Jump to content

బాలకృష్ణ 101 చిత్రం షూటింగ్‌ ప్రారంభం


Ramesh39

Recommended Posts

బాలకృష్ణ 101 చిత్రం షూటింగ్‌ ప్రారంభం 

90317brk62a.jpg

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ,, పూరి జగన్నాథ్‌ కాంబినేషనల్లో తెరకెక్కనున్న చిత్రం గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. బాలకృష్ణకు ఇది 101వ చిత్రం కావడం విశేషం. హైదరాబాద్‌లో జరిగిన చిత్ర ప్రాంరభోత్సవ కార్యక్రమంలో బాలకృష్ణ, పూరి జగన్నాథ్‌, దర్శకులు క్రిష్‌, రాజమౌళి, బోయపాటి శ్రీను, ఎస్వీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నందమూరి రామకృష్ణ కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా.. తొలి సన్నివేశానికి రాజమౌళి క్లాప్‌ కొట్టారు. బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు.

‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విజయంతో ఉత్సాహంగా ఉన్న బాలకృష్ణ తర్వాత ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తారన్న వూహాగానాలకు కొద్దిరోజుల క్రితం పూరి జగన్నాథ్‌ తెరదించారు. బాలకృష్ణ 101 చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తానని.. మార్చి 9న చిత్రాన్ని ప్రారంభించి.. సెప్టెంబర్‌ 29న విడుదల చేస్తామని ప్రకటించారు.

90317brk62b.jpg

ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అవకాశమిది 

నందమూరి బాలకృష్ణతో సినిమా చేసేందుకు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని.. ఇప్పటికి ఆయనతో పనిచేసే అవకాశం వచ్చిందని దర్శకుడు పూరి జగన్నాథ్‌ అన్నారు. నందమూరి అభిమానులు బాలకృష్ణ నుంచి ఏ అంశాలు కోరుకుంటారో అలాగే చిత్రాన్ని తెరకెక్కిస్తామని పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...