Jump to content

AAP ki appudee start ayyindi sontha MLA nundi


Cyclist

Recommended Posts

కేజ్రీవాల్పై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే బిన్నీ
 
51389766502_625x300.jpg
 

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరిపాలనపై సొంత పార్టీలోనే ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. చేసిన వాగ్దానాలను కేజ్రీవాల్ అమలు చేయటం లేదంటూ లక్ష్మీనగర్ ఆప్ ఎమ్మెల్యే  వినోద్‌కుమార్ బిన్నీ మరోసారి విరుచుకుపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన వాగ్ధానాలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని ఆయన బుధవారమిక్కడ వ్యాఖ్యానించారు. ఆప్ పాలన మరో దిశగా వెళ్తోందని... చెప్పే మాటలకు...చేసే పనులకు పొంతన లేదని  వినోద్‌కుమార్ బిన్నీ విమర్శించారు.

గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి.... అన్ని అంశాలు వివరిస్తానని ఆయన తెలిపారు. కీలక సమస్యలను ఆప్ విస్మరిస్తోందని బిన్నీ మండిపడ్డాడరు. అయితే ....కానీ అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని  వ్యాఖ్యలు చేశారు. కాగా మంత్రి పదవి రాలేదన్న ఆగ్రహంతో రగిలిపోతున్న బిన్నీ అలక బూనటం...తర్వాత బుజ్జగింపుల పర్వం కొనసాగిన విషయం తెలిసిందే. అయితే సమసిపోయిందనుకున్న ఈ సమస్య మళ్లీ తలెత్తింది. దాంతో ఆప్ మరోసారి సంకటంలో పడినట్లు అయ్యింది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...