kurnool NTR Posted May 30, 2021 Posted May 30, 2021 గుంటూరులోని శ్రీకృష్ణదేవరాయ మున్సిపల్ స్టేడియంలో తెలుగు దేశం పార్టీ ప్రధమ మహాసభ జరిగింది. చివరిరోజైన మే 28న భవానీపురం మీదుగా బందర్ రోడ్డు వరకు బ్రహ్మండమైన ఊరేగింపు జరిగింది. తెలుగు తమ్ముళ్ల ర్యాలీతో గుంటూరు మొత్తం పసుపుమయంగా మారిందని చెబుతారు. అదే రోజు సాయంత్రం శాతవాహన్ నగర్ లోని సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఎదురుగా భారీ బహిరంగ సభ నిర్వహించారు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. తెలుగు దేశం పార్టీ ప్రధమ మహాసభలు అప్పట్లో దేశంలో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ కోటలు బద్దలు కొట్టి అధికారంలోకి వచ్చిన అన్న ఎన్టీఆర్ కు దేశ వ్యాప్తంగా క్రేజీ వచ్చింది. కాంగ్రెస్ వ్యతిరేక శక్తులకు ఆయన కేంద్రంగా మారిపోయారు. అందుకే తెలుగు దేశం మహాసభలకు ఎన్టీఆర్ పిలవగానే.. అప్పటి కాంగ్రెసేయేతర పార్టీల నేతలంతా గుంటూరు వచ్చేశారు. అప్పటి రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతున్న ఎంజీ రామచంద్రన్, బాబు జగ్జీవన్ రావు, ఫరూఖ్ అబ్దుల్లా, హెచ్ఎస్ బహుగుణ, చండ్ర రాజేశ్వర్ రావు వచ్చారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఎల్ కే అద్వానీ, అటల్ బిహార్ వాజ్ పేయ్, రామకృష్ణ హెగ్దే, అజిత్ సింగ్ , శరద్ పవార్, ఉన్నికృష్ణన్, ఎస్ఎస్ మిశ్రా, రవీంద్ర వర్న, మేనకాగాంధీలు హాజరయ్యారు. ఒక రకంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న నేతలంతా తెలుగు దేశం పార్టీ ప్రధమ మహాసభలకు రావడం అప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. తెలుగుదేశం పార్టీ మహానాడు కోసం వచ్చిన ప్రతినిధుల కోసం ప్రత్యేక కుటీరాలు నిర్మించారు. మహానాడుకు వచ్చిన జాతీయ నేతల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టీడీపీ మహానాడులో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అప్పటి ప్రముఖ సినీ కళాకారులు వినోద కార్యక్రమాలతో అలరించారు. మొత్తంగా 1983 మే26,27,28 తేదీల్లో గుంటూరులో అప్పటి ముఖ్యమంత్రి అన్న ఎన్టీ రామారావు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్టీ ప్రధమ మహాసభలు చరిత్రలో నిలిచిపోయేలా జరిగాయని అంటారు.
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.