Jump to content

జగన్‌ మందు తాగితే మగాళ్లు కాటికే.. ఆడోళ్లే మిగులుతారు.


ravindras

Recommended Posts

ఈసారి ఆయన మళ్లీ వస్తే అంతా గల్లంతే

ఎమ్మెల్యే నిమ్మలతో స్థానికుల ఆసక్తికర సంభాషణ

పాలకొల్లు, అక్టోబరు 26: జగన్‌ ప్రభుత్వంలో ఆయన సొంత మద్యం తయారీ కంపెనీలు సరఫరా చేస్తున్న మద్యం తాగిన మగాళ్లందరూ కాటికే పోతారని.. ఇక ఆడోళ్లే మిగులుతారని ఓ సాధారణ పౌరుడు వ్యాఖ్యానించాడు. ఆయన మరోసారి అధికారంలోకిస్తే చాలామంది చచ్చిపోతారని మరొకరు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం 90 శాతం పూర్తి చేసినప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గురువారం ఉదయం పట్టణంలో పారిశుధ్య పనులు నిర్వహించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చెత్త ఎత్తేటప్పుడు అడుగడుగునా ఖాళీ మద్యం సీసాలు కనిపించాయి. ఆ ఖాళీ బాటిళ్లు చూపిస్తూ ఆయన స్థానికులు, కార్మికులతో మాట్లాడారు. వారు ఎమ్మెల్యేతో తమ బాధలు చెప్పుకున్నారు. ఈ సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఆ వివరాలు వారి మాటల్లోనే..

నిమ్మల: జగన్‌ మద్యం నిషేధం అని చెప్పారు. నాలుగున్నరేళ్లయింది. నిషేధం ఏమైంది?

స్థానికుడు: అయ్యా.. ఆయన ఇంకోసారి వస్తే చాలామంది చచ్చిపోతారండి. ఆ కల్తీ మద్యం తాగి నా ఆరోగ్యం కూడా పాడైంది. ఇంకా తాగితే ప్రాణం పోతుందని మందు మానుకున్నాను.

నిమ్మల: చెత్త ఎత్తిన ఈ పది మీటర్ల దూరంలోనే 30 నుంచి 40 మద్యం ఖాళీ సీసాలు దొరికాయి. ఇది గమనిస్తే జగన్‌ ప్రభుత్వం మద్యం ఏస్థాయిలో అమ్ముతుందో అర్థమవుతుందా..?

స్థానికుడు: కల్తీ, నాసిరకం మద్యం తాగి ఆస్పత్రి పాలవుతున్నాం గల్లిగల్లీకి మద్యం అందుబాటులో ఉండడంతో దానికి బానిసలవుతున్నాం.

నిమ్మల: బాబూ.. ఈ సీసాసై ఉన్న బ్రాండ్‌ ఏమిటో చదివి చెప్పమ్మా..?

స్థానికుడు: అది హైదరాబాద్‌ బ్లూ బ్రాండ్‌ సార్‌.

నిమ్మల: గతంలో ఎప్పుడైనా ఈ బ్రాండ్ల పేరు విన్నారా..?

స్థానికుడు: ఎప్పుడూ వినలేదు సార్‌. చెత్త బ్రాండ్లన్నీ ఇప్పుడే కొంటున్నాం. బ్రాందీ షాపునకు వెళ్లినా, మాల్‌కు వెళ్లినా అక్కడ అమ్మిందే కొనాలి.

నిమ్మల: కార్మికులు, పేదలు మద్యానికి బానిసలైతే మహిళలు పుస్తెలు అమ్ముకుంటున్నారు. దీనిపై ఎలా స్పందిస్తున్నారు?

స్థానికుడు: అయ్యా.. గతంలో 30 నుంచి 40 రూపాయలకే లిక్కర్‌ బాటిల్‌ వచ్చేది. ఇప్పుడు రూ.150 నుంచి 200 రూపాయలు పెడితే గాని క్వార్టర్‌ రావడం లేదు. ఈ మందు తాగి మగాళ్లంతా చచ్చిపోతారు. ఆడాళ్లే మిగులుతారు. ఈ ప్రభుత్వంలో పేదవర్గాలు మద్యానికి బానిసలై ఆర్థికంగానూ, ఆరోగ్యపరంగానూ నష్టపోతున్నారు.

we need  to remind drinkers about quality and price of liquor by conducting these kind of awareness programs 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...