Jump to content

Ongole MLA Damacharla


Recommended Posts

 మీకుటుంబ సభ్యుల్లో ఒకరిగా ఉంటా 

తాతయ్య స్ఫూర్తితో నీతివంతమైన పాలన అందిస్తా 
ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ 
pks-gen1a.jpg

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ‘నియోజకవర్గంలో ఎవరికి ఏ అవసరమొచ్చినా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావించి తనతో చెప్పుకోవచ్చు. సమస్య పరిష్కారానికి సాయశక్తులా కృషి చేస్తా’నని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ అన్నారు. శాసనసభ్యుడిగా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నగర తెదేపా అధ్యక్షుడు బొమ్మినేని మురళి అధ్యక్షతన స్థానిక ఎంహెచ్‌ఆర్‌ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గత 15 ఏళ్లుగా ఒంగోలు నగరంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని.. తెదేపా అధికారంలోకి వచ్చాక, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మొదటి రెండేళ్లలో చేస్తానని చెప్పిన పనులు పూర్తి చేశానని అన్నారు. ఆ విషయాలు ప్రజలకు తెలిపేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయడం వల్లే ఎన్నికల్లో గెలుపొందానని.. వారికి ఎల్లప్పుడూ అండగా ఉండి.. వారి సంక్షేమం కోసం కృషి చేస్తానని అన్నారు. ప్రజలు ఆశించిన విధంగా రానున్న మూడేళ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపుతానని అన్నారు. ప్రతి రోజూ నీరిచ్చే పరిస్థితి త్వరలో రానుందని.. అయితే ప్రజల కోరిక మేరకు నీరు వృథా కాకుండా రోజు మార్చి రోజు నీరివ్వాలని నిర్ణయించామన్నారు. ఒంగోలు నియోజకవర్గానికినిధుల విషయంలో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తున్నారని అన్నారు. త్వరలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడునూ తీసుకువచ్చి.. కేంద్రం నుంచి నిధులు సాధిస్తామన్నారు. త్వరలో బాలభవన్‌, షాదీఖానా పూర్తి చేస్తామని, కొత్తపట్నం తీరప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. 13 జిల్లాల్లో ఎక్కడా లేని తరహాలో అన్ని హంగులతో త్వరలో జిల్లాలో పార్టీ కార్యాలయం నిర్మిస్తామని అన్నారు. తాతయ్య అడుగుజాడల్లో నడిచి నీతివంతమైన పాలన అందిస్తానని.. రాజకీయాల్లో ఉన్నా.. లేకపోయినా అవినీతిని దరిచేరనీయననిఆయన స్పష్టం చేశారు.

ఒంగోలు అభివృద్ధికి పూర్తి సహకారం 
ఒంగోలు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి పూర్తి సహకారం అందిస్తానని రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. దామచర్ల జనార్దన్‌ అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు కేటాయించి నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడ్డారని అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు తీసుకుని వస్తే ముఖ్యమంత్రి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లి నిధుల కేటాయింపు చేస్తామని అన్నారు. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ రెండేళ్లలో రూ. 460 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో స్టేడియం నిర్మాణంతోపాటు వూరచెరువు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, ఆడిటోరియం నిర్మించాలని, పాత మార్కెట్‌ స్థలంలో ప్రతిపాదించిన కాంప్లెక్స్‌ నిర్మాణాన్ని త్వరలో చేపట్టాలని కోరారు. భూగర్భ మురుగునీటి వ్యవస్థకు ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి పంపితే తనవంతు యత్నం చేస్తానని అన్నారు. సభలో డెయిరీ ఛైర్మన్‌ చల్లా శ్రీనివాసరావు, పీడీసీసీ బ్యాంకు ఛైర్మన్‌ ఈదర మోహన్‌, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ సింగరాజు రాంబాబు, జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ నూకసాని బాలాజీ, పార్టీ నాయకులు యక్కల తులసీరావు, టి.అరుణ, బొమ్మినేని మురళీ, కొమ్మూరి రవిచంద్ర, అనంతమ్మ, హనీఫ్‌ఖాన్‌, టి.వి.శ్రీరామ్మూర్తి, మేకా రవీంద్రబాబు, ఆలూరి ప్రభాకరరావు, తాతాప్రసాద్‌, యర్రాకులశ్రీనివాసరావు, సిరిగిరి రంగారావు, మారెళ్ల వివేకానంద, కామేపల్లి శ్రీను, మాధవి, వై.వి.సుబ్బారావు, సోమినేని రవీంద్ర, ఎస్‌.కె.మహమ్మద్‌ బాషా, మేడికొండ మోహన్‌ తదితరులు పాల్గొనిమాట్లాడారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...