Ramesh39 Posted February 22, 2019 Share Posted February 22, 2019 ‘మహానాయకుడు’పై సినీ ప్రముఖుల స్పందన హైదరాబాద్: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘యన్‌టిఆర్: మహానాయకుడు’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘యన్‌టిఆర్’ టైటిల్‌తో ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మొదటి భాగమైన ‘కథానాయకుడు’ జనవరిలో విడుదలై మంచి ప్రేక్షకులను అలరించింది. ఈ రోజు విడుదలైన ‘మహానాయకుడు’ చిత్రంపై నందమూరి బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణితో పాటు పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల ద్వారా వెలిబుచ్చారు. ‘రానా దగ్గుబాటి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. బాలయ్యకు వందకు 110 మార్కులు వేస్తాను. ఈ సినిమా అద్భుతంగా ఉందని చెప్పడానికి విద్యాబాలన్ మరో కారణం’- నాగ్ అశ్విన్ (మహానటి దర్శకుడు) ‘భావోద్వేగాలతో నిండిన పవర్ఫుల్ చిత్రం ‘మహానాయకుడు’. తెలుగువారి గర్వకారణమైన తాతగారి పాత్రలో గొప్పగా నటించినందుకు నాన్నకు శుభాకాంక్షలు. సినిమాలోని అందరి ప్రదర్శనలు చూసి చాలా ఎంజాయ్ చేశాను’- బ్రాహ్మణి ‘తెలుగోడి ఆత్మ గౌరవం. ఆ మహానుభావుడికి ఈ గౌరవం దక్కాల్సిందే. ఈ అద్భుతమైన సినిమాను తీయడం క్రిష్‌కు తప్ప మరెవ్వరికీ సాధ్యం కాదు. మీరూ ఈ అద్భుత చిత్రాన్ని చూడండి’- స్మిత (గాయని) ‘మహానాయకుడు సినిమా చూశాను. నందమూరి బాలకృష్ణ అద్భుతంగా నటించారు. ఎన్టీఆర్లోని కోపాన్ని, ఆయన పడిన బాధను కళ్లకు కట్టినట్లు చూపించారు. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్’- అనిల్ రావిపూడి (దర్శకుడు) Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.