Jump to content

దక్షిణాది సమరం!


Recommended Posts

  • లెక్కల ప్రకారం పంపిణీ
  •  తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు
  •  గొంతు కలిపిన కర్ణాటక, కేరళ
  •  దక్షిణాది భేటీకి కేరళ పిలుపు
  •  సంసిద్ధత వ్యక్తం చేసిన రాష్ట్రాలు
  • పన్నుల పంపకంలో కేంద్రం వివక్ష
తిరువనంతపురం, మార్చి 23: ఇప్పటిదాకా దక్షిణాదిపై వివక్ష గురించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడులు మాత్రమే పోరాడుతూ వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా కేరళ కూడా గొంతు కలుపుతోంది. కేరళ ఆర్థిక మంత్రి థామస్‌ ఇస్సాక్‌ దక్షిణాది రాష్ట్రాల ఆదాయాన్ని.. అభివృద్ధి అవసరాల పేరుతో ఉత్తరాది రాష్ట్రాలకు మళ్లించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఇదే అంశంపై ఏప్రిల్‌ 10న తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక శాఖ కార్యదర్శులకు లేఖలు రాశానని, అందరూ సమావేశానికి వస్తామని ఫోన్లో చెప్పారన్నారు. రాష్ట్రాలకు నిధుల పంపిణీకి 1971 జనాభా లెక్కలకు బదులు 2011 లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని పదిహేనో ఆర్థిక సంఘానికి కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసినప్పటి నుంచి దక్షిణాది రాష్ట్రాలు ఆగ్రహంతో ఉన్నాయి. జనాభా నియంత్రణను పాటించి అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రాలకు శాపంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉండటం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి.
 
 
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో అవి తమ అభ్యంతరాలను గట్టిగానే చెప్పాయి. ‘‘కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేయడమే మా పాపమా?’’ అని థామస్‌ ఇస్సాక్‌ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ సిఫార్సును గట్టిగా వ్యతిరేకించాలని ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ట్వీట్‌ చేశారు. సిద్దరామయ్య ట్వీట్‌ వెలువడిన గంటల్లోనే కేరళ నుంచి సంఘీభావ ప్రకటన వచ్చింది. తొలి నిరసన వ్యక్తం చేసింది మాత్రం ఏపీ సీఎం చంద్రబాబే. కేంద్రం డబ్బులు, రాష్ట్రం డబ్బులు అంటూ ఉండవని, అన్నీ పన్ను చెల్లింపుదారు డబ్బులేనని అన్నారు. దీనికి కర్ణాటక సీఎం సిద్దరామయ్య మద్దతు పలుకుతూ, ‘‘కేంద్రానికి వచ్చే పన్నుల్లో 9.56 శాతం కర్ణాటక నుంచే అందుతున్నాయి. అందులో కేవలం 4.5 శాతమే తిరిగి రాష్ట్రానికి అందుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది’’ అన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...