Jump to content

రాజధాని పరిశీలనలో ట్రిపుల్ ఐటీ భవనాలు


fan no 1

Recommended Posts

నూజివీడు: నూతన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రభుత్వం పరిశీలిస్తున్న అనేక ప్రాంతాల్లో నూజివీడు ఒకటిగా భావిస్తున్నారు. ఇటీవలే రూ.400 కోట్ల తో అధునాతనంగా నిర్మించిన ట్రిపుల్ ఐటీ భవనాల్లో తక్షణమే అసెంబ్లీ, సెక్రటేరియట్‌లను ఏర్పాటు చేసుకునే సౌకర్యం ఉందని రాష్ట్ర అధికారులు నివేదికను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి నివేదించినట్లు విశ్వసనీయ సమాచారం. ట్రిపుల్ ఐటీని జంగంగూడెంలో ఉన్న 200 ఎకరాల ప్రభుత్వ భూమిలో పునర్ నిర్మించవచ్చునని, 2009లో తొలిసారిగా ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేసిన విధంగా ఆధునిక షెడ్‌లను జంగంగూడెంలో నిర్మించి అంచెలవారీగా ట్రిపుల్ ఐటీకి భవనాలు నిర్మించవచ్చని ఈ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. నూజివీడుకు కృష్ణా జలాలు (తాగునీరు) తరలింపు పథకం పూర్తి అయింది. నీటి సరఫరాకు ట్రైల్‌రన్ కూడా నిర్వహించారు. కొద్దిరోజుల్లో ఈ పథకం నూజివీడు పట్టణ ప్రజలకు అందనుంది. ట్రిపుల్ ఐటీ నిమిత్తం గన్నవరం ఎయిర్‌పోర్టుకు నాలుగులైన్ల రహదారి కూడా మంజూరైంది. నూజివీడు నుంచి విజయవాడ 45 కిలోమీటర్లు, అలాగే గన్నవరం ఎయిర్‌పోర్టుకు 40 కిలోమీటర్లు దూరం.
నాగార్జునా విశ్వవిద్యాలయంతో పాటు, నూజివీడు ట్రిపుల్ ఐటీ భవనాలను కూడా అసెంబ్లీ, సెక్రటేరియట్ నిమిత్తం పరిశీలనలో ఉన్న విషయం బయటకు రావడంతో చుట్టుపక్కల భూముల అమ్మకాలు నిలిచిపోయాయి. రాజధాని విషయం తేలిన తరువాతే చూద్దామనుకొని భూములు, తోటలు అమ్మదలచిన వారు తమ అవసరాలకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ట్రిపుల్ ఐటీ 100 ఎకరాల్లో ఉంది. 3,61,734 స్కేర్‌మీటర్ల విస్తీర్ణంలో భవనాలను నిర్మించారు. పక్కనే మరో 100 ఎకరాలు సేకరణ చేయటానికి సిద్ధంగా ఉంది. దీనికి తోడు ఈ ప్రాంతంలో వేలాది ఎకరాల దేవాదాయ, అటవీ శాఖ భూములు ఉన్నాయి. గుంటూరులో హైకోర్టు, రాయలసీమలో ఉక్కు ఉత్పత్తి కర్మాగారాలు, ఇతర భారీపరిశ్రమలు, విశాఖ, తిరుపతిలలో ఐటీ, తదితరలను నెలకొల్పే విధంగా నివేదిక రూపొందించినట్లు తెలుస్తోంది. 

 

http://www.andhrajyothy.com/node/72509

 

 

Link to comment
Share on other sites

Inka notla kattalu pattukoni nuziveedu ki carlu esukoni veltharu, media game bagane aduthundhi

annai maa nuzvid ni capital ga sesthey denekka buddodu-trivikram combo plan chesi   cinema teestha nenu  :child:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...