Jump to content

తపాల గణేష్‌పై దాడి


Cyclist

Recommended Posts

ఓఎంసీ అక్రమాలపై పోరాటం చేస్తున్న తపాల గణేష్‌పై సోమవారం గుర్తు తెలియని దుండగుల దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన బళ్లారిలో చోటు చేసుకుంది.

 

ఓఎంసీ అక్రమాలపై తాను ప్రశ్నిస్తున్నాననే కారణంతో తనను అడ్డు తొలగించుకోవాలని ఓఎంసీ సిబ్బందిచే దాడి చేయించారని గణేష్ పేర్కొన్నారు. గాయపడిన ఆయన బళ్ళారిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Link to comment
Share on other sites

ఒక వైపున ఓబుళాపురం గనులలో చోటుచేసుకుంటున్న అక్రమాలపై అధికారులు సర్వే చేస్తున్న సమయంలోనే అక్కడికి కేవలం 250 అడుగుల దూరంలోనే ఈ దాడి జరగడం పట్ల సర్వత్రా ఆక్షేపణ వ్యక్తమవుతున్నది.

 

తపాల గణేష్ చాలా కాలంగా గాలి జనార్దన్‌రెడ్డి సోదరుల గనుల అక్రమాలపై పోరాడుతున్న విషయం తెలిసిందే. కర్నాటక రాజకీయాలలో ఎంతో శక్తిమంతంగా మారిన గాలి సోదరులపై ఆరోపణలు చేయడం అంటే మాటలు కాదు. ఆ సాహసం చేసి, ఓబుళాపురం గనుల అక్రమాలపై ఫిర్యాదు చేసిన తపాల గణేష్‌కు తగిన భద్రత కల్పించాలని ఒత్తిడి రావడంతో కొన్నాళ్ల క్రితం కోర్టు నలుగురు సాయుధ అంగరక్షకులను ఏర్పాటు చేసింది.

 

అయితే అధికారికంగా నలుగురు అంగరక్షకులు ఉన్నా, నిజానికి ఆయన వద్ద ఎప్పుడూ ఒక్కరు మాత్రమే అంగరక్షకుడు ఉంటున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం గణేష్ చికిత్స పొందుతున్నారు. గాలి సోదరులే తమ మనుషులతో ఈ దాడి చేయించారని, ఇంతకంటె హీనమైన చర్య మరొకటి ఉండదని గణేష్ సన్నిహితులు పేర్కొంటున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...