Jump to content

యంగ్ టైగర్ డెడికేషన్!


kethineni

Recommended Posts

యంగ్ టైగర్ డెడికేషన్!

 

jnntr.jpgటాలీవుడ్‌లో మిస్టర్ పర్ఫెక్ట్ కోసం నటీనటులకి చుక్కలు చూపించే దర్శకులలో డిఫరెంట్ ఫిలింస్ తీసే సుకుమార్ కూడా ఒకరు. సెట్స్‌లో తను అనుకున్నది అనుకున్నట్టుగా రావడం కోసం సుకుమార్ ఎన్ని టేక్స్ అయినా తీసుకుంటాడు. అలాంటి సుకుమార్‌ని యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తన టాలెంట్‌తో థ్రిల్ చేస్తున్నాడు. ప్రస్తుతం లండన్‌లోని ఈ చిత్ర టీం ఇచ్చిన సమాచారం ప్రకారం ఎన్.టి.ఆర్ తన పెర్ఫార్మన్స్ తో సెట్స్‌లో అందరినీ థ్రిల్ చేస్తున్నాడట, ముఖ్యంగా సుకుమార్ ని.. ఎన్.టి.ఆర్ తనకిచ్చిన ప్రతి సీన్ లోనూ అనుకున్నదానికంటే బెస్ట్ ఇస్తున్నాడట..తను నమ్మిన పాత్ర కోసం ఎన్.టి.ఆర్ చూపిస్తున్న డెడికేషన్ మరియు ఆ పాత్రలో పూర్తిగా లీనమైపోయి మిస్టర్ పర్ఫెక్ట్‌గా నటిస్తుండడం చూసి సుకుమార్ థ్రిల్ అవుతున్నాడట.. అది కూడా రీటేక్స్ లేకుండా ఒకటి లేదా రెండు మూడు టేక్స్ లోనే సీన్ ఓకే అయ్యేలా నటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడట. ఎక్కువ రీటేక్స్ తీసుకోకపోవడం వలన సినిమా షూటింగ్ కూడా చాలా ఫాస్ట్‌గా పూర్తవుతోందని ఈ చిత్ర టీం తెలిపింది. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ రకుల్ ప్రీత్ సింగ్ రాజేంద్ర ప్రసాద్‌లపై వచ్చే ఓ కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఎన్.టి.ఆర్ ఈ సినిమాలో టోటల్‌గా మునుపెన్నడూ కనపడని ఓ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే తన ఫస్ట్ లుక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. బివిఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. 2016 సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యాలనుకుంటున్న ఈ సినిమా కోసం నాన్నకు ప్రేమతో అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...