srinivas_sntr Posted January 19, 2023 Posted January 19, 2023 కేజ్రీవాల్ ను వారించిన గులాబీ బాస్.. చంద్రబాబును కలిస్తే మీడియా ఫోకస్ మారుతుంది.. తెలంగాణ ఖమ్మంలో జరుగుతున్న బీఆర్ఎస్ ఆవిర్బావ సభకు హాజరవ్వాలనుకున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. హైదరాబాద్ మీదుగా ఖమ్మం వెళ్తున్న తరుణంలో టీడిపీ జాతీయ అద్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురించి కేజ్రీవాల్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. చంద్రబాబును తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలవాలన్నది ఆ ప్రస్తావన సారాంశంగా తెలిసింది. కాగా కేజ్రీవాల్ ఖమ్మం సభ కోసం వచ్చి చంద్రబాబును కలిస్తే మీడియా ఫోకస్ వారి కలయిక మీద ఉంటుంది తప్ప ఖమ్మం సభ మీద ఉండదని భావించిన గులాబీ దళపతి, కేజ్రీవాల్ కు నచ్చజెప్పినట్టు తెలుస్తోంది. చివరికి హైదరాబాద్ చేరుకున్నందుకు చంద్రబాబును కేజ్రీవాల్ కర్టెసీగా ఫోన్ లో సంప్రదించివనట్టు విశ్వసనీయ సమాచారం. వార్త తెలిసి ఓహ్ కేజ్రీవాల్.. వాట్ ఎ క్రేజీ యూ ఆర్.. అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు.
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.