Jump to content

Pileru rajakiyam


sonykongara

Recommended Posts

విఫలమైన పెద్దిరెడ్డి ప్రయత్నం
11-12-2017 11:20:53
 
636485883450471971.jpg
  • విఫలమైన పెద్దిరెడ్డి ప్రయత్నం
  • టీడీపీలోనే ఉంటానని జీవీ స్పష్టీకరణ
  • పీలేరులో వైసీపీకి గట్టిదెబ్బ
  • రాజంపేట లోక్‌సభపైనా ప్రభావం
అవకాశం వచ్చినప్పుడు ఎమ్మెల్సీ పదవి కాంట్రాక్టు పనుల్లో పోటీలేకుండా చూస్తాం. ఇదీ.. జీవీ శ్రీనాథరెడ్డిని పార్టీలోకి చేర్చుకోవడానికి వైసీపీ ఆఫర్‌ చేసిన ‘ఆకర్ష’ణీయ ప్యాకేజీ. వైసీపీ చేపట్టిన ‘ఆపరేషన్‌ ఆకర్ష’ వికటించింది. పీలేరులో ‘పట్టు’ నిలుపుకోవడానికి.. రాజంపేట లోక్‌సభపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఉండేందుకు పెద్దిరెడ్డి చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. ‘దేశం’ గూటి నుంచి జీవీ శ్రీనాథరెడ్డిని ‘ఫ్యాను’ కిందకు రప్పించే వ్యూహం బెడిసి కొట్టింది. తాను ‘సైకిల్‌’ దిగేది లేదని జీవీ తేల్చిచెప్పేశారు.
 
ఆంధ్రజ్యోతి, తిరుపతి: వైసీపీకి ఆదిలోనే హంసపాదు ఎదురయ్యింది.పశ్చిమ నియోజకవర్గాల్లో బలంపుంజుకొం టున్న తెలుగుదేశం పార్టీని అడ్డుకోవడానికి చేసిన ప్రయ త్నం బెడిసికొట్టింది. పట్టుజారిపోతున్న పీలేరు నియోజకవర్గాన్ని తన చేతుల్లో పెట్టుకోవడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన ప్రయత్నం విఫలమయ్యింది.నల్లారి కిశోర్‌ చేరికతో బలపడిన తెలుగుదేశం పార్టీని.. జీవీ శ్రీనాథ రెడ్డిని ఆకర్షించడం ద్వారా బలహీనరచాలని వైసీపీ చేసిన ఆపరేషన్‌ ఆకర్ష వికర్షించింది. దశాబ్దాల శత్రుత్వాని పక్కన పెట్టి పీలేరులో కొత్త పట్టుకోసం పెద్దిరెడ్డి ఒక మెట్టు కిందకు దిగినా..ఫలితం లేకపోయింది.
 
 
పశ్చిమాన పట్టు తప్పుతున్న వైసీపీ
మొన్నటి ఎన్నికల్లో జిల్లాలోని పశ్చిమ నియోజక వర్గాల్లో వైసీపీ మెజారిటీ సీట్లను గెలుచుకుంది. పుంగనూరు, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాలతో పాటు రాజంపేట పార్లమెంట్‌ స్థానాన్నీ గెలుచుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన పట్టు నిరూపించుకున్నారు. పై మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ రాజంపేట ఎంపీగా పోటీ చేసిన మిథున్‌రెడ్డి గెలుపునకు దోహదపడ్డాయి. క్రమంగా పశ్చిమ నియోజకవర్గాల్లో ఆ పట్టు జారుతోంది. ఈ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పుంగనూరు మినహా మిగిలిన రెండు చోట్లా టీడీపీ గణనీయంగా బలపడుతోంది. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తమ్ముడు కిశోర్‌కుమార్‌రెడ్డి టీడీపీలో చేరడంతో పీలేరు రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఈ నియోజకవర్గంలో నల్లారి కుటుంబానికి బలమైన వర్గం ఉంది. ఈయన చేరికతో పీలేరులో తెలుగుదేశం పార్టీ గణనీయంగా బలం పుంజుకుంది.
 
పీలేరు నియోజకవర్గం పరిధిలోని టీడీపీ సంప్రదాయ ఓటర్లు, నల్లారి కుటుంబ అభిమానులు కలిసిన నేపథ్యంలో వైసీపీ గెలుపు అవకాశాలు బలహీనపడినట్లే. ఈ లోటును పూడ్చకుంటే ఆ ప్రభావం తన కుమారుడు మిథున్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న రాజంపేట లోక్‌సభ స్థానంపైనా పడుతుందనే ఉద్దేశ్యంతో పెద్దిరెడ్డి రంగంలోకి దిగారు. తనను మాట మాత్రం కూడా సంప్రదించకుండా కిశోర్‌ను పార్టీలోకి చేర్చుకున్నారని అలకబూనిన టీడీపీ నేత జీవీ శ్రీనాథరెడ్డిని వైసీపీలోకి ఆకర్షించడానికి ప్రయత్నించారు.
 
 
ఆదిలోనే హంసపాదు
గడచిన మూడేళ్లలో జిల్లా నుంచి వైసీపీ నుంచి కీలకమైన నేతలు టీడీపీలో చేరిపోయారు. టీడీపీ నుంచి మా త్రం ఒక్కరు కూడా వైసీపీలోకి చేరలేదు. తొలిసారిగా జీవీ శ్రీనాథరెడ్డితో ‘ఆపరేషన్‌ ఆకర్ష’ను వైసీపీ మొదలు పెట్టింది.జనవరి నెలాఖరులో వైసీపీ అధినేత జగన్‌ జిల్లాలో పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ సందర్భంగా జగన్‌ సమక్షంలో జీవీ శ్రీనాథరెడ్డిని వైసీపీలోకి ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలోనే జీవీతో సంధి ప్రయత్నాలు జరిగాయి.ఎమ్మెల్సీ పదవితో పాటు కాంట్రాక్టుల వరకు రకరకాల ప్రలోభాలు రుచి చూపించారు. అయితే తాను తెలుగుదేశంలోనే కొనసాగుతానని తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో శ్రీనాథరెడ్డి ప్రకటించడంతో వైసీపీ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. లాభం కోసం ప్రయత్నించిన ఆ పార్టీకి చివరికి ఖేదమే మిగిలింది.
 
 
పీలేరు.. రాజంపేట ఫలితాలపై ప్రభావం
పీలేరులో టీడీపీ వర్గాలు, నల్లారి కుటుంబ అభిమానులు కలిసి పనిచేస్తే టీడీపీ విజయం నల్లేరు మీద నడకే అవుతుంది. ఈ ప్రమాదాన్ని గమనించే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ కోసం, రాజంపేట నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న తన కుమారుడు మిథున్‌రెడ్డి కోసం పాత వైరాన్ని పక్కన పెట్టి శ్రీనాథరెడ్డి ఇంటికెళ్లి పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు. అందుకు ప్రతిగా తాయిలాలు ఆశచూపారు. ఈ ప్రయత్నం విఫలమయ్యింది. దీంతో రాబోయే ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు మరోలా ఉండబోతాయనే విషయం స్పష్టమవుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అదే జరిగితే ఈ ప్రభావం మిథున్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న రాజంపేట పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలపైనా ప్రభావం చూపుతాయనడంలో సందేహం లేదు.
 
 
గత ఎన్నికల్లో పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వైసీపీకి 15,400 ఓట్ల మెజారిటీ వచ్చింది. అదే రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మిథున్‌రెడ్డికి ఇక్కడ 30 వేలకు పైగా మెజారిటీ వచ్చింది. పీలేరులో టీడీపీ బలపడిన క్రమంలో రాబోయే ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థులు మైనస్‌ ఓట్లలోకి వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర తరఫున పీలేరులో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి కిశోర్‌కుమార్‌రెడ్డికి 56 వేలకుపైగా.. పార్లమెంట్‌ అభ్యర్థి ముజీబ్‌కు 50 వేల ఓట్లు రావడం గమనార్హం.
 
 
జీవీ వస్తారని..!
మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథరెడ్డి తమ పార్టీలోకి వస్తారని భావించి వైసీపీ నాయకులు ఆదివారం ఆయన్ను కలిశారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన వైసీపీ శ్రేణులు శ్రీనాథరెడ్డి ఇంటికి చేరుకుని పూలమాలలు, శాలువలతో సత్కరించారు. కేకులను తీసుకొచ్చి జీవీ చేతుల మీదుగా కట్‌ చేయించారు. ఇలా.. పీలేరు ఎంపీపీ హరిత, మాజీ ఎంపీపీ వెంకటరమణారెడ్డి, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు బీడీ నారాయణరెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ కంభం సతీష్‌కుమార్‌రెడ్డి, మండల కోఆప్షన్‌ సభ్యుడు హబీబ్‌బాషా, ఎంపీటీసీ భానుప్రకాష్‌రెడ్డి, నాయకులు స్టాంపుల మస్తాన్‌, పెద్దోడు, అల్లాబక్షు, ఆనంద, ఉదయ్‌, చిన్న, మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మిగిలిన మండలాల నుంచీ వైసీపీ శ్రేణులు వచ్చిన జీవీని కలిశారు. తాను టీడీపీలోనే ఉంటానని సాయంత్రం తిరుపతిలో శ్రీనాథరెడ్డి ప్రకటించడంతో వీరంతా షాక్‌ తిన్నారు
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...