Jump to content

Acharya Nagarjuna University


Recommended Posts

క్రీడల హబ్‌గా ఏఎన్‌యూ
08-05-2017 10:35:01
636298365222357256.jpg
ఎన్నో జాతీయ క్రీడలను సమర్ధంగా నిర్వహించిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నవ్యాంధ్రలో క్రీడలకు హబ్‌గా మారింది. ఏపీ పీసెట్‌ను అప్రతిహతంగా15వసారి నిర్వహిస్తూ పేరుగడిస్తోంది. ఇక్కడ క్రీడల నిర్వహణకు, మౌలిక వసతుల కల్పనకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.27.60 కోట్ల నిధులు మంజూరు చేసింది. రానున్న రోజుల్లో ఏఎనయూ... క్రీడల నిర్వహణ, వ్యాయామ విద్యలో రాష్ర్టానికే వన్నె తీసుకురానుంది.
  • రూ.27.60 కోట్లతో క్రీడా సదుపాయాలు
  • అంతర్జాతీయ ప్రమాణాలతో సింథటిక్‌ ట్రాక్‌
  • జాతీయ, అంతర్జాతీయ క్రీడల నిర్వహణ
  • నవ్యాంధ్రలో క్రీడా వర్సిటీగా ఏఎనయూ
  • 15వ సారి ఏపీ పీసెట్‌ నిర్వహణకు సంసిద్ధం
  • నేటి నుంచి పీసెట్‌
అమరావతి: నవ్యాంధ్రలో క్రీడల నిర్వహణ, వ్యాయామ విద్యలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ముందంజలో ఉంది. ఎన్నో జాతీయ క్రీడలను సమర్ధంగా జరుపుతూ.. ఏపీ పీసెట్‌కు 15వసారి నిర్వహిస్తూ, క్రీడల హబ్‌గా నిలుస్తోంది. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు వర్సిటీ క్రీడా ప్రాంగణం సన్నద్దమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతి సదుపాయాలు కల్పించడానికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి రూ.27.60 కోట్ల నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం రూ.10 కోట్లతో 200 పడకల వసతి గృహ నిర్మాణం జరుగుతోంది. మల్టీ జిమ్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ సెంటర్‌ను రూ.కోటితో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వర్సిటీలో రూ.2.40 కోట్లతో ఫిట్‌నెస్‌ సెంటర్‌ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. గ తంలో రూ.5 కోట్లతో క్రీడా వసతి గృహం నిర్మించారు. ఇండోర్‌ గేమ్‌ల నిర్వహణకు అనువుగా లంకపల్లి బుల్లయ్య ఇండోర్‌ స్టేడియం, జిమ్‌ సెంటర్‌, శాండ్‌ ట్రాక్‌, సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌తో పాటు సువిశాలమైన, దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో క్రీడా మైదానం వర్సిటీలో ఉన్నాయి.
 
అద్భుతంగా సింథటిక్‌ ట్రాక్‌
కేంద్ర యువజనుల, క్రీడల వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ సింథటిక్‌ ట్రాక్‌ నిర్మాణానికి రూ.5.5 కోట్లు నిధులు మంజూరు చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాపోటీల నిర్వహణకు వీలుగా ఉన్నత ప్రమాణాలతో క్రీడా మైదానంలో సింథటిక్‌ ట్రాక్‌ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ట్రాక్‌ ఇరువైపులా, అంతర్జాతీయ స్థాయిలో ఫ్లడ్‌ లైట్ల నిర్మాణానికి రూ.8.60 కోట్ల నిధులు మంజూరయ్యాయి. 4 టవర్‌లను ఏర్పాటు చేసి, ఒక్కో టవర్‌కు 102 ఫ్లడ్‌ లైట్లు, అమర్చనున్నారు. వార్మ్‌ ఆఫ్‌ సింథటిక్‌ ట్రాక్‌కు రూ.8 కోట్లతో చేపట్టనున్నారు. రూ.40 మీటర్లతో 6 లైన్ల నిర్మాణం జరుగనుంది.
నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ (ఎన్‌బీసీసీ) సంస్థ నిర్మాణ బాధ్యతలను చేపట్టింది. 400 మీటర్ల పరిధిలో ట్రాక్‌ ఏర్పాటు, దానికి అనుగుణంగా మురుగు, నిల్వ నీరు లేకుండా వుండేందుకు ప్రత్యేకంగా డ్రెయిన్‌ సదుపాయం కల్పించారు. ట్రాక్‌ నిర్మాణంలో రెండు రకాలైన మెటీరియల్‌ను వినియోగించారు. ఫుల్‌ పియుఆర్‌, శాండ్‌విచ్‌ వంటి మెటీరియల్‌ను జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు.
 
400 మీటర్ల పరిధి....
సింథటిక్‌ ట్రాక్‌ నిర్మాణ పరిధిని సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. ట్రాక్‌పై ఒకేసారి 8 మంది పరుగెత్తేలా నిర్మిస్తున్నారు. ట్రాక్‌ మధ్యలో 22 క్రీడల నిర్వహణకు అనువుగా ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా పచ్చని గడ్డి, లాన్‌తో ఏర్పాటు జరుగుతోంది. షాట్‌పుట్‌, ఫుడ్‌బాల్‌, హాకీ, లాంగ్‌జంప్‌ వంటి క్రీడలు నిర్వహించవచ్చు. 400 మీటర్ల ట్రాక్‌ తోపాటు అదనంగా 100 మీటర్ల లైను, ట్రాక్‌ ఇరువైపులా హైజంప్‌, పోల్‌వాలెట్‌, జావలిన్‌త్రో, రెండు లాంగ్‌ జంప్‌ రన్‌వే, తదితర క్రీడా సదుపాయాలకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
 
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీ పీసెట్‌ - 2017) జరగనుంది. 17వ తేదీ వరకు దేహదారుఢ్య, క్రీడల నైపుణ్య పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పీ సెట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ పి.జాన్సన్‌ తెలిపారు. పరీక్షలకు 4,649 మంది అభ్యర్థులు హాజరవుతున్నారన్నారు. ఈనెల 8 నుంచి 15 వరకు పురుష అభ్యర్థులకు 16, 17ల్లో మహిళా అభ్యర్థులకు పరీక్షలు జరుగుతాయన్నారు. బీపీఈడీ కోర్సుకు 2,400, యూజీడీ పీఈడీకి 2,249 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. తొలిరోజు హాల్‌టికెట్‌ నంబరు 1701 నుంచి 17,456 వరకు మొత్తం 456 మంది పురుష అభ్యర్థులకు పరీక్షలు జరుగుతాయన్నారు.
 
విజయవంతంగా క్రీడా పోటీలు
ఏఎనయూలో ఆలిండియా ఇంటర్‌ వర్సిటీ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలను 2004, 2011 సంవత్సరాల్లో నిర్వహించారు. మరోసారి ఈ ఏడాది డిసెంబర్‌లో పోటీలు నిర్వహించనున్నారు. నూతనంగా నిర్మించిన సింథటిక్‌ ట్రాక్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఏడాది జూన్‌ 12 నుంచి 15 వరకు జాతీయ, అంతరాష్ట్ర సీనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌, నవంబర్‌ 1 నుంచి 5 వరకు జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలను వర్సిటీలో జరగనున్నాయి.
Link to comment
Share on other sites

Guest Urban Legend

chaala fast ga synthetic track and flood lights pettesaru ga :super:

 

e roju national level athletics vunnai

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 4 weeks later...
  • 3 weeks later...
  • 8 months later...
  • 2 months later...
  • 1 month later...
అంతర్జాతీయ సదస్సుకు సిద్ధం
22-11-2018 09:32:23
 
636784759449867865.jpg
  • నేటి నుంచి వ్యర్థపదార్థాల నిర్వహణ పద్ధతులపై సదస్సు
  • ముస్తాబైన వర్సిటీ ప్రాంగణం
  • హాజరుకానున్న ప్రముఖులు
ఏఎన్‌యూ: ఆచార్య నాగా ర్జున విశ్వవిద్యాలయం వేదికగా వ్యర్థప దార్థాల నిర్వహణ పద్ధతులపై గురువారం నుంచి మూడు రోజుల పాటు జరుగనున్న అంతర్జాతీయ సదస్సుకు వర్సిటీ ముస్తా బైంది. డైక్‌మెన్‌ ఆడిటోరియంలో జరిగే సెష న్స్‌కు పూర్తి ఏర్పాట్లు చేపట్టారు. ప్రధాన వేదికతోపాటు సెమినార్‌ హాలులో ఒకే పర్యా యం చర్చలు జరిగేలా చర్యలు తీసుకు న్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో హాజరయ్యే ప్రముఖులు, నిపుణులను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేశారు. సుంద రీకరణలో భాగంగా వర్సిటీ ప్రాంగణంలోని రోడ్లపై మార్గంచూపే జీబ్రాగీతలు వేశారు. ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లకు వివిధ అంశాలను ప్రతిబింబించే విధంగా పెయింటింగ్స్‌ వేస్తున్నారు. డైక్‌మెన్‌ ఆడిటోరియం ఎదుట స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. హెర్బల్స్‌ గార్డెన్స్‌లో భోజన సదుపాయాలకు ఏర్పాట్లు చేశారు.
 
సదస్సులో ప్రధానంగా ...
  • ఘన పదార్థాల నిర్వహణ వ్యవస్థకు సంబంధించి నగర పాలక సంస్థలు, పరిశ్రమలు, సర్వీసు ప్రొవైడర్లతో పరస్పర చర్చ...
  • ప్రపంచంలో వేర్వేరు ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ ఉత్తమ అభ్యాసాల ప్రజెంటేషన్‌
  • రాష్ట్రంలో పర్యాటక రంగం ప్రమోషన్ 
  • వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన వివిధ రకాల యంత్రాలు, పరికరాల ప్రదర్శన తదితర అంశాలతోపాటు ఆర్థిక వ్యవస్థలో పరిశ్రమల నుంచి ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతులపై చర్చలు ఉంటాయి.
awdawdb.jpgసదస్సు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా శాసన సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు, మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, డాక్టర్‌ పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, నారా లోకేశ్‌, కొల్లు రవీంద్ర, నక్కా ఆనందబాబు, ప్రజాప్రతినిధులు, ఐఏఎస్‌ అధికారులు హాజరుకానున్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...