Jump to content

Varanasi Development - PM Modi - Complete failure as MP


RKumar

Recommended Posts

నా ఇంట్లోనూ సోదాలు చేయొచ్చు!

నేను తప్పు చేసినా వదలొద్దు
చట్టం అందరికీ సమానమే
  ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ
జబల్‌పుర్‌/ముంబయి

26ap-main7a_2.jpg

తాను ఏమైనా తప్పు చేశానని భావిస్తే తన ఇంట్లోనూ సోదాలు చేయవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చట్టం అందరికీ సమానమేనని చెప్పారు. రాజకీయ దురుద్దేశాలతోనే ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై ఆదాయపు పన్ను విభాగంతో దాడులు చేయిస్తున్నారన్న విమర్శలకు సమాధానంగా ఈ వ్యాఖ్య చేశారు. శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని సిద్ధి, జబల్‌పుర్‌లతో పాటు ముంబయిలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగిస్తూ ‘‘మా ఇళ్లల్లోనే ఎందుకు సోదాలు చేయిస్తున్నారని వారంతా గగ్గోలు పెడుతున్నారు. తప్పు చేశారు కాబట్టే సోదాలు జరుగుతున్నాయి. ఒక వేళ మోదీయే అలాంటి తప్పు చేసి ఉంటే అతన్నీ విడిచిపెట్టకూడదు. అతని ఇంటినీ సోదా చేయాల్సిందే’’ అని అన్నారు. ఎవరిపై దాడులు జరిగాయన్నది ముఖ్యం కాదని, వారి దగ్గర అంత డబ్బు ఎందుకు ఉన్నదన్నదే ప్రధానమని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో పిల్లల పౌష్టికాహారం కోసం కేంద్రం కేటాయించిన నిధులను ఎన్నికల కోసం దిల్లీలోని రాహుల్‌ గాంధీ ఇంటికి తరలించారని ఆరోపించారు. కాంగ్రెస్‌ నాయకులు తమ అక్రమార్జనను స్థిరాస్తి రంగంలో పెట్టారని, నోట్ల రద్దు కారణంగా వారికి నష్టం కలగడంతో ప్రస్తుతం తనపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. నల్లధనం సరఫరా చేస్తున్న మూడు లక్షల డొల్ల కంపెనీలను మూసివేశామని, ఇది కూడా కాంగ్రెస్‌ వారికి కష్టం కలిగించిందని తెలిపారు. ప్రధాని పదవిపై ప్రతిపక్ష నేతలు చాలా మంది కలలు కంటున్నారని, అప్పుడే టైలర్లను పిలిచి కొత్త దుస్తులకు కొలతలు ఇచ్చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి 50 సీట్లు కూడా రావని అన్నారు. తమ ప్రభుత్వం కృషి కారణంగానే టెలిఫోన్‌ ఛార్జీలు ప్రపంచంలోనే అతి తక్కువగా ఉన్నాయని అన్నారు.

రాహుల్‌కు పోటీగా ‘చౌకీదార్‌’ నినాదాలు
కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన ప్రసంగాల్లో ‘చౌకీదార్‌’ అని చెబుతుంటే ప్రజల నుంచి ‘చోర్‌ హై’ (దొంగ) అన్న స్పందన వస్తోంది. దానికి పోటీగా మోదీ కూడా అందరూ చౌకీదార్లే అన్న అర్థం వచ్చే రీతిలో ప్రజలతో నినాదాలు ఇప్పించారు.

హాజరైన ముఖేశ్‌ అంబానీ తనయుడు
ముంబయి నగర శివారులోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ఈ సమావేశానికి ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్‌ అంబానీ తనయుడు అనంత్‌ హాజరయ్యారు. ఆయన మొదటి వరుసలో కూర్చొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ ‘‘మోదీ ప్రసంగం వినడానికి వచ్చాను. దేశానికి మద్దతిస్తాను’’ అని చెప్పారు. ఇటీవల ముఖేశ్‌ అంబానీ దక్షిణ ముంబయి నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి మిళింద్‌ దేవరాకు మద్దతివ్వడం గమనార్హం.

ఇప్పుడు దాడి ఈవీఎంలపై..

దిల్లీ: ఇంతవరకు తనపై విమర్శల దాడి చేస్తున్న విపక్షాలు ఇప్పుడు ఈవీఎంలపై దాడి చేస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మోదీని విమర్శించడంలోనే ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయని చెప్పారు. ఒకప్పుడు రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు జరగాలని, విదేశీయులను పంపించాలని డిమాండు చేసిన మమతా బెనర్జీ ఇప్పుడు పూర్తిగా తన వైఖరిని మార్చుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని చెప్పారు. ప్రస్తుత ఎన్నికల్లో ధరల పెరుగుదల ఓ అంశం కాలేదని అన్నారు.
Link to comment
Share on other sites

  • Replies 61
  • Created
  • Last Reply

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...