Jump to content

శతచిత్ర సుందరా.. హిందూపూరు హృదయమా


NTRISMYGOD

Recommended Posts

శతచిత్ర సుందరా.. హిందూపూరు హృదయమా
=============================================
బాలయ్య..
ముక్కుసూటిగా ఉండేవారికి ఈ మూడక్షరాలు 
ఒక ఉత్సాహం..
ఒక ఉత్సవం..
ఒక ఉపశమనం..

కపటబుద్ది గల వారికి ఆ మూడక్షరాలంటే 
ఒక ఉరుము..
ఒక ఉత్పాతం..
ఒక ఉపద్రవం

అందుకే ఆయన ఎంతో ఇష్టం గా బసవ తారకం ఇండో అమెరికన్ కాన్సర్ చైర్మన్ గా చేస్తున్న సేవలని కానీ, హిందూపూర్ శాసనసభాసభ్యునిగా గత రెండు సంవత్సరాలు చేసిన 40 కోట్ల అభివృద్ది పనులని కానీ గుర్తించటానికి ఒప్పుకోవటానికి ఇష్టపడరు..

తన తరం అగ్ర నటుల్లో ఒకరిలా ఎప్పుడు కులప్రాతిపదిక న నిలబడాలన్న ఆలోచన బాలయ్య కి కలలో కూడా లేదు..
ప్రసార సాధనాల ముందు ప్రచారం లేనిది ఉన్నట్లు నటించలేదు..
30 సంవత్సరాల క్రితమే ముఖ్యమంత్రి కొడుకు ఐనా మరొక అగ్ర నటుడిలా ప్రజల భూములని దోచుకోలేదు..
ఏ రోజూ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి పైరవీలు చేయలేదు..

అలాంటి వ్యక్తి ధూమపానం చేసాడు అని,సినిమా కార్యక్రమంలో ఏదో మాట్లాడాడు అని చిలువలు పలువలు గా దుష్ప్రచారం చేయటం ఎవరి పనో అందరికీ తెలుసు..

ఉన్నది మాట్లాడాడు
మాట్లాడింది చేసాడు
కల్మషం లేని నవ్వు
కపటం లేని మనసు
ముక్కుసూటి మనిషి
మర్మం తెలియని మనీషి..

తెలుగు చలనచిత్ర పరిశ్రమ భారీ నష్టాల్లో ఉన్న ప్రతిసారీ అఖండ విజయాలు ఇచ్చినా
ఒకే యేడాది 6 అద్భుత విజయాలు అందుకున్నా
దోర వయసు లో ఉన్నపుడు భైరవద్వీపం లో కురూపి గా నటించినా 
ఆదిత్య 369 లో కృష్ణరాయలు గా జీవించినా 
పంచెకట్టులో పల్లెపట్టు కథలని తెరకెక్కించినా 
సీమ పౌరుషాన్ని రోమాంచితంగా వెండితెర మీద అవిష్కరించినా 
ఖద్దరుకీ ఖాకీ కి చిరునామా గా మారినా
శ్రీరామ రాజ్యం లాంటి కళాఖండాన్ని ఈ తరానికి అందించినా 
తారకరాముని తర్వాత చారిత్రక జానపద పౌరాణిక సాంఘిక చిత్రాల్లో నటించాలన్నా
బాలయ్య కే చెల్లింది ..
పక్కన ఉన్నది మోడీ ఐనా , చంద్రశేఖర రావు ఐనా తను నందమూరి తారకరామారావు వారసుడిని అనే విషయం క్షణం కూడా మర్చిపోని రాజసం బాలయ్య సొంతం ..
దర్శకుని మాట కి కట్టుబడి ఉండి కొన్ని సార్లు అందువల్ల ఇబ్బందులు పడినా పరాజయాలు చూసినా బాలయ్య ఒకేలా ఉన్నాడు.. అందుకే ఆయన్ని ఆయనలా చూసిన అభిమానులూ ఆయన్ని వదల్లేదు,, నిర్మాతలూ వదల్లేదు ..
బంగారు బాతు ని కోసుకు తినే కథానాయకులున్న చలన చిత్రసీమలో నిర్మాతల పాలి కొంగు బంగారం మా బాలయ్య..
జయాపజయాలు దైవాధీనాలు అని నమ్మే బాలయ్య అఖండ విజయాలకి పొంగి పారితోషికాలు పెంచలేదు.. పరాజయాలకి వెరసి పారిపోలేదు..
ప్రతి చలన చిత్ర కార్యక్రమంలోనూ ఆ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరి పేరునూ ప్రస్తావించే ఒకే ఒక్క వ్యక్తి ఈ నందమూరి నాయకుడు ..

40 సంవత్సరాల నటజీవిత అనుభవంతో ఆంథ్రుల పౌరుషాన్ని చాటి చెప్పేలా బాలయ్య నటించనున్న తన 100 వ చిత్రం "గౌతమీ పుత్ర శాతకర్ణి " ప్రారంభం సందర్భం గా మా బాలయ్య కి అభినందనలు..

"శత చిత్ర సుందరా 
మా మానస మందిరా
నందమూరి చంద్రమా
హిందూపూరు హృదయమా 
శత మానం భవతి"

 
 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...