Jump to content

Chennai- Bangalore Expressway


Recommended Posts

  • 2 weeks later...
రయ్‌మని సాగిపోయేలా
బెంగళూరు-చెన్నై మధ్య  కొత్తగా ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం
గంటకు 120 కి.మీ.ల వేగంతో  ప్రయాణానికి అవకాశం
రెండు మహానగరాల మధ్య తగ్గనున్న 3 గంటల ప్రయాణం
రూ.20 వేల కోట్లతో 262 కి.మీ.ల పొడవున నిర్మితంకానున్న రహదారి
చిత్తూరు జిల్లాలో 92 కి.మీ.
జిల్లా ప్రగతికి దోహదమయ్యే అవకాశం
వచ్చే ఏప్రిల్‌ నుంచి నిర్మాణం మొదలు
ఈనాడు డిజిటల్‌ - చిత్తూరు
14ap-main13a.jpg

దక్షిణ భారతదేశంలో మహానగరాలైన బెంగళూరు, చెన్నైలను కలుపుతూ మరో కొత్త రహదారి నిర్మాణం కానుంది. ‘చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ వే’ పేరిట దీనిని కేంద్రం రూ.20 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనుంది. ఈ మార్గం బెంగళూరు సమీప హోస్కోట్‌ నుంచి తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌ వరకు 262 కి.మీలు ప్రయాణించనుంది. బెంగళూరు సమీప హోస్కోట్‌ నుంచి తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌ వరకు సాగే ఈ రహదారి నిర్మాణం ఏపీలోని చిత్తూరు జిల్లాలోనూ 92కి.మీ.లు నిర్మితం కానుంది. దీంతో ఈ ఎక్స్‌ప్రెస్‌ వే మూడు రాష్ట్రాలకు అనుసంధానంగా మారుతోంది. ప్రస్తుతం రెండు నగరాల మధ్య రెండు జాతీయ రహదారులు(1.ఎన్‌హెచ్‌-4; 2.కృష్ణగిరి- కాంచీపురం మార్గం)ఉండగా ఈ మార్గంలో దేశంలోనే అధికంగా ట్రాఫిక్‌ ఉందని గుర్తించిన కేంద్రం తాజా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఇప్పటికే మొత్తం 2800 హెక్టార్ల భూమిని సేకరించారు. పచ్చని వాతావరణం మధ్యలో (గ్రీన్‌ఫీల్డ్‌ వే) రోడ్డు నిర్మాణం కానుండడం దీని ప్రత్యేకత. మన ప్రాంతంలో పర్యావరణ, అటవీ అనుమతులు పొందిన వెంటనే పనులు ప్రారంభించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ విభాగం సిద్ధంగా ఉంది. హైబ్రిడ్‌ యాన్యుటీ విధానం(హెచ్‌ఏఎం) ద్వారా నిర్మాణానికయ్యే మొత్తం నిధుల్ని ఒకేసారి గుత్తేదారుడికి ఇవ్వనున్నారు. చిత్తూరులో 7కి.మీలు, తమిళనాడు వేలూరు జిల్లాలో 300మీటర్లు అటవీ అనుమతులు రావాల్సి ఉంది.

చిత్తూరు అభివృద్ధికి బాటలు
మూడు రాష్ట్రాల్లోనూ ఈ రహదారి ప్రయాణించే ప్రాంతమంతా పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశముంది. బెంగళూరు, చెన్నై నగరాలు ఇప్పటికే పెద్దఎత్తున అభివృద్ధి చెందగా.. తాజాగా చిత్తూరు జిల్లా కూడా ఆ కోవలో చేరనుంది. జిల్లాలో బైరెడ్డిపల్లె మండలం వద్ద ఎగ్జిట్‌ పాయింట్‌ ఏర్పాటు చేయనుండగా.. జిల్లా కేంద్రం సమీప గుడిపాల, శ్రీనిధి ఫుడ్స్‌ వద్ద కూడా ఎగ్జిట్‌ పాయింట్లు ప్రతిపాదనలో ఉన్నాయి. బెంగళూరులో కాలుష్యం అధికం కావడం.. అక్కడ భూముల ధరలు విపరీతంగా ఉండడం.. వంటి కారణాలతో పారిశ్రామికవేత్తలు సమీప చిత్తూరు జిల్లాను పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఎంచుకుంటున్నారు. దీనికి తోడు రహదారుల అనుసంధానం అదనపు సౌకర్యంగా మారుతోంది. ఎగ్జిట్‌ పాయింట్‌ బైరెడ్డిపల్లెతో పాటు గంగవరం మండలంలోని గండ్రాజుపల్లెలోని పారిశ్రామికవాడకూ 10కి.మీల దూరంలో ఉంది. ఇక్కడి పారిశ్రామికవాడ రూపురేఖలు ఇప్పటికే మారిపోయాయి. దాదాపు 70-80కు పైగా పరిశ్రమలొచ్చాయి. శాంతిపురం మండలంలో రానున్న ‘ఎయిర్‌స్ట్రిప్‌’ కూడా ఈ ప్రాంతానికి దగ్గరవుతుంది.

14ap-main13b.jpg

మూడు భాగాలుగా నిర్మాణం
* మొదటి భాగం: కర్ణాటకలోని హోస్కోట్‌ నుంచి కోలార్‌లోని ఎన్జీ హుల్కుర్‌ వరకు 71కి.మీ.లు
* రెండో భాగం: ఎన్జీ హుల్కుర్‌ నుంచి చిత్తూరు జిల్లాలోని గుడిపాల మండలం రామాపురం వరకు 85కి.మీ.లు
* మూడో భాగం: రామాపురం నుంచి శ్రీపెరంబదూర్‌లోని ఇరుంగట్టు కోటై వరకు 106కి.మీ.లు
* ప్రస్తుత స్థితి: గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి కావడంతో పర్యావరణ, అటవీ అనుమతుల కోసం పెండింగ్‌.
* పూర్తి లక్ష్యం: 2019 మార్చిలో టెండర్లు పిలచి.. రెండేళ్లలో పూర్తిచేయడం.

14ap-main13c.jpg
Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 2 months later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...