Jump to content

జనతా గ్యారేజ్ – ఇండియా లోనే నంబర్ టూ


swas

Recommended Posts

జనతా గ్యారేజ్ – ఇండియా లోనే నంబర్ టూ — ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!!

 
 

ఎన్నో భారీ అంచనాలతో రూపొందుతున్న యంగ్ టైగర్ జనతా గ్యారేజ్ టీజర్ సరికొత్త రికార్డులకు నాంది పలికింది. ఈ సినిమా టీజర్ ను ఈద్ సందర్భంగా మైత్రి మూవీస్ విడుదల చేసింది. తెలుగులో, మలయాళంలో ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. యంగ్ టైగర్ చెప్పే ఒక్క డైలాగ్ తో టీజర్ అదిరిపోయింది.. సినిమా మీద అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. కాగా జనతాగ్యారేజ్ టాలీవుడ్ లో రికార్డుల మోత మోగిస్తోంది. గతంలో నాన్నకు ప్రేమతో టీజర్ తో దుమ్మురేపిన ఎన్టీఆర్ మరోసారి జనతాగ్యారేజ్ టీజర్ తో కుమ్మేశాడు. సోషల్ మీడియాలో జనతాగ్యారేజ్ బాగా ట్రెండ్ అవుతోంది.

 

తెలుగుతో పాటు, మలయాళంలో విడుదలైన జనతాగ్యారేజ్ టీజర్ సోషల్ మీడియాలో కొత్త రికార్డులకు తెర తీసింది. ఫాస్టెస్ట్ మిలియన్ వ్యూవర్స్ టీజర్ గా రికార్డుకెక్కింది (వేగంగా పది లక్షల మంది చూశారు). ఇండియా లో టీజర్ విడుదలైన అతి తక్కువ సమయంలో మిల్లియన్ వ్యూస్ వచ్చిన టీజర్ గా ఇంతకు ముందు తేరి (విజయ్ తమిళ్ సినిమా) పేరు మీద ఉండేది 8.15 గంటలలో ఒక మిల్లియన్ వ్యూస్, అయితే ఈ మధ్య వచ్చిన రజని కాంత్ కబాలి సినిమా టీజర్ ఆ రికార్డ్ ని 3 గంటల్లోనే బ్రేక్ చేసి సంచలనాలు సృష్టించింది. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ టీజర్ 5.40 గంటల్లో ఒక మిలియన్ వ్యూస్ దాటి సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది. అంటే ఇండియా లోనే ఫాస్టెస్ట్ మిలియన్ వ్యూవర్స్ టీజర్ గా ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సెకండ్ ప్లేస్ లో నిలిచిందన్నమాట.అంతే కాకుండా 2 మిలియన్స్ వ్యూస్ ని కూడా ఫాస్ట్ గా దాటిన టీజర్ గా జనతా గ్యారేజ్ తెలుగు లో టాప్ ప్లేస్ లో నిలిచింది.ఇది జనతా గ్యారేజ్ టీమ్ కి మరియు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇస్తుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇప్పటికే 2.6 మిలియన్స్ మంది ఈ టీజర్ ని చూశారు

 
 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...