Jump to content

జనం నవ్వుతున్నారు జగన్ సారూ !


Siddhugwotham

Recommended Posts

” ఏదో తేడాగా ఉంది.. నీకేమీ అనిపించడం లేదా ?” అని హీరో అడుగుతాడు బ్రహ్మానందాన్ని. ” ఏం లేదే ” అని అప్పటిగే గర్వం నెత్తికెక్కిన కమెడియన్ బ్రహ్మానందం బిల్డప్ ఇస్తాడు. కానీ కాసేపటికే తెలిసిపోతుంది… ఆ తేడా ఏమిటో. మొత్తం గర్వం దిగిపోయాక.. తన పరువు కాపాడుకోవడానికి తంటాలు పడతాడు. ఆ సినిమా రైటర్ త్రివిక్రమ్ ఈ సీన్‌ని చాలా కామెడీగా తీసి ఉండవచ్చు కానీ.. నేటి రాజకీయాలకు పక్కాగా అన్వయించుకోవచ్చు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగం చూసిన తర్వాత చాలా మందికి.. ” జగన్‌కు ఏమీ అనిపించడం లేదా ?” అనే డౌట్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయి నాలుగేళ్లయింది. కానీ ఇప్పటికే మొదటి సారి మాట్లాడినట్లే మాట్లాడుతున్నారు. ఓ కులం అంటున్నారు. చంద్రబాబు అంటున్నారు. అవినీతి అంటున్నారు… చివరికి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికీ దిగజారిపోయారు. కానీ జగన్‌కు తెలియనిదేమిటంటే… తెలిసినా తెలుసుకోవడానికి ఇష్టపడనిదేమిటంటే.. ఆయన పరిపాలనను ప్రజలు నాలుగేళ్లుగా చూస్తున్నారు. ఇప్పుడు ప్రజుల చూసేది చేతల్ని కానీ మాటల్ని కాదు. మన ముఖ్యమంత్రికి ఇంత నాలెడ్జ్ ఉందా ? అని జనం ఆశ్చర్యపోతున్నారు మహా ప్రభో ! ప్రత్యేక హోదా వస్తే ఆదాయపు పన్ను కట్టక్కర్లేదు.. ప్రతీ జిల్లా హైదరాబాద్ అయిపోతుంది అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చెబితే చాలా మంది నమ్మేశారు. నిజం తెలిసిన వాళ్లు ట్రోలింగ్ చేశారు. కానీ జగన్ సామర్త్యంపై అపార నమ్మకం ఉన్నవాళ్లు ట్రోలింగ్ చేసిన వాళ్లనే ట్రోలింగ్ చేశారు. కానీ అవన్నీ జ్ఞాన గుళికలని ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మందికి తెలిసి వచ్చింది. 

గత మూడున్నరేళ్లుగా ఆయన అలాంటి గుళికల్ని వదులుతూనే ఉన్నారు. కరోనా వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం లాక్ డౌన్ చేసుకుంటే బ్లీచింగ్ పౌడర్ చాలని తేల్చేశారు. అప్పట్నుంచి ప్రారంభమైన ఆయన విశ్వరూప ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. తాజాగా అసెంబ్లీలో అభివృద్ధికి ఆయన ఇచ్చిన నిర్వచనం చూసిన తర్వాత ఎవరికైనా మైండ్ బ్లాంక్ కాకుండా పోదు. తాను రూ .ఐదు ఇచ్చి నియమించిన వాలంటీర్లు నెలకు ఓ సారి లబ్దిరాలకు రూ. రెండు వేలు ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడాన్ని వికేంద్రీకరణ అనేశారు జగన్ రెడ్డి. అంతేనా ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ కూడా వికేంద్రీకరణ కోటానే. ఇది చాలా మందికి తెలియదు. పెద్ద పెద్ద మేనెజ్ మెంట్ ప్రొఫెసర్లకు కూడా తెలియదు. ఇంత చక్కగా వికేంద్రీకరణం చేసేశాకా మరి మూడు రాజధానులతో కొత్తగా చేసేదేముందని.. చాలా మందికి వచ్చే డౌట్. కానీ వారంతా జగన్ లాంటి విజ్ఞాన గని ముందు ఎందుకూ కొరగారు కాబట్టి వారి సందేహాలను పట్టించుకోవాల్సిన పని లేదు. ఆయన తెలివి తేటల్ని.. నాలెడ్దిని చూసి మా ముఖ్యమంత్రి ఇంత గొప్ప వ్యక్తా అనుకోవాల్సిన పరిస్థితి. ఆయనకు తోడు ఐఐటీలో చదివిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిండు సభలో కూర్చుని కిటీకీలే లేవు ఇదా కట్టించింది అని మాట్లాడటం .. నాయకుడికి తగ్గ అనుచరులు అనిపించుకున్నారు. వీరి విజ్ఞాన ప్రదర్శన .. వారి ఫ్యాన్స్‌కు నచ్చుతుందేమో కానీ కాస్త బుర్ర ఉన్న వాళ్లకు మాత్రం “ఇదేందిరా ..మయ్యా..” అని అనుకోకుండా ఉండలేరు. 

అమరావతికి అయ్యే ఖర్చుపై చెప్పిన లెక్కలకు ..గణిత శాస్త్రంలో నోబెల్ ఇవ్వాల్సిందే ! ఎప్పుడైనా ముఖ్యమంత్రిగారు చూసి రాసే ప్రసంగాల్లో అంకెలను చదవాల్సి వచ్చినప్పుడు… అయన చెప్పే లెక్కలు చాలా ట్రోలింగ్‌కు గురయ్యాయి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అటూ చాలా మంది ఎద్దేవా చేస్తూ ఉంటారు. నోరు తిరగక అలా అంటూ ఉంటారులేని అని చాలా మంది అనుకుంటారు. కానీ అమరావతి నిర్మాణానికి నాలుగైదు లక్షల కోట్లు ఖర్చవుతుందని అదంతా ప్రభుత్వమే పెట్టుకోవాలని.. అంత నా దగ్గర ఉంటే.. అభివృద్ధి చేయనా అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టేశారు. ఎకరానికి మౌలిక సదుపాయాల కోసం రూ. కోటి ఖర్చవుతుందని చంద్రబాబు లెక్కలేశారని అది ఇప్పుడు అంత కంటే ఎక్కువ అవుతుందని కబుర్లు బాగానే చెప్పారు కానీ.. అసలు అమరావతి గురించి ఏమీ తెలియదా.. తెలియనట్లు నటించారా అన్నది జనాలకు కాస్త క్లారిటీ రావాల్సి ఉంది. ఓ ప్రపంచ స్థాయి నగరం నాలుగైదులక్షల కోట్లకు రెడీ అయిపోతుంది. అందులో డౌట్ లేదు.

ఇప్పుడు హైటెక్ సిటీలో ఉన్న ఆస్తులన్నీ ప్రభుత్వం ప్రజాధనంతో కట్టించిందా? . అక్కడ రోడ్లు , డ్రైనేజీ లాంటి మౌలిక సదుపాయాల్నే కట్టించింది. మిగతా అంతా ప్రైవేటు వ్యక్తులు డెలవప్ చేశారు. అది హైదరాబాద్‌కు వచ్చిన పెట్టుబడే. అంత మాత్రాన అది జనం సొమ్మంటారా?. అమరావతి మాస్టర్ ప్లాన్‌ను చూసిన అంతర్జాతీయ ఆర్థిక వేత్తలు కూడా శభాష్ అనుకుండా ఉండలేకపోయారు. ఇంత భారీ సంపద సృష్టి ఆలోచన భేష్ అన్నారు. ఆర్థిక ప్రణాళికను అమరావతి సృష్టికర్త చంద్రబాబునాయుడు గతంలోనే ప్రకటించారు. మొత్తంగా చూస్తే అది ఓ మంచి సంపద సృష్టి కేంద్రం. దానిపై చేసే అప్పులు తీర్చుకోవడమే కాక రాష్ట్రానికి లక్షల కోట్ల సంపద సృష్టిస్తుంది. ఇప్పుడు అమరావతిని చిక్కిశల్యం చేసి.. చాన్స్ వస్తే రేపోమాపో చంపేస్తామని చెబుతూ.. దాన్ని అమ్ముతామంటే ఎవరు కొంటారు ?. దాన్నే చూపించి అసలు అమరావవతికి డిమాండ్ లేదని చెబుతారా ? మీ తెలివి తేటలకు.. జనానికి మైండ్ బ్లాంక్ అయిపోయి ఉంటుంది. జనం అభిప్రాయం ఏమిటంటే.. ఒక్క సారి మీరు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే.. అమరావతిలో ఎకరం యాభై కోట్లకు కొనేవాళ్లు క్యూ కడతారు. ఎందుకంటే.. అది అమరావతి. ఆ విషయం తెలియనట్లుగా కాకిలెక్కల గణిత శాస్త్రవేత్తల్లా కబుర్లు చెబితే ప్రజలు కూడా నోబెల్ ఇచ్చేయండి సార్ అని ట్రోలింగ్ చేసుకుంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది. మూడు ప్రాంతాలకూ మూడున్నరేళ్లలో చేసిన అభివృద్ధి.. తెచ్చిన కంపెనీల గురించి ఓ ప్రజెంటేషన్ ఇవ్వలే్కపోయారా? విజయవాడ- గుంటూరుకు చంద్రబాబు ఏమీ చేయలేదు.. అన్నీ నేనే చేశానని ముఖ్యమంత్రిగారు ప్రకటించుకున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అవి చూసిన తరవాత ఎవరకైనా ఆ పనుల కోసం గత ప్రభుత్వం.. ముఖ్యమంత్రి ఎంత తాపత్రయ పడ్డారో స్పష్టంగా గుర్తు వస్తుంది .. ప్యాచ్ వర్కులు కూడా చేయడానికి నెలల తరబడి సమయం తీసుకున్న జగన్ ముఖ్యమంత్రిత్వం …పరిపాలనా దక్షత గుర్తుకు వస్తుంది. కానీ తాను సొంతంగా ఏంచేశారో జగన్ చెప్పుకుని ఉండాల్సంది. పులివెందుల తడికల బస్టాండ్.. దాని కోసం వేసిన విమానం గ్రాఫిక్స్… పత్తిత్తు కబుర్లు చెప్పి స్టీల్ ప్లాంట్‌కు వేసిన పునాది రాయి దగ్గర నుంచి వచ్చిన పరిశ్రమల్లో చాలా వరకూ కడపలోనే్ శంకుస్థాపనలు చేసినా ఇంత వరకూ గ్రౌండ్ అవని వాటి దగ్గర నుంచి… నడుం విరిగిపోయే రోడ్ల వరకూ చాలా చూపించవచ్చు. రాజధాని పేరుతో విశాఖలో చేస్తున్న భూదందాలు.. గొరిగేసిన కొండలు.. కూల్చేసిన అడవులు..మైనింగ్ అలాంటి అభివృద్ధిని ప్రజెంట్ చేయాల్సింది. ఎందుకంటే.. చెప్పుకోవడానికి ఇంతకు మించి ఏమీ లేదు. ఈ ప్రభుత్వంలో చేసిందేమీ లేదు. చివరికిగత ప్రభుత్వంలో దాదాపుగా పూర్తయిన సంగం బ్యారేజీ పనులను కూడా పూర్తి చేయకుండా అసంతృప్తిగా విగ్రహాలు పెట్టుకుని ప్రారంభించేయాల్సిన దుస్థితి. ఇంత దారుణమైన అభివృద్ధి చేస్తూ.. మళ్లీ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యమని చెప్పడం నెవ్వర్ బిఫోర్.. నెవ్వర్ ఆఫ్టర్. సీఎం పదవిలో ఉండి అసెంబ్లీ వేదికగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి సిగ్గనిపించలేదా ? ఏమన్నారు సీఎం సారూ…

అమరావతి రైతులు అరసవిల్లి వరకూ పాదయాత్ర చేస్తే ఉత్తరాంధ్ర ప్రజలు ఊరుకుంటారా ?. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తే ఉత్తరాంధ్ర ప్రజలకు ఎందుకు కోపం ? అసలు వారెప్పుడైనా మాకు రాజధాని కావాలని డిమాండ్ చేశారా ? మనదంతా ఓ రాష్ట్రం అని అమరావతికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు వాళ్లు. అధికారం దక్కగానే చిచ్చు పెట్టేద్దామని అనుకొంత మంది టైప్ కాదు వాళ్లు. అమరావతి రైతులను మోసం చేసినట్లుగా రేపు ప్రభుత్వం తమను మోసం చేయదా అని కంగారు పడుతున్నారు వారు. వారిని రెచ్చగొట్టడానికి గత నాలుగైదు రోజులుగా మంత్రులు చేస్తున్న ప్రకటనలు .. ఏ మాత్రం ప్రభావం చూపించలేదని ముఖ్యమంత్రిగారే రంగంలోకి దిగినట్లుగా ఉన్నారు. వారు తిరగబడకపోతే.. వారేదో తప్పు చేసినట్లుగా అన్నట్లుగా రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకనాడు వైఎస్ ఇలా పాతబస్తీల్లో మత కలహాలు.. చిన్నారెడ్డితో కలిసి ప్రాంతీయ విబేధాలు రెచ్చగొట్టారని చెప్పుకుంటారు. అయితే అది అధికారం అందుకోవడానికే. అందిన తర్వాత వాటిని తొక్కేశారు. కానీ ఇప్పుడు అధికారం అందిన తర్వాత ఆయన వారసుడు ఈ చిచ్చు పెడుతున్నారు. ముఖ్యమంత్రిగా అన్ని ప్రాంతాలూ సమానమేనంటూ మాటలతో చెబుతూ.. ఓ ప్రాంతం ప్రజల్ని మరో ప్రాంతంపై రెచ్చగొట్టడం.. అంటే నైతికంగా ఎక్కడికో వెళ్లిపోయినట్లు. నైతికత అనే ప్రశ్నకు అర్థమే తెలియని ప్రభుత్వం.. పాలకులు.. ప్రజాప్రతినిధులు కాబట్టి.. మనం చెప్పుకోవడం కూడా వేస్ట్. 

ప్రజలకు పనితనం అర్థమైపోయింది సీఎం సారూ .. జాగ్రత్తపడండి ! 

నేను మీకు కడుపు నిండా భోజనం పెట్టాలనుకున్నా కానీ వాళ్లు అడ్డుకున్నారు అని ఐదేళ్లు అధికారంలో ఉండి బీద అరుపులు అరుస్తూ ప్రజల్లోకి వెళ్తే ఎవరూ ఓట్లేయరు. ప్రజలకు కావాల్సింది ఫలితాలు కానీ.. కారణాలు కాదు. నాలుగేళ్ల కిందటితో పోలిస్తే .. రాష్ట్రం ఎక్కడికో వెళ్లిపోయింది. పోలవరం ఎక్కడ ది అక్కడే ఉంది. అమరావతి పూర్తిగా నాశనం అయిపోయింది. మౌలిక సదుపాయాలు మృగ్యం. రోడ్లన్నీ నాశనమైపోయాయి. రైల్వే ప్రాజెక్టులు లేవు.. నగదు బదిలీ పథకాలు తప్ప.. ప్రజల్ని బతకనిచ్చే ప్రోగ్రాములేమీ లేవు. కార్పొరేషన్లు అన్నీ నిర్వీర్యం. స్కూళ్లకు రంగులేయమే గొప్ప అనుకు్నే మార్వలెస్ మైండ్… చివరికి అత్యంత దుర్భరమైన శాంతిభద్రతలు. వ్యవస్థలన్నీ సర్వనాశనం. ప్రజలు పోలీసు వ్యవస్థను కూడా నమ్మలేని దౌర్భాగ్య పరిస్థితి. ఇవన్నీ షిక్కటి చిరునవ్వుతో మీరు చెప్పాల్సిన పని లేదు. చేతలే చెబుతున్నాయి. పనితనం చెబుతుంది. ఇదంతా ప్రజలకు అర్థమైపోయింది.. అందుకేసీఎంగారూ.. జాగ్రత్తపడండి. ఇప్పటికే చేయిదాటిపోయింది. ఇంకో ఏడాది మాత్రమే సమయం ఉంది. అద్భుతం చేయండి.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...