Ramesh39 Posted January 13, 2022 Share Posted January 13, 2022 దర్శకధీరుడు రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమా ఈ పాటికి థియేటర్స్ లో విడుదలైపోవాలి. కరోనా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. దాంతో అభిమానులు నిరాశచెందారు. అయినప్పటికీ ఈ సినిమా విడుదల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్ని ముగించారు. టీజర్స్, ట్రైలర్ తో అంచనాల్ని ఓ రేంజ్ లో పెంచేసిన ఈ సినిమాకి సంబంధించి తాజాగా మరో అంకం పూర్తయింది. ఇటీవల ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. దీనికి ఎలాంటి సర్టిఫికెట్ జారీ చేశారో తెలియదు కానీ.. సెన్సార్ రివ్యూ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫిల్మ్ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ అయిన ఉమైర్ సంధు ‘ఆర్.ఆర్.ఆర్’ సెన్సార్ రివ్యూను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియచేశారు. ‘మైండ్ బ్లోయింగ్.. జూనియర్ యన్టీఆర్, రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ది టౌన్’.. ఇద్దరూ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అంటూ.. ఫైర్ ఎమోజీని షేర్ చేశారు. అలాగే.. ‘దంగల్, బాహుబలి 2’ రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందని కూడా తెలిపారు. దీంతో అభిమానులు సినిమా విడుదలకు సంబంధించిన అప్డేట్స్ గురించి ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి ఉమైర్ సంధు చెప్పినట్టుగా ‘ఆర్.ఆర్.ఆర్’ ఎన్నిరికార్డుల్ని బ్రేక్ చేస్తుందో చూద్దాం. Link to comment Share on other sites More sharing options...
sivaNTR Posted January 13, 2022 Share Posted January 13, 2022 Ee umair Sandhu information kanna mee pakka Sandhu lo vaadi information a better ga untadhi Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.