ ఏ మార్కెట్ సూత్రాలు వర్తిస్తాయో మాకూ అవే వర్తిస్తాయి

Link to comment
Share on other sites

హైదరాబాద్, న్యూస్‌లైన్: ��దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డిని అప్రతిష్టపాలు చేయటానికి ఈనాడు లేదా ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వస్తుంది. వెంటనే టీడీపీ నేతలు ప్రెస్‌మీట్ పెట్టి అవే ఆరోపణలు చేస్తారు. చర్యలు తీసుకోవాలంటారు. వెంటనే ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుంటుంది. అంటే... ఎల్లో సిండికేట్ శాసిస్తుంది - ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంది. రాష్ట్రాన్ని ఎవరు పాలిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు.��

- ఇవీ కడప మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు.

 

తమకు సంబంధించిన ఎరువుల మిక్సింగ్ ప్లాంట్ల వ్యవహారంలో వినిపిస్తున్న ఆరోపణలపై ఆయన శనివారం �న్యూస్‌లైన్�తో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్రంలో యూరియా సరఫరాపై ప్రభుత్వం ఆంక్షలు విధించిన ఆగస్టు 7వ తేదీ తర్వాత ఒక్క బస్తా కూడా యూరియా కొనలేదని రవీంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. అలాంటప్పుడు ఎరువుల అక్రమ తరలింపు అంటూ పచ్చ పత్రికలు రాయటం, దానిని పట్టుకుని ఆరోపణలు చేయటం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. తమకు సంబంధించిన హరిత ఫర్టిలైజర్స్ ప్లాంటు లెసైన్సును ప్రభుత్వం రద్దు చేయలేదని స్పష్టంచేశారు. లెసైన్సు రద్దు అంటూ తప్పుడు వార్త రాయటం ద్వారా.. బహుశా రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి �ఈనాడు� పత్రిక డెరైక్షన్ ఇస్తున్నట్లు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం ఉన్నత స్థాయిలో వస్తున్న ఒత్తిళ్లతో అధికారులు చర్యలకు దిగుతున్నారనీ, అసలు ఎరువులతో సంబంధమున్న వ్యవసాయ శాఖ కాకుండా పోలీసులు 420 కేసును, నిత్యావసరాల శాఖ 6ఎ కేసును, రవాణాశాఖ మోటారు వెహికిల్ చట్టం కింద కేసును ఒకేసారి నమోదు చేయటాన్ని పరిశీలిస్తే.. తనను ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేస్తున్నట్లు తేలుతున్నదని ఆయన వెల్లడించారు.

 

అందుకే చట్టాలతో సంబంధం లేకుండా ఇలా చేస్తున్నారని అన్నారు. అలాగే తమ ప్లాంట్ల నాలుగేళ్ల మొత్తం టర్నోవరే రూ. 80 కోట్లు లేకపోతే.. రూ. 100 కోట్లు దోచేసినట్లు �ఆంధ్రజ్యోతి� కథనం రాయటం విచిత్రంగా ఉందన్నారు. అలా సంపాదించే కిటుకేమిటో ఆ పత్రికే వెల్లడించాలనీ.. ఆ కిటుకులు బాగా ఒంటబట్టే చంద్రబాబు రూ. 2,000 కోట్లు సంపాదించి ఉంటారని ఆయన ఎద్దేవా చేశారు. డి.ఎల్.రవీంద్రారెడ్డి విజ్ఞుడనుకుంటున్నానని పేర్కొన్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన ఆయనకు మిక్సర్ ప్లాంట్ల వల్ల వ్యవస్థకు లాభమేమిటో, నష్టమేమిటో తెలిసే ఉంటుందన్నారు. ఎరువుల ప్లాంట్లపై ఆరోపణల గురించి �న్యూస్‌లైన్� ప్రశ్నలు, రవీంద్రనాథ్‌రెడ్డి సమాధానాలివీ...

 

ప్రశ్న: రాష్ట్రంలో తీవ్రంగా ఎరువుల కొరత ఏర్పడేలా మీరు మిక్సింగ్ ప్లాంట్లను అక్రమంగా నడిపిస్తున్నారని కొన్ని పత్రికలు, విపక్షాలు ఆరోపిస్తున్నాయి? వాటికి నిజంగానే అనుమతి లేదా?

 

జవాబు: ఇది పూర్తిగా నిరాధారమైన ఆరోపణ. ఎరువులు వేర్వేరు నిష్పత్తులతో మిక్స్ చేసి అమ్మే విధానం 1979 నుంచే ఉంది. అప్పట్లో హ్యాండ్ మిక్సర్లు ఉండేవి. తరువాత స్పిక్, మద్రాస్ ఫర్టిలైజర్స్ తదితర కొన్ని ప్లాంట్లు మూతపడటంతో తీవ్రంగా కాంప్లెక్స్ ఎరువుల కొరత ఏర్పడింది. దీంతో 2003లో కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పిన ఎన్‌డీయే ప్రభుత్వం.. మిషనరీతో నడిచే ప్లాంట్లకు అనుమతులు ఇవ్వటం మొదలుపెట్టింది. 2008లో మరీ తీవ్రంగా కొరత ఏర్పడటంతో మన రాష్ట్రంలోనూ ఈ ప్లాంట్ల స్థాపన మొదలైంది. దీన్ని ఒక వ్యాపారంగా తీసుకుని నేనూ ప్లాంట్లు స్థాపించాను. దేశంలో 400 ప్లాంట్లు ఉంటే మన రాష్ట్రంలో ఇలాంటి ప్లాంట్లు 20 ఉన్నాయి. అందులో మావి నాలుగు. ఇందులో తప్పేముంది? చట్టవిరుద్ధమేముంది? అక్రమ తయారీ మాటెక్కడిది? ఇవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు నడిచేవే. ఈ ప్లాంట్లు ఏమీ అల్లాటప్పా యూనిట్లు కావు. ఒక్కో ప్లాంటుకు దాదాపు రూ. 10 కోట్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఎందరికో ఉపాధి కల్పిస్తున్నాం.

 

ప్ర: సహకార సంఘాలు సబ్సిడీ ద్వారా పొందిన 2,200 టన్నుల యూరియాను అక్రమంగా మీ ప్లాంట్లకు దారి మళ్లించారనేది మీపై ఆరోపణ. అందుకే మీ ప్లాంటు లెసైన్స్‌ను రాష్ట్రం రద్దు చేసిందా?

 

జ: కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం మిక్సర్ ప్లాంట్లకు అవసరమయ్యే అన్ని రకాల రసాయనిక ఎరువులను ఎవరి దగ్గర నుంచైనా కొనుగోలు చేసేందుకు అవకాశముంది. షాపులు, కంపెనీలు, సంఘాలు, పెద్ద డీలర్లు సహా అవసరమైతే విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు మాకు అనుమతి ఉంది. అంతేకాదు.. దిగుమతి చేసుకున్న సరుకుకు తగిన సబ్సిడీని కూడా కేంద్రం నుంచి పొందేందుకు మాకు అనుమతి ఉంది. ఒకసారి 25 వేల టన్నుల సరుకును మేం విదేశాల నుంచి తీసుకొస్తే.. కొరత నివారణ పేరిట అందులో 15 వేల టన్నులను ప్రభుత్వమే తీసుకుంది. ఇలా మేం కొనుగోలు చేసే ప్రతి బస్తా కూడా లెక్క ప్రకారమే ఉంటుంది. పైగా ఎరువులకు సంబంధించి సహకార సంఘాలూ డీలర్లే. ఇందులో అక్రమంగా కొనుగోళ్లనే మాటే లేదు. ఆ 2,200 టన్నుల యూరియాను కూడా ఆంక్షలు మొదలైన ఆగస్టు 7 కన్నా ముందే కొనుగోలు చేశాం. ఆగస్టు 7 తర్వాత ఒక్క బస్తా యూరియా కూడా కొనలేదు. అలాంటప్పుడు అక్రమ తరలింపు మాటే ఎలా తలెత్తుతుంది? ఈ విషయంలో మా ప్లాంటు లెసైన్సు రద్దు చేసిన సమాచారం మాకైతే లేదు.

 

ప్ర: కానీ సహకార సంఘాల ద్వారా రైతులకు దక్కాల్సిన సబ్సిడీని మీరు అన్యాయంగా పొందుతున్నట్లు కాదా?

 

జ: కానే కాదు. ఎందుకంటే క్రిభ్‌కో నుంచి తీసుకున్నా... సహకార సంఘం నుంచి తీసుకున్నా... ఒకే రేటుతో తీసుకుంటాం. అన్నింటిపైనా ఒకే రకం సబ్సిడీ ఉంటుంది. ఆ సబ్సిడీ ఎరువుల ధరనూ లెక్కలోకి తీసుకున్నాకే అంతిమంగా మా మిక్సర్ ఎరువు ధరను ఖరారు చేస్తారు. దాన్ని వ్యవసాయ శాఖ కూడా అంతిమంగా ఆమోదించాల్సి ఉంటుంది. ఆ ధరలకే అమ్ముతాం. మా ఇష్టమొచ్చినట్లు అమ్ముతామంటే కుదరదు. ఐనా మేం ఈ రంగంలో ఉన్న ఇతర పోటీదారులతోనూ పోటీపడాల్సిన స్థితిలో ఎక్కువ ధరలు పెట్టినా.. రైతులే కొనుగోలు చేయరు కదా? ఇది సహజమైన వ్యాపార సూత్రం. కాంప్లెక్స్ ఎరువులకు ఏ మాత్రం కొరత లేని స్థితిలో మేం రాష్ట్రంలోని 1,200 మంది హోల్‌సేల్ డీలర్లతో కాంప్లెక్స్ ఎరువుల అమ్మకాల్లో పోటీపడుతున్నాం.

ప్ర: భారీగా ఈ ప్లాంట్లకు ఎరువులు తరలి వెళ్లటం వల్ల రైతులకు యూరియా దొరకని దుస్థితి ఏర్పడిందంటున్నారు?

జ: ఇదీ ఆధారం లేని ఆరోపణ. మేం తయారు చేసిన ఎరువులనైనా తిరిగి రాష్ట్ర మార్కెట్‌లోకి వదలాల్సిందే కదా? అప్పుడిక మా వల్ల కొరత అనే మాటకు ఆస్కారం ఎక్కడిది? ఒక్క మా ప్లాంట్లకే 4.20 లక్షల టన్నుల తయారీ సామర్థ్యం ఉంటే మేం ఈ సీజన్‌లో ఇప్పటికి ఉత్పత్తి చేసింది కేవలం 55 వేల టన్నులు మాత్రమే. దీనికి సంబంధించిన ముడిసరుకులను ఇఫ్‌కో, క్రిభ్‌కో, ఎన్‌ఎఫ్‌సీఎల్, కోరమాండల్, జువారీ వంటి పెద్ద కంపెనీలు కూడా సరఫరా చేస్తున్నాయి. ప్రతి బస్తా లెక్క ప్రకారమే ఉంటుంది. వ్యవసాయ శాఖకూ అన్నీ తెలుసు. మొత్తం 20 ప్లాంట్లకు ఈ సీజన్‌లో ఇచ్చింది కేవలం 49 వేల టన్నులే. అందులో మాకిచ్చింది 18 వేల టన్నులు. మొత్తం ఇప్పటికి సరఫరా అయిన 12.5 లక్షల టన్నుల యూరియాలో 18 వేల టన్నులు ఎంత స్వల్పమో మీరే లెక్కించండి. పైగా ఆగస్టు 8 నుంచి మాకు యూరియా సరఫరాయే కావటం లేదు. అమ్మోనియా సల్ఫేట్ తెప్పించుకుంటున్నాం. అసలు మాకు యూరియాయే సరఫరా కానప్పుడు, లేని యూరియా ఆధారంగా మేం దోచుకుంటున్నది ఏముంటుంది?

ప్ర: మీ శాంపిల్స్ కొన్ని తనిఖీ, విశ్లేషణ జరిపించినప్పుడు.. మీరు అధికారికంగా చెప్పిన నిష్పత్తులు కనిపించలేదా?

 

 

జ: ఎరువులు గానీ, పురుగు మందులు గానీ ఎంత పెద్ద కంపెనీయైనా సరే కొన్ని బ్యాచుల ఉత్పత్తుల్లో నిర్దేశిత నిష్పత్తుల ప్రకారం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటుంది. నాగార్జున, కోరమాండల్ వంటి కంపెనీల బ్యాచులు కూడా కొన్నిసార్లు విఫలమవుతుంటాయి. దీనివల్ల నష్టం కూడా ఉండదు. ఐనా మేం ఉన్నది తీవ్రంగా పోటీ ఉన్న ప్రైవేటు రంగంలో. మేమూ ప్రధాన పోటీదారుగా ఉన్నప్పుడు నాణ్యతను కచ్చితంగా పాటిస్తాం. నాణ్యత లేకపోతే రైతులు కొనుగోలు చేయరు కదా? రైతులకు మా ఎరువులను నిర్బంధంగా అమ్మటం లేదు కదా? చంద్రబాబు హెరిటేజ్ పాలకు గానీ, రామోజీరావు పచ్చళ్లకు గానీ ఏ మార్కెట్ సూత్రాలు వర్తిస్తాయో మాకూ అవే వర్తిస్తాయి. వారి పాలు, పచ్చళ్లకు సంబంధించి రిజెక్టెడ్ బ్యాచులే లేవా?

 

 

ప్ర: అన్నీ బాగా ఉన్నప్పుడు వేబిల్లులు లేకుండా రవాణా చేయ టం ఎందుకు? లారీలు ఇలాగే పట్టుబడ్డాయి కదా?

 

జ: కేవలం క్లరికల్ పొరపాటు వల్ల ఇలా జరిగింది. ఈ నెల 11, 12, 13 తేదీల్లో సెలవులు వచ్చాయి. అయితే ఆర్డర్ రావటంతో 12న సాయంత్రం లారీల్లో ఎరువులు లోడ్ చేసి పెట్టారు. 14 ఉదయం డ్రైవర్లు త్వరగా వచ్చి ఒక లారీ పత్రాలు మరొకరు తీసుకెళ్లారు. సిబ్బంది వచ్చి జరిగింది గ్రహించి డ్రైవర్లకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో ఆ లారీలను కడప ప్రధాన రహదారిపై ఆపారు. ఆ సరుకు అంతా మా ప్లాంటులో తయారైందే. అక్రమ సరుకు అయితే రోడ్డుపై నిలుపుతామా? అవగాహన లేకనో, ఎవరి ఒత్తిడి వల్లనో తెలియదు గానీ సంబంధం లేని విషయంలో పోలీసులు అతిగా ప్రవర్తించారు. సీఐ మా డ్రైవరును కొట్టారు. ఇలాంటి విషయాల్లో పోలీసులు రావటం దేశంలోనే ఎక్కడా జరగలేదు. మా విషయంలో మాత్రమే ఇలా ఎందుకు జరుగుతోందో తెలియటం లేదు.

 

ప్ర: మీరు ముందుచూపుతో వైఎస్ ఉన్నప్పుడే ప్లాంట్లకు అనుమతులు పొందారనే విమర్శ కూడా వస్తోంది కదా?

 

జ: ఇది రాష్ట్రానికి సంబంధించిన విధానం కాదు. పూర్తిగా కేంద్రం ఆధీనంలో ఉన్న విధానం. నేనొక్కడినే ఈ వ్యాపారంలో లేను. 20 ప్లాంట్లకు అనుమతి ఉంది. ఇందులో నా ఒక్కడికే ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు కూడా ఏమీ లేవు. అప్పట్లో అనుమతులు తీసుకుని ఇప్పటికీ ఏర్పాటు కాని ప్లాంట్లు కూడా ఉన్నాయని గుర్తించాలి. ఒకరిద్దరు సరిగ్గా వ్యాపారం చేయలేక అమ్మేసుకునే స్థితిలో ఉన్నారంటే మీరే అర్థం చేసుకోండి. అసలు ఇంత రాద్ధాంతం ఎందుకు? నేను ఈ వ్యాపారంలో లేకపోతే ఎల్లో సిండికేట్ దృష్టికి ఈ వ్యాపారం వచ్చేదే కాదు.

 

ప్ర: కొద్ది రోజులుగా మీ ప్లాంట్ల తనిఖీ, శాంపిల్స్ సేకరణ, నిల్వల తనిఖీపై సీఎంఓ (ముఖ్యమంత్రి కార్యాలయం) పట్టుపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి? ఎందుకని?

 

జ: సీఎంఓ అంతగా ఎందుకు పట్టుబడుతున్నదో నేను ఏ కామెంట్ చేయలేను. కానీ మా నాలుగు ప్లాంట్ల ఉత్పత్తులకు సంబంధించి వ్యవసాయ శాఖ 46 శాంపిల్స్ సేకరించింది. దీంట్లో 4 శాంపిల్స్ ప్రమాణాల ప్రకారం లేవని తెలిసింది. అయితే నిర్దేశించిన ప్రమాణాల్లో 2 శాతం వరకు మినహాయింపు ఉంటుంది. ఈ నాలుగు శాంపిల్స్ కూడా 1.6 శాతం మాత్రమే తేడా ఉన్నాయి. కొన్ని శాంపిల్స్‌ను రీఅనాలిసిస్‌కు పంపించాం. ప్రమాణాల్లో 5 శాతం కంటే ఎక్కువగా లోపాలు ఉంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు. మా విషయంలో మాత్రం అంతా సరిగానే ఉన్నా.. ఏదేదో చేయాలని ప్రయత్నిస్తున్నారు.

 

ప్ర: అంతా చట్టబద్ధంగానే ఉన్నప్పుడు మీ ప్లాంట్లపై మాత్రమే ఎందుకు ప్రభుత్వం దృష్టి సారించింది?

 

జ: కొద్ది రోజులుగా దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రతిష్టను దిగజార్చటానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబునాయుడుతో పాటు రాష్ట్రంలోని కొన్ని శక్తులు చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఆ కుటుంబానికీ నాకూ ఉన్న బంధుత్వం వల్ల నేనూ వారికి టార్గెట్టయ్యాను. ఈనాడులో ఆధారాలు లేని వార్తలు వస్తాయి. వెంటనే టీడీపీ నేతలు అందుకుని నాపై విమర్శలు చేస్తారు. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం అమలు జరిపే కుట్ర. మూడు నెలలుగా అన్ని మిక్సింగ్ ప్లాంట్లకు సంబంధించిన వ్యవహారాలపై వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా నిఘా ఉంచింది. అది అవసరమే కానీ.. రాష్ట్రంలో ఏ ఎరువుల డీలర్‌పైనా దేశంలోనే ఎక్కడా, ఎప్పుడూ లేనట్లుగా చీటింగ్ కేసు, నిత్యావసరాల కేసు, అక్రమ రవాణా కేసు మాపై ఒకేసారి నమోదు చేయటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈనాడు నేతృత్వం లోని ఎల్లో సిండికేట్ ఎందుకు ఇలాంటి ఏడుపు వార్తలు రాస్తున్నదో అందరికీ తెలుసు. కానీ ఆ పత్రిక శాసిస్తున్నట్లుగానే ప్రభుత్వం నన్నే ఎందుకింతగా టార్గెట్ చేస్తోందో అర్థం కావ టంలేదు. బహుశా ఎల్లోసిండికేట్ ఉద్దేశపూర్వక కథనాలు, వైఎస్ వ్యతిరేక శక్తుల ఒత్తిడికి ప్రభుత్వం ప్రభావితమవుతోందేమో!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...