Jump to content

Found this on Facebook !!!


nagkarjun1

Recommended Posts

నిన్న హరన్న ఒక మాట అన్నారు .........ప్రజలు అన్ని చూస్తున్నారు మనం ప్రజాస్వామ్యం లో ఉన్నాము ......వారె నిర్ణయిస్తారు అని ,

 

అవును అన్న నిన్ను ఈ రోజు వరకు టైగర్ హరన్నయ్య అని పిల్చుకున్నాము పిలుచుకుంటాము కూడా .....ముందు మా మనసులో మాటలు చెప్పి తర్వాత మీ వద్దకు వస్తాను. మీరు కేర్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి ఉన్నప్పుడు ప్రతి రోజు మీ ఆరోగ్య పరిస్థితులు కనుక్కుంటూ మీరు ఆయురోరాగ్యాలతో బయటకి రావాలి అని కోరుకున్నది అసలు సిసలు నందమూరి అభిమానులమయిన మేము కాని ఈ రోజున బ్యానర్ ల లో మీ ఫోటో లు వేయించుకుంటున్న వారు కాధు.

 

చాలా కాలం తర్వాత మిమ్మల్ని పోయిన అన్న గారి వర్ధంతి రోజున ఘాట్ దగ్గర చూసి కళ్ళు చెమర్చినది మేము కాని ఈ రోజున రాజకీయ వ్యభిచారం చేస్తున్న మహానుభావులు కాదు .

 

ఈ రోజున చాలా మంది మిత్రులు అడుగుతున్నారు జూనియర్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని .....మీ అందరికి జూనియర్ అంటే ఒక ఆది , ఒక సింహాద్రి వచ్చిన తరువాత మాత్రమే నా మటుకు నాకు ఒక నందమూరి వారసుడు వస్తున్నాడు అని నిన్ను చూడాలని సినిమాకి బ్యానర్ లు కట్టించిన చరిత్ర మాది .

 

జూనియర్ అనే వ్యక్తి కి ఆక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ లో ఉంటె అర్దరాత్రి KIMS హాస్పిటల్ కి వెళ్లి అతనికి ఎలా ఉందొ అని రాత్రి మొత్తం హాస్పిటల్ కాంపౌండ్ లో ఉంది తెల్లవారు జామునకి అతని క్షేమసమాచారం కనుక్కొని వెనక్కి వచాము.......... ఎన్టీఆర్ పక్కన ఉన్న వాళ్ళు ఎంత మంది ఆ రోజున హాస్పిటల్ దగ్గర ఉన్నారో వాళ్ళ మనస్సాక్షులకి తెలసు . ఎవడి పనులు వాడు చేసుకోవాలి ఎవడి సంపాదనలు వాడు సంపాదించుకోవాలి .........ఇంటర్నెట్ లో కూర్చొని నీతి భాష్యాలు చెబ్తాడు ఒక్కొక్కడు

 

సరే ఇది పక్కన పెడదాము నేను ఒక పిల్ల కాకి ని వెళితే ఎంత వెళ్ళకపోతే ఎంత ఏడిస్తే ఎంత నవ్వితే ఎంత ......

 

అన్న తెలుగుదేశం అనే పార్టీ పెట్టినప్పుడు గుడివాడ నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ కి వ్య్తతిరేకంగా పని చేసిన ఎన్టీఆర్ కి ఆ రోజున తెలియదా తాత పెట్టిన పార్టీ తే దే పా అని ....... ఆ రోజున హరన్న కి అండదండలు అందించిన కొడాలి నాని అనే వ్యక్తి ....హరికృష్ణ గారు పురుగు కన్నా హీనం గా చూసే లక్ష్మీపార్వతి తో గుడివాడ లో తిరుగుతుంటే కిమ్మనకుండా పార్టీ ప్రయోజనాల విషయం లో ఎవరయినా ఒకటే అని మాట్లాదినే తమ్ముడి మీద మాట్లాడ గలిగారు .

 

నందమూరి వీరాభిమానులు గా .......తెలుగుదేశం పార్టీ మీద కుటుంబ సభ్యులకి ఎంత హక్కు ఉందో అంతకన్నా ఎక్కువ మాకు ఉన్నది ......మాకు వూహ తెలిసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి స్వార్ధం లేకుండా మా స్వప్రయోజనాల్ని సైతం పక్కన పెట్టి మీ కుటుంబం కోసం మీ కోసం కరుడు కట్టిన మిల్లిటంట్ వ్యవస్థ లా పనిచేస్తున్న మాకు ఇదేనా మీరు అందరు కలిసి ఇచే నజారాన ?

 

మా అందరి కోరిక ఒకటే తెలుగుదేశం పార్టీ కి నాయకుడు చంద్రబాబా? బాలయ్యా? హరన్నా? లోకేశా ? ఎన్టీఆర్ ? అన్నది మాకు అనవసరం ......మీలో మీరు కూర్చొని మాట్లాడుకోండి .......ఒకరంటే ఒకరికి ఇష్టం లేదా మొత్తానికి దూరంగా ఉండండి ......అంతే కాని వ్యవస్థ ని బ్రష్టు పట్టించి పార్టీ నే ప్రాణం గా పెట్టుకొని బతుకుతున్న లక్షల మంది కార్యకర్తల జీవితాలతో ఆడుకోవద్దు .

 

ఒక్కటి మాత్రం చెప్పగలను హిట్స్ ఫ్లోప్స్ చూసి మేము నందమూరి అభిమానులము కాలేదు ...... మీ లో ఉన్న నిష్కల్మష వైఖరి చూసి అభిమానులము అయ్యాము ...మీరు అలా ఉన్నని రోజులు మిమ్మల్ని నెత్తిన పెట్టుకునే ఉంటాము ........

 

అవి లేని రోజున మీరయినా ఒకటే ఇంకొకడయినా ఒకటే మా పనులు మేము చేసుకుంటాము ......

కరుడు గట్టిన నందమూరి అభిమాని ,

మీ గౌతం పుల్లెల .

Link to comment
Share on other sites

/*

 

మా అందరి కోరిక ఒకటే తెలుగుదేశం పార్టీ కి నాయకుడు చంద్రబాబా? బాలయ్యా? హరన్నా? లోకేశా ? ఎన్టీఆర్ ? అన్నది మాకు అనవసరం ......మీలో మీరు కూర్చొని మాట్లాడుకోండి .......ఒకరంటే ఒకరికి ఇష్టం లేదా మొత్తానికి దూరంగా ఉండండి ......అంతే కాని వ్యవస్థ ని బ్రష్టు పట్టించి పార్టీ నే ప్రాణం గా పెట్టుకొని బతుకుతున్న లక్షల మంది కార్యకర్తల జీవితాలతో ఆడుకోవద్దు .[/font]

 

*/

Excellent lines ..!!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...