sonykongara Posted October 6, 2018 Share Posted October 6, 2018 కేసీఆర్ గుట్టు విప్పిన చంద్రబాబు06-10-2018 19:51:18 అమరావతి: కేసీఆర్‌కు స్నేహ హస్తం అందించినా కలిసిరాలేదని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చంద్రబాబు పలు విషయాలు సుదీర్ఘంగా చర్చించారు. ఇద్దరం కలుద్దామని కేసీఆర్‌తో చెప్పానన్నారు. దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాలదే పైచేయి ఉండాలని కేసీఆర్‌కు చెబితే.. కేసీఆర్ ఆలోచించి చెబుతానన్నారు. వారం తర్వాత కుదరదని కేసీఆర్ బదులిచ్చారని గుర్తుచేశారు. టీడీపీని ఒంటరిగా పోటీచేయించమని, కాంగ్రెస్‌తో పొత్తు వద్దని కేసీఆర్ అన్నారని తెలిపారు. అప్పటికే కేసీఆర్ వేరేవాళ్ల చేతుల్లోకి వెళ్లాడని అర్ధమైందన్నారు. 2014లో ఎన్నికల ముందే ఏపీలో జగన్, తెలంగాణలో టీఆర్ఎస్ వస్తుందని కేసీఆర్ చెప్పారన్నారు. దీనిని బట్టి అర్థమైంది ఏంటంటే ఏపీలో జగన్ వస్తే తానే సమర్ధుడిగా చలామణి కావొచ్చని కేసీఆర్ ఆశించారన్నారు. కానీ ఏపీ ప్రజలు కేసీఆర్ ఆశలను తారుమారు చేశారన్నారు. బీజేపీ, వైసీపీ రహస్య పొత్తుపై మీడియాలో కథనాలు వస్తున్నాయన్నారు. బీజేపీకి 15 సీట్లు వదులుకునేందుకు జగన్ సిద్ధమయ్యాడని తెలుస్తుందన్నారు. గుంటూరులో కన్నాకు లాభం చేసేందుకే అప్పిరెడ్డిని తప్పించారని సమాచారం ఉందన్నారు. వైసీపీ అడుగడుగునా అభివృద్ధికి అడ్డుపడుతోందన్నారు. ఏపీకి చంద్రబాబు, వెంకయ్య ఉన్నారని మోదీనే చెప్పారన్నారు. మోదీ అన్నమాటలు ఆయన నైజానికి నిదర్శనమన్నారు. నమ్మిన బీజేపీ ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఇక జాతీయస్థాయిలో కొత్త పొత్తులు మినహా మరో మార్గం లేదన్నారు. వైసీపీ కుట్రలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. Link to comment Share on other sites More sharing options...
sagar_tdp Posted October 6, 2018 Share Posted October 6, 2018 Ee vishyam bob garki thappa andharki 2014 lone ardham ayyindhi Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.