Jump to content

ముంపు మళ్లింపు.. ఆపై వంపూ, సొంపు


swas

Recommended Posts

ముంపు మళ్లింపు.. ఆపై వంపూ, సొంపు 

జల ప్రయాణానికి వీలుగా కొండవీటి వాగుకు మార్పులు 

నదిలో నుంచి రాజధాని ప్రాంతం మీదుగా మళ్లీ నదిలోకి 

వాగు గట్లు పటిష్ఠం, సుందరీకరణ నది ఒడ్డున నాలుగు వరుసల రహదారి 

నదిలో ద్వీపాల సుందరీకరణ దృష్టి సారించిన సర్కారు 

ఈనాడు - హైదరాబాద్‌ 

031ap-main13a.jpg

ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని అమరావతిలో కొండవీటి వాగు వరదను నియంత్రించడంతో పాటు ఈ వాగును, కృష్ణా నదిని ఆలంబనగా చేసి సుందరీకరణ, పడవ ప్రయాణం, పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం తలపోస్తోంది. అమరావతి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇందుకు అవసరమైన కసరత్తు సాగుతోంది. ఇప్పటికే దీనిపై అధ్యయనం చేస్తున్న బ్లూ కన్సల్టెన్సీ సమగ్ర ప్రణాళిక రూపొందించింది. ఇంతకుముందు ఆర్‌వీ కన్సల్టెన్సీ కొన్ని ప్రతిపాదనలు రూపొందించగా తాజాగా వరద నియంత్రణ-సుందరీకరణపై బ్లూ కన్సల్టెన్సీ సమగ్ర ముఖచిత్రం రూపొందించినట్లు సమాచారం. ఈ సంస్థ గతంలో నర్మద వరద నియంత్రణ ప్రాజెక్టులో పని చేసిందని అధికారులు చెబుతున్నారు.

వరదపై లెక్కలు 

జలవనరులశాఖ నిపుణులు కొండవీటి వాగు నుంచి వరద సమయంలో రోజూ 16,000 క్యూసెక్కుల వరకు ప్రవాహాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. బ్లూ కన్సల్టెన్సీ నమూనా పరిశీలన చేపట్టి 20 వేల క్యూసెక్కుల వరకు కూడా ఉంటుందని తాజాగా పేర్కొంది. తదనుగుణంగా ముంపును కృష్ణా నదిలోకి మళ్లించే మార్గాలు సూచిస్తోంది.

*గతంలో ఈ వరదను కొంత మళ్లించడంతో పాటు మరికొంత రాజధాని అవసరాలు తీర్చేందుకు జలాశయాలు ఏర్పాటు చేసి నిల్వ చేస్తే మంచిదని జలవనరులశాఖ నిపుణులు భావించారు. ప్రతి వానాకాలంలోను మూడుసార్లు మాత్రమే ఈ వరద వస్తుందని, దీంతో జలాశయాలు నింపగల అవకాశమూ తక్కువేనని తాజా వాదనలు వస్తున్నాయి. ఎలాగూ వైకుంఠపురం వద్ద కృష్ణా నదిపై బ్యారేజి నిర్మాణానికి ప్రతిపాదన ఉంది. అక్కడ 8 టీఎంసీల వరకు నిల్వ చేసే ఆలోచన ఉన్నందున అది సరిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

*కొండవీటి వాగు వరదను ప్రధానంగా కృష్ణా నదిలోకి ఎత్తిపోయడమే మేలని భావిస్తున్నారు. ఉండవల్లి వద్ద అందుకు తగ్గ ఏర్పాట్లు చేయబోతున్నారు. తాజా లెక్కలను ఖరారు చేసుకుని వరద వచ్చిన సందర్భంలో కొంత కృష్ణా పశ్చిమ కాలువ ద్వారాను, మరికొంత నదిలోకి మళ్లిస్తారు.

రాజధానిలోకి పడవ ప్రయాణం- సుందరీకరణ 

ఈ కొండవీటి వాగును ఆధారంగా చేసుకుని కృష్ణా నదిలో నుంచి అమరావతి రాజధాని ప్రాంతంలోకి పడవ ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్నారు. కొండవీటి వాగును ఇందుకు అనువైన కాలువగా తీర్చిదిద్దబోతున్నారు. కృష్ణా నదిలో నుంచి నీరుకొండ, రాజధాని ప్రాంతం మీదుగా తిరిగి ఉండవల్లి వద్ద నదిలో కలిసేలా ఏర్పాట్లు చేయబోతున్నారు.

*కొండవీటి వాగు గట్లను పటిష్ఠం చేస్తారు. ఆ గట్లను సుందరంగాను తీర్చిదిద్దనున్నారు.

*పడవ ప్రయాణం ఏర్పాటు చేసి పర్యాటకంగా తీర్చిదిద్దనున్నారు.

*కృష్ణా నది గట్లను కొంత మార్చి, ఎగుడు దిగుళ్లు లేకుండా చేసి గట్టు పొడవునా రాజధాని ప్రాంతంలోకి నాలుగు వరుసల రహదారి ఏర్పాటు చేయబోతున్నారు. కృష్ణా నదిలో మధ్య మధ్య ఉన్న ద్వీపాల సుందరీకరణ చేపట్టబోతున్నారు.

8న భేటీలో కూలంకషంగా చర్చ 

వాగు వరదపై తాజా లెక్కలు, నమూనా అధ్యయనాలపై సెప్టెంబరు 8న జరిగే సమావేశంలో కూలంకషంగా చర్చించనున్నట్లు జలవనరులశాఖ అధికారులు చెప్పారు. కన్సల్టెన్సీ నివేదికపై సమగ్ర చర్చ తర్వాత తుది నిర్ణయాలు తీసుకుంటారు. ముంపు సమస్య పరిష్కారం వరకు జలవనరులశాఖ దృష్టి సారిస్తున్నా సుందరకీరణ తదితర పనులు అమరావతి అభివృద్ధి సంస్థ అధికారులు పరిశీలించనున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...