Jump to content

‘త్వరలోనే టీఆర్ఎస్ పతనమయిపోతుంది’


3mar

Recommended Posts

‘త్వరలోనే టీఆర్ఎస్ పతనమయిపోతుంది’

14-04-2017 10:22:14

 

రామాయంపేట, మెదక్: కొద్దికాలంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వెన్నుపోటు తప్పదని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ పేర్కొన్నారు. కష్టకాలంలో పార్టీని నడిపిన ప్రస్తుత మంత్రి హరీశ్‌ను దూరం చేస్తూ.. కొడుకు, బిడ్డకు పగ్గాలు ఇస్తే ఎందుకు ఊరుకుంటాడు.. హరీశే తిరుగుబాటు మార్గం లో  సీఎం అయ్యే అవకాశం ఈ రెండేళ్లలో ఉందంటూ చెప్పుకొచ్చారు. రామాయంపేట నియోజక వర్గ సాధన, ఎండిన పంటకు పరిహారం, ఇతర ప్రజా సమస్యలపై బుధవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ధర్మారంలో మొదలై రామాయం పేట వరకు దాదాపు 8కిలోమీటర్లు నడుస్తు ఎండిన పం టలను పరిశీలిస్తూ రైతుల బాధలు తెలుసుకున్నారు. తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్న నేతలు ధర్నా చేపట్టారు. అంతకుముందు ధర్మారంలో పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం మాజీమంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడారు. కేసీఆర్‌ నియంత పాలన సాగిస్తూ మంత్రులను నోరు మెదపనివ్వక స్వేచ్ఛను హరిస్తున్నాడన్నారు. 2019 నాటికి కాంగ్రెస్‌ పార్టీకి బలం చేకూరుతుందన్నారు. టీఆర్‌ఎస్‌లో అసమ్మతి ఆజ్యం పోసుకునే పరిస్థితులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.

 

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన నాయకులు ప్రజా సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ విధానంతో తెలంగాణ రాష్ట్రం అనుకున్న లక్ష్యా న్ని చేరుకోలేకపోయిందంటూ విమర్శలు గుప్పించారు. మెదక్‌ మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ అధికార ప్రతినిధి పి.శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ డీ-లిమిటేషన్‌లో ఇదివరకు గల్లంతైన రామాయంపేటను చేర్చాల్సి ఉందన్నారు. కేంద్రం త్వరలోనే కొత్త నియోజకవర్గాల ప్రక్రియకు పూనుకున్న నేపథ్యంలో పట్టణాన్ని చేర్చి తీరాల్సిం దేనన్నారు. పాదయాత్రకు నాయకత్వం వహించిన కాంగ్రెస్‌ సేవాదళ్‌ జిల్లా చైర్మన్‌ అమరసేనారెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం ప్రజాసమస్యను తీర్చేదాకా పోరుబాట వీడమన్నారు. నియోజకవర్గ సాధనకు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో 80 కిలోమీటర్లు నడిచి రాజధానిలో ఉద్యమ సెగ చూపించి తీరుతామన్నారు. రాష్ట్ర, జిల్లానాయకులు పి.రమణ, ఆర్‌.పోచయ్య, ఎస్‌కె.హైమద్‌, హన్మంతరావ్‌, పిట్ల యాదగిరి, ఉడుత రాజేశం, సిద్దిరాంరెడ్డి, హాజీపాషా, బైరం కుమార్‌, వెంకట్‌తో పాటు వందలాది మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...