Jump to content

కల్యాణ్‌రామ్‌ కొత్త చిత్రానికి ఆసక్తికర టైటిల్‌!


Ramesh39

Recommended Posts

కల్యాణ్‌రామ్‌ కొత్త చిత్రానికి ఆసక్తికర టైటిల్‌!

kalyanram001_1.jpg

హైదరాబాద్‌: నందమూరి కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా వేగేశ్న సతీష్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మెహరీన్‌ కథానాయిక. ఇటీవల షూటింగ్‌ ప్రారంభమైన ఈ చిత్రానికి ‘ఎంత మంచివాడవురా!’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శుక్రవారం కల్యాణ్‌రామ్‌ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్‌ లోగోను ఆవిష్కరించారు. వర్షంలో తడుస్తున్న ఇద్దరు చిన్నారులకు మొక్కజొన్న కండి కొనిచ్చి సైకిల్‌పై వెళ్తున్న సమయంలో ‘ఎంత మంచివాడవురా’ అంటూ అక్కినేని నటించిన ‘నమ్మినబంటు’ చిత్రంలోని పాటతో విడుదల చేసిన ఈ టైటిల్‌ టీజర్‌ ఆకట్టుకుంది. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపి సుందర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. 

 

 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...