Jump to content

JAFFA MLA ayinaa anthee


Cyclist

Recommended Posts

" మీ హక్కులేమిటో తెలుసుకోండి. చర్చకు సంబంధించిన పద్ధతులేమిటో తెలుసుకోండి. మీరు రోజూ ఇలా చేయడం ఏం బాగోలేదు. అప్పటికప్పుడు వచ్చి ఇలా చేయడం ఏమిటి? మీరు తలచుకున్నప్పుడల్లా ప్రకటన చేయాలా? ముందు పద్ధతులు ఏమిటో తెలుసుకోండి?'' అని వైసీపీ సభ్యులపై స్పీకర్ మనోహర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఓటింగ్ నిర్వహించాలన్న ఆ పార్టీ డిమాండ్‌ను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అయినా.. వైసీపీ సభ్యులు పట్టు వీడకపోవడంతో అర్ధగంట సేపు శాసనసభను వాయిదావేయాల్సి వచ్చింది. సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. బిల్లుపై ఓటింగ్‌కు అనుమతించాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.

దీనిపై స్పీకర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతి రోజూ ఇలా చేయడం బాగోలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. అయినా వైసీపీ సభ్యులు శాంతించలేదు. ఓటింగ్ కావాల్సిందేనంటూ పట్టుబట్టారు. ఓటింగ్‌పై స్పష్టత ఇవ్వాలని కోరారు. దీనిపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. " మీరు స్పష్టత ఇవ్వాలని అడుగుతున్నారు. ఈ విషయంపై ఎన్నో సార్లు చెప్పాం. మీకు స్పష్టత ఎప్పుడు వస్తుందో చెప్పండి?'' అని సూటిగా ప్రశ్నించారు. సమైక్యాంధ్ర తీర్మానం కోరుతూ వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. ఎంతకీ సభ అదుపులోకి రాకపోవడంతో ప్రారంభమైన పది నిమిషాలకే అర్ధగంటపాటు వాయిదా వేశారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...