Jump to content

ఏపీలో 5 చోట్ల రీపోలింగ్‌.. తేదీ ఖరారు చేసిన ఈసీ


Recommended Posts

https://www.andhrajyothy.com/artical?SID=781311

 

ఏపీలో 5 చోట్ల రీపోలింగ్‌.. తేదీ ఖరారు చేసిన ఈసీ
01-05-2019 22:42:48
 
636923474807059805.jpg
విజయవాడ: మే 6న ఆంధ్రప్రదేశ్‌లో 5 చోట్ల రీపోలింగ్‌ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రీపోలింగ్ జరపాలని రిటర్నింగ్ అధికారులను ఈసీ ఆదేశించింది. 
 
 
 
 
 
 రీపోలింగ్ జరిగే 5 కేంద్రాలు ఇవే..
  • నరసరావుపేట నియోజకవర్గం కేసరపల్లిలో 94వ నంబర్ పోలింగ్ బూత్
  • గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నల్లచెరువులోని 244వ నంబర్ పోలింగ్ కేంద్రం
  • కోవూరు మండలం పల్లెపాలెంలోని ఇసుకపల్లిలో 41వ పోలింగ్ బూత్
  • సూళ్లూరుపేట నియోజకవర్గం అటకానితిప్పలోని 197వ పోలింగ్ సెంటర్
  • ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం కలనూతలలో 247వ పోలింగ్ బూత్
 
ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల పోలింగ్‌లో ఈ ఐదు కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఆ జిల్లాల కలెక్టర్లు రీపోలింగ్ జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం.. కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం విజ్ఞప్తిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం రీపోలింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఏపీ ఎన్నికల సంఘం ఈ చోట్ల రీపోలింగ్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. 
Link to comment
Share on other sites

కేంద్ర ఎన్నికల కమిషన్‌కు మరోసారి చంద్రబాబు లేఖ 
01-05-2019 18:16:50
 
636923314129550551.jpg
అమరావతి: కేంద్ర ఎన్నికల కమిషన్‌కు మరోసారి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. 4 జిల్లాల్లో ఎన్నికల నియమావళి మినహాయింపు ఇవ్వాలని కోరారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టేందుకు.. ఎన్నికల నియమావళి నుంచి మినహాయింపు ఇవ్వాలని చంద్రబాబు కోరారు.
Link to comment
Share on other sites

వీవీప్యాట్ స్లిప్పులే అంతిమం: ద్వివేది
01-05-2019 19:03:42
 
636923342249382391.jpg
అమరావతి: వీవీప్యాట్ కౌంటింగ్ కోసం ఈసీఐ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు చొప్పున వీవీప్యాట్లు లెక్కిస్తామని చెప్పారు. బుధవారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడిన ఈసీ.. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ పరిధిలో వేర్వేరుగా వీవీప్యాట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఈవీఎంల లెక్కింపు పూర్తయ్యాకే వీవీప్యాట్లను లెక్కిస్తామన్నారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో లాటరీ ద్వారా వీవీప్యాట్‌లను ఎంపిక చేస్తామన్నారు. ఆర్వో, అబ్జర్వర్ల సమక్షంలోనే వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈవీఎం ఓట్లు, వీవీప్యాట్ స్లిప్పుల్లో తేడా వస్తే ఆ రెండూ మ్యాచ్‌ అయ్యే వరకు రీకౌంటింగ్ నిర్వహిస్తామన్నారు. ఈవీఎం-వీవీప్యాట్ల లెక్కలు సరిపోలకపోతే వీవీప్యాట్‌లో వచ్చిన ఓట్లనే లెక్కలోకి తీసుకుంటామని ద్వివేది స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...