Jump to content

Nice one


murali@nbkfan

Recommended Posts

“పొరుగింటి పుల్ల కూర ఎప్పుడూ రుచిగానే ఉంటుంది” అనే సామెత కి ఏ రంగమైనా సరే తీసిపోదు… హిందీ హీరోలు, తమిళ హీరోలు చేస్తే ఆహా ఓహో అంటూ కితాబు లిచ్చే సదరు మన తెలుగు సినీ మేధావులు, ఈ తరంలో తెలుగు లో అంత గొప్ప ‘మహా నటులు’ లేరు అంటూ పెదవి విరుస్తారు.నిజంగా మన తెలుగులో అంత గొప్ప నటులు లేరా అంటే.. ఉన్నాడు అంటూ ప్రతి తెలుగు వాడు జబ్బ చరిచి గర్వంగా చెప్పుకోవలసిన పేరు ఎన్టీఆర్ అవును జూనియర్ ఎన్టీఆర్. “అదిగో అదిగో చప్పట్లు..అవే కదా ఆకలి గొన్న నటుడికి పంచ భక్ష పరమాన్నాలు” అన్నాడు ఒక కవి, అవును నిజంగా ఒక నటుడి కి కావలసింది డబ్బు హోదా కానే కాదు..కావలసింది తన నటనకి ప్రేక్షకులు ఇచ్చే మెచ్చుకోలు. ఆ మెచ్చుకోలు కోసమే జనతా గ్యారేజ్ వంటి కెరీర్ బెస్ట్ హిట్ పడ్డాక, కథ కోసం మూడు నాలుగు నెలలు వేచి వేచి, బాబీ చెప్పిన మూడు పాత్రలు “జై లవ కుశ ” నచ్చి, తనను అభిమానించే తెలుగు సినీ అభిమానుల కోసం, ఒకే రోజు మూడు పాత్రలు.. 70 కి మించిన సార్లు బట్టలు మార్చుకొని.. ఆ చప్పట్ల కోసం ఆకలి గొన్న నిజమైన కళామతల్లి ముద్దు బిడ్డడిగా కష్టపడ్డాడు.

 

–> ఒక పాత్రకి నత్తి.. ఆ పాత్రకు విలనిజం కూడా అద్దారు.. కళ్ళల్లో క్రూర ఛాయలు.. నత్తి తో కూడిన డైలాగులు.. కొట్టండిరా చప్పట్లు..

–> రాముడు మంచి బాలుడు అంటే ఎలా ఉంటాడు అనే దానికి మన “లవుడు” ఎంతో మందికి ఉదాహరణ గా మిగుల్తాడు అనే దానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు..

–> నవ్వించే కుశుడు మరొక వైపు..

–> వీరంతా ఒకే ఫ్రేములో ఉన్నపుడు రెండు కళ్ళు చాలవు ఆ నట కౌశలాన్ని చూసేందుకు..

అరే ఓ కథా రచయితలూ.. మీ పెన్నులకి పదును పెట్టండి.. ఏ పాత్రైనా సరే.. ఎంతటి నటనైనా సరే..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...